Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
పాదాలను అందంగా.. తెల్లగా మార్చుకోవడం ఎలా...!
ఆరోగ్యమైన జీవనం కోసం పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. మొత్తం అందంలో పాదాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. శరీరంలో బయటకు కనిపించే భాగాల్లో పాదాలు కూడా ఒకటి. అందుకే పాదాల సంరక్షణ కూడా చాలా ముఖ్యం. పాదాలు చూడటానికి నల్ల, అశుభ్రంగా ఉన్నప్పుడు చూడటానికి అసౌకర్యంగా ఉంటాయి.
ముఖ్యంగా నీటిలోని మురికి, సబ్బుల్లోని ఘాటైన రసాయనాలు చర్మానిక హాని చేస్తాయికాబట్టి పాదాలను దుమ్ము, ధూళి, సూర్యరశ్మి నుండి పాదాలను కాపాడుకోవడానికి షూ వేసుకోవాలి. అయితే షూ ఎన్ని రోజులని షూను వేసుకుంటాం? కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టి మంచి సాండిల్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా హై హీల్స్ వేసుకోవాలనిపిస్తుంది. అటువంటప్పుడు పాదాలను సూర్యరశ్మి నుండి వాతావరణ కాలుష్యం, దుమ్మ, ధూళి నుండి రక్షణ పొంది పాదాలను తెల్లగా మార్చుకోవాలనుకొనే వారు ఈ క్రింది చిట్కాలను పాటించండి.
1. నిమ్మకాయ: నల్లని చర్మాన్ని తెల్లగా మార్చేటటువంటి సహజమైన బ్లీచ్ ఇది. సూర్మరశ్మికి గురిఅయ్యే కాళ్ళు చేతులు, పాదాలు, భుజాలు, ముఖంను నిమ్మరసంతో కొద్దిసేపు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నల్ల బడ్డ చర్మం తిరిగి పూర్వస్థితికి లేదా తెల్లగా మారుతుంది. డెడ్ స్కిన్ ఉండటం వల్ల చర్మం నల్లగా మారేలా చేస్తుంది. కాబట్టి ఈ డెడ్ స్కిన్ తొలగించడానికి నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది.
2. వైట్ వెనిగర్-పసుపు పేస్ట్: సాధారణంగా ఇంట్లోని శెనగపిండిని చర్మ సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. కొద్దిగా శెనగపిండిని పసుపుతో కలిపి, పెరుగు, నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని పాదాలకు మాస్క్ లా అప్లై చేయాలి ఇరవై నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అందమైన ఆరోగ్యమైన పాదాలు మీ సొంతం అవుతాయి.

3. హాట్ ఆయిల్ మసాజ్: పాదాలు ఎండిపోయినట్లుగా మరియు చూడటానికి గరుకుగా ఉంటాయి. అందుకు కారణం కాళ్ళలోని నూనె గ్రంధులు. కాబట్టి పాదాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రతి రోజూ గోరువెచ్చని నూనెతో పాదాలకు మాయిశ్చరైజ్ చేయాలి. హాట్ ఆయిల్ మసాజ్ చర్మానికి మాయిశ్చరైజ్ గా మాత్రమే కాదు, డెడ్ స్కిన్ తొలగించడంలో కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా పాదాలను శుభ్రపరుస్తుంది. చర్మంలోని దుమ్మ, ధూలిని తొలగించి శుభ్రపడేలా పాదాలు ఉండాలంటే గోరువెచ్చని లేదా హాట్ ఆయిల్ మసాజ్ చాలా బాగా సహాయపడుతుంది. కాలును స్ర్కబ్ చేసిన తర్వాత కాళ్ళకు మాయిశ్చరైజర్ తప్పక వాడాలి. ఇలా చేయడం వల్ల పాదాలు తెల్లగా మారుతాయి.
4. కోకోనట్ వాటర్: సూర్య రశ్మి వల్ల పాదాలు నల్లబడటం జరిగితే కోకోనట్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. పాదాలకు కొబ్బరి నీటితో మసాజ్ చేయాలి. సూర్యరశ్మి నుండి పాదాలను సంరక్షించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమడీ అని చెప్పవచ్చు. కాబట్టి స్నానానికి పదిహేను నిముషాల ముందు కొబ్బరి నీటితో మసాజ్ చేయాలి.
ఈ హోం రెమడీస్ నల్లగా మారిన పాదాలను సహజంగా తెల్లగా మార్చడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి మీరూ ప్రయత్నించి చూడండి.



Click it and Unblock the Notifications