పురుషులు స్మూత్ స్కిన్ పొందడానికి అనుసరించాల్సిన 10 చిట్కాలు...!

హాండ్సమ్ గా ఉండాలని కోరుకుంటున్నారా..ఐతే ఈ టిప్స్ మీకోసమే

స్త్రీలలో లాగే పురుషు కూడా తమ అందం గురించి ఎక్కువ శ్రద్ద తీసుకుంటారు. పురుషుల తమ సౌందర్యానికి సున్నితమైన చర్మం మరియు మెరిసే చర్మం ఉండాలని ఎందుకు కోరుకోరు చెప్పండి. ఈ మోడ్రన్ జనరేషన్ లో చాలా వరకూ చాలా మంది మెట్రో-లైంగిక వర్గానికి చెందినవారు. పురుషులు సున్నితమైన.. మృదువైన చర్మం కలిగి ఉండటంలో తప్పేముంది?సున్నితమైన చర్మం ఉండటం వల్ల వారు మగవారు కాదని కాదు అర్థం. వారు వారి చర్మ సంరక్షణ కోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఒక మృదువైన మేనిఛాయ పొందడానికి తగిన శ్రద్ద తీసుకుంటున్నారని తెలుస్తుంది.

పురుషులు కొన్ని సాధారణ స్కిన్ కేర్ టిప్స్ తీసుకోవడం వల్ల నునుపైన చర్మ సౌందర్యాన్ని పొందగలుగుతారు. మృదువైన చర్మం పొందడానికి సాధారణంగా వారి రోజువారి జీవితంలో తీసుకొనే జాగ్రత్తలకు మరికొంత శ్రద్ద తీసుకుంటే చాలు. కొన్ని చిట్కాలను క్రమం తప్పకుండా పాటించగలిగినట్లైతే ప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.

పురుషు నునుపైన చర్మాన్ని పొందడానికి చాలా సులభ చిట్కాలు సహాయపడుతాయి. ఉదా: పురుషులు ప్రతి రోజూ క్రమం తప్పకుండా షేవింగ్ చేసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుగుతుంది. అంతే కాదు, వారి చర్మ సౌందర్య రక్షణ కోసం ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించడానికి ముందు రెగ్యులర్ గా లోషన్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. మగవారి చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని సులభ చిట్కాలు ఉన్నాయి..అవేంటో ఒక సారి చూడండి...

పురుషులు స్మూత్ స్కిన్ పొందడానికి అనుసరించాల్సిన 10 చిట్కాలు...!

రెగ్యులర్ షేవింగ్: సాధారణంగా ప్రతి రోజూ షేవింగ్ చేసుకోవాలంటే బద్దకిస్తారు. అయితే నునుపైన చర్మం కావాలనుకొనే వారు రెగ్యులర్ షేవ్ మాత్రమే కాదు క్లోజ్ షేవ్ చేసుకుంటుండాలి.

పురుషులు స్మూత్ స్కిన్ పొందడానికి అనుసరించాల్సిన 10 చిట్కాలు...!

ఫేష్ వాష్: చర్మం రక్షణ కల్పించుకోవడానికి చాలా చర్చల తర్వాత, కొందరు మగవారు వారు ముఖానికి ఉపయోగించే సోపుల గురించి చెడు అభిప్రాయానికి వచ్చారు. వారు మాత్రమే కాదు, సోపు ఉపయోగించే మిగిలిన వారు కూడా ప్రతి రోజూ సోపుకు బదులు మైల్డ్ ఫేస్ వాష్ ఉపయోగించడం చాలా అవసరం.

పురుషులు స్మూత్ స్కిన్ పొందడానికి అనుసరించాల్సిన 10 చిట్కాలు...!

ఫేస్ స్ర్కబ్బింగ్: కొంతమంది పురుషులు ఇప్పటికే ముఖానికి ఫేస్ వాష్ లు ఉపయోగించడం మొదలు పెట్టి ఉండవచ్చు. అయితే స్ర్కబ్బింగ్ విషయానికి వస్తే, వారు ఇప్పటికీ బద్దకస్తులే. మీరు డెడ్ స్కిన్ తొలగించుకోవాలనుకున్నా, చర్మంలో పేరుకు పోయిన మురికిని వదిలించుకోవాలనుకొన్నా వారంలో కనీసం మూడు సార్లైనా స్ర్కబ్బింగ్ చేసుకోవడం చాలా మంచిది.

పురుషులు స్మూత్ స్కిన్ పొందడానికి అనుసరించాల్సిన 10 చిట్కాలు...!

సన్ స్క్రీన్ లోషన్: బయటకు వెళ్ళడానికి ముందు శరీరానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం ఉత్తమమైన మార్గం. సూర్యరశ్మి వల్ల మహిళలకంటే పురుషు చర్మానికి ఎక్కువ హాని కలుగుతుంది. కాబట్టి శరీరాన్నిసూర్యని వేడినుండి యూవీ కిరణాలనుండి కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ అప్లై చేయడం చాలా అవసరం.

పురుషులు స్మూత్ స్కిన్ పొందడానికి అనుసరించాల్సిన 10 చిట్కాలు...!

మొటిమలకు చికిత్స: మగవారికి గడ్డపెరగడం వల్ల అక్కడ దుమ్ము, దూళిపేరుకోవడం వల్ల మహిళలకంటే పురుషులకే అధికంగా మొటమలు ఏర్పడుతుంటాయి. కొన్ని సార్లు అసమానమైన షేవింగ్ చేయడం వల్ల కూడా మొటిమలు రావడానికి కారణమవుతుంది. కాబట్టి మొటిమలు రాంగే తక్షణ చికిత్స తీసుకోవాలి. అందుకోసం కొన్ని సహజనివారణోపాయాలు ఉపయోగించాలి.

పురుషులు స్మూత్ స్కిన్ పొందడానికి అనుసరించాల్సిన 10 చిట్కాలు...!

హైడ్రేటింగ్ స్కిన్ జెల్: సాధారణంగా పురుషులు పొడి చర్మం మరియు ఇతర చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అందుకు కారణం వారు ఎటువంటి క్రీములు మరియ మాయిశ్చరైజర్స్ ఉపయోగించకపోవడమే. స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తేమగా ఉంచుకోవడానికి శరీరానికి హైడ్రేటింగ్ క్రీమ్ జెల్ ను అప్లై చేయాలి.

పురుషులు స్మూత్ స్కిన్ పొందడానికి అనుసరించాల్సిన 10 చిట్కాలు...!

రాత్రి సమయంలో బాడీ లోషన్ అప్లై చేయాలి: సాధారణంగా నైట్ క్రీములను బాడీలోషన్లను స్త్రీలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . పురుషులు కూడా ఈ బాడీలోషన్లు రాత్రి సమయంలో అప్లై చేయడం వల్ల ఎటువంటి హాని జరగదు. ఇది చర్మం రాత్రంతా మృదువైన ఉండడానికి అనుమతిస్తుంది.

పురుషులు స్మూత్ స్కిన్ పొందడానికి అనుసరించాల్సిన 10 చిట్కాలు...!

వెనుక భాగంలో స్క్రబ్బింగ్ చేసుకోవాలి: సాధారణంగా పురుషులు క్షణాల్లో స్నానాన్ని ముగించుకొని వచ్చేస్తుంటారు. చాలా మంది వీపు బాగాన్ని చాలా రోజుల వరకూ కూడా తోముకోరు. దాంతో చర్మసమస్యలు, చారలు, మొటిమలు ఏర్పడి ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి, ఒక స్క్రబ్బర్ ను తెచ్చి మీకు మీరుగా రుద్దుకోవడం లేదా తల్లిదగ్గర లేదా భార్య, గర్ల్ ఫ్రెండ్ తో వీపు రుద్దించుకోవడం బెటర్. ఇలా చేయడం వల్ల చర్మ మీద మచ్చలు, మొటిమలు, ప్యాచ్ స్కిన్ ను నివారించుకోవచ్చు.

పురుషులు స్మూత్ స్కిన్ పొందడానికి అనుసరించాల్సిన 10 చిట్కాలు...!

పాదాలను శుభ్రం చేసుకోవాలి: సాల్ట్ వాటర్ లో మీ పాదాలను 10నిముషాలు నానబెట్టి, తర్వాత లిక్విడ్ సోపు రాసి ప్యూమిస్ స్టోన్ తో రుద్ది శుభ్రం చేసుకోవాలి.

పురుషులు స్మూత్ స్కిన్ పొందడానికి అనుసరించాల్సిన 10 చిట్కాలు...!

స్పాల వద్ద ఆయిల్ మసాజ్: బాడీ మసాజ్ లు స్త్రీలకు మాత్రమే కాదు. పురుషులు కూడా ఆయిల్ మసాజ్ మరియు మడ్ వ్రాప్ వంటివి స్పా సెంటర్లలో చేయించుకోవడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు సున్నిత చర్మాన్ని పొందగలుగుతారు.

Story first published: Friday, April 26, 2013, 16:08 [IST]
Desktop Bottom Promotion