Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పగిలిన పెదాలను నివారించే నేచురల్ హోం మెరెడీస్
అమ్మాయిల అందం అనగానే గుర్తొచ్చేది పెదవులు. చక్కటి పెదవులు అందాన్ని ఇనుమడింపచేస్తాయి. అందుకేనేమో అధరామృతం అని కవులు వర్ణిస్తారు. అయితే ఇంత ప్రధాన పాత్రను పోషించే పెదాలు పగిలితే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చర్మం పైన 16 పొరలు ఉంటాయి. కానీ పెదవులపై ఉండే చర్మంపై మాత్రం 3 నుంచి 4 పొరలు మాత్రమే ఉంటాయి. అందువల్ల పెదవుల పగుళ్లు సర్వసాధారణం. దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది. అంతే కాదు, అకర్షణీయంగా ఉండవు మరియు నొప్పిని కలిగిస్తాయి.
సాధారణంగా మీరు హెల్తీ డైట్ ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ తినడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. మరియు అధికంగా నీరుతీసుకోవాలి. ముఖ్యంగా రోజులో 8-12గ్లాసులు నీరు తీసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు తీసుకొనే ఏట్రీట్మెంట్ అయినా సరే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పగిలిన పెదాలకు కూడా..అందుకే పెదవుల పగలకుండా ఉండేందుకు చిన్న చిట్కాలు మీకోసం...

నీరు ఎక్కువగా త్రాగాలి:
డీహైడ్రేషన్ జరగకుండా రోజుకు సరిపడా నీరు త్రాగాలి. శరీరానికి సరిపడా నీరు అందకపోతే, శరీరం డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది ఫలితంగా పెదాలు పగుళ్ళు ఏర్పుడుతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రతి రోజూ 8గ్లాసుల నీళ్ళు త్రాగాలి.

హెల్తీ డైట్:
మీ రెగ్యులర్ డైట్ లో తాజా పండ్లు మరియు కూరగాయలు చేర్చుకోవడం మంచిది. మీ శరీరం అసిడక్ కు గురైతే అది పెదాల పగుళ్ళకు దారితీస్తుంది . కాబట్టి, మీ శరీర పిహెన్ ను నిర్వహించడానికి తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తినాలి.అయితే అధిక మోతాదులో ఒకే సారి న్యూట్రిషియన్స్ కూడా మీ శరీరానికి హని కలిగిస్తాయి.

డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడం :
ఏ రెమెడీస్ అయినా ఉపయోగించడానికి ముందు డెడ్ స్కిన్ ను తొలగించుకోవాలి. డెడ్ స్కిన్ సెల్స్ ను రఫ్ గా తొలగించకూడదు. అది మరింత ఇన్ప్లమేషన్ కు గురిచేయవచ్చు మరియు ఇన్ఫెక్షన్ కు గురిచేయవచ్చు.

తడి దుస్తులు:
శుభ్రం చేసిన వస్త్రాన్ని తీసుకొని, గోరువెచ్చని నీటిలో డిప్ చేసి, అదనపు నీటిని బాగా పిండేసి, తర్వాత తడి వస్త్రంతో మీ పెదాల మీద రుద్దాలి. అలాగే ఆ తడి వస్త్రాన్ని మీ పెదాల మీద 20-30సెకెన్స్ అలాగే పెట్టాలి.

టూత్ బ్రెష్:
సున్నితంగా ఉండే టూత్ బ్రెష్ తీసుకొని, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీ పెదాల మీద నిదానంగా రుద్దాలి. పెదాలను కార్నర్ నుండి మద్యకు, తిరిగి మద్య నుండి కార్న్ కు రుద్దాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

షుగర్:
ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మరియు ఒక చెంచా సుగర్ తీసుకొని రెండింటిని మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేయాలి. ఇది మీ పెదాల మీద ఉన్న పొట్టను తొలగిస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

లిప్ బామ్:
రెమెడీస్ ఉపయోగించన తర్వాత లిప్ బామ్ ను ఉపయోగించండి . లిప్ బామ్ ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ ను ఉపయోగించువచ్చు.

లిప్ బామ్ ను రాత్రంతా అలాగే ఉంచాలి:
రాత్రి సమయంలో లిప్ బామ్ ను అప్లై చేసి, రాత్రి నిద్రించడం వల్ల ఎక్కువ సహాయపడుతుంది మరియు పెదాలు మీద మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పెదాలను నాలుకతో తడపడం వంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల మీ పెదాలు పొడిగా మారి పగుళ్ళకు దారితీస్తుంది . కాబట్టి రోజంత లిప్ బామ్ ను అప్లై చేసి, పెదాలను మాయిశ్చరైజ్ గా ఉంచుకోండి...



Click it and Unblock the Notifications