Latest Updates
-
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం!
పెడిక్యూరి-మెనిక్యూర్ లేకుండా ఇంటి వద్దే ఆరోగ్యకరమైన గోళ్ళ సంరక్షణ
చేతి గోళ్ళు లేదా కాలి గోళ్ళు మన చేతులకు, కాళ్ళకు అంటుకుని వుండే ముఖ్యమైన భాగాలు, అందువల్ల గోళ్ళ గురించి సమగ్రమైన జాగ్రత్త తీసుకోవడం అవసరం. పరిశుభ్రంగా, ఆరోగ్యంగా వుండే గోళ్ళు మన చేతులు, వేళ్ళ అందాన్ని పెంచడమే కాకుండా సూక్ష్మ క్రిములు, బాక్టీరియాల వల్ల వచ్చే ఎన్నో అనారోగ్యాల నుంచి కాపాడతాయి.
చర్యలు :
1. గోళ్ళ కోసం మంచి ఆహార ప్రణాళిక పాటించండి. పెళుసుగా వుండే గోళ్ళు మనం తరచుగా వినే సమస్య, ఇది చాలా వరకు ఐరన్ లోపం వల్ల వస్తుంది. గోళ్ళ గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలంటే మీరు ఆహారంలో పుష్కలంగా ఐరన్ ఉండేలా చూసుకోవాలి.
2. లివర్, పల్చగా వుండే ఎర్రటి మాంసం, చేపలు, సోయా ఉత్పత్తులు, చిక్కుళ్ళు, పప్పు దినుసులు, తృణధాన్యాలు, బచ్చలి కూర, తాజా కూరగాయలు, తోటకూర, కొత్తిమీర, టర్కీ తో సహా పౌల్ట్రీ ఉత్పత్తులు, గింజలు, గుడ్డు లోని పచ్చ సొన, కిస్మిస్, ఖర్జూరా, నేరేడు పండు లాంటి వాటిలో ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది.

3. బీట్ రూట్ లలో మరింత కాల్షియం, విటమిన్ డి వుంటాయి కనుక ఆరోగ్యకరమైన గోళ్ళ పెరుగుదలకు దోహదపడుతుంది. రోజూ బీట్ రూట్ తింటుంటే మీ వెలి గోళ్ళు నమ్మశక్యం కానంత ఆరోగ్యంగా ధృడంగా తయారవుతాయి. అలాగే నిత్యం గోళ్ళ సంరక్షణ కోసం, మీ ఆహారంలో పాల ఉత్పత్తుల లాంటి కాల్షియం అధికంగా వుండే పదార్ధాలు చేర్చండి.
చిట్కాలు:
1. ఒక కప్పు మామూలు నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండి దాంట్లో మీ చేతి గోళ్ళు లేదా కాలి గోళ్ళు కొద్ది నిమిషాల పాటు అందులో వుంచండి. ఇప్పుడు వీటిని వేడినీటిలో బాగా శుభ్రం చేసి మాయిశ్చరైజర్ వాడండి. మీ గోళ్ళ మీద మచ్చలు లేకుండా ఉండడానికి ఇది బాగా తోడ్పడుతుంది.
2. మీ గోళ్ళ సంరక్షణకు మరింత మంచి చికిత్స ఏమిటంటే మీ గోళ్ళను నిమ్మరసంలో ముంచిన ఒక దూది ఉండతో అద్దండి, కొద్ది సేపాగి మొత్తాన్ని నీటిలో కడిగి వేయండి. ఈ విధానం పాటిస్తే, మీ గోళ్ళు ధృఢ౦గానూ, ఆరోగ్యంగానూ వుంటాయి.
3. స్వచ్చమైన ఆలివ్ నూనె గోళ్ళ సంరక్షణ తో సహా చాలా సౌందర్య సూత్రాలకు సంప్రదాయంగా గృహ చికిత్సలో భాగంగా వాడబడుతోంది. మీ చేతి లేదా కాలి వేళ్ళ గోళ్ళు అందంగా ఉండాలన్నా, మేర్వాలన్నా వాటి మీద రోజూ ఆలివ్ నూనె రాస్తూ వుంటే చాలా గుణం కనబడుతుంది.
4. గోళ్ళ సంరక్షణ కోసం ఈ చేతి వేళ్ళ గోళ్ళు, కాలి వేళ్ళ గోళ్ళు 8-10 నిమిషాల పాటు గోరువెచ్చటి ఆవ నూనెలో ముంచ౦డి. రక్త ప్రసరణ సాధారణంగా ఉండేలా చూడడానికి వాటిలో ఒక్కోదాన్నీ మెల్లిగా క్రమంగా రుద్దుతూ వుండండి. మీ గోళ్ళన్నీ ఆరోగ్యంగా, గట్టిగా ఉండాలంటే ఇలా రోజూ చేయాలి.
5. వేసవిలో చమట పీల్చేందుకు సేంద్రియ పత్తి తో చేసిన తొడుగులు లేదా మేజోళ్ళు ధరించండి. ఇవి ఖచ్చితంగా మన గోళ్ళలో ఇరుక్కునే క్రిముల వల్ల కలిగే వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
6. నిజమైన గోళ్ళ సంరక్షణ కావాలంటే మీ గోళ్ళను సరళ రేఖ ఆకారంలో కత్తిరించండి, వంపుగా కాదు. గోళ్ళు సరిగ్గా కత్తిరించక పోవడం, కాలి వేళ్ళకు దెబ్బలు తగలడం, సరిగ్గా పట్టని బూట్లు లేదా చెప్పులు కూడా కాలి గోళ్ళు మూలల మీద విరిగి పోయేలా చేస్తాయి. దీనివల్ల గోళ్ళు లోపలి పెరిగే ప్రమాదం వుంది.
7. ఈ చేతి గోళ్ళను వెచ్చగా, సౌకర్యంగా వుండే ఆలివ్ నూనె లో 15-20 నిమిషాల పాటు రోజు మార్చి రోజు ముంచుతూ వుండండి. లేత కాలి లేదా చేతి వేళ్ళ గోళ్ళను గట్టి పరచేందుకు చాలా ఉపయోగపడే చిట్కా ఇది.



Click it and Unblock the Notifications