Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాదాలు&అరచేతులు మృదువుగా ఉంచే బెస్ట్ టిప్స్
సాధారణంగా కొందరి చర్మం పరిశీలించినట్లైతే చాలా పొడిగా మరియు పగుళ్ళతో కూడా ఉంటుంది. అందుకు ప్రధాన కారణం సూర్యకిరణాల నుండి వెలువడే ఆల్ట్రా వయోలెట్ కిరణాలు(యువి) మరియు వాతావరణ పరిస్థితులు, కాలుష్యం వంటివి చర్మం మీద ప్రభావం చూపెడుతాయి. యూవీ కిరణాలు మరియు కాలుష్యం కాకుండా, చేతులు, అరచేతులు, పాదాలు కొన్ని రసాయనాల మరియు సోపుల వల్ల కూడా మరింత కఠినంగా మారుతుంది. శీతాకాలంలో చాలా చల్లని వాతావరణం మరియు శీతాకాలంలో పొడి గాలుల వల్ల స్త్రీ మరియు పురుషుల ఇద్దరిలోనూ అరచేతుల్లో మరియు పాదాల్లో పగుళ్ళు ఏర్పడుతాయి. ఎందుకంటే శీతాకాలంలో మరీ చల్లగా మరియు మరీ లోటెంపరేచర్ ఉన్నా కూడా చర్మం తట్టుకోలేదు. వెంటనే చర్మంలో మార్పుటు సంభవిస్తాయి. శీతాకాలంలో పాదాలను మరియు అరచేతులను సాఫ్ట్ గా మార్చుకోవడం కోసం ప్రతి ఒక్కరికీ ఒక సవాలు వంటిదే....
అయితే, కొన్ని వారాల పాటు ప్రతి రోజూ సహజ మరియు ఆరోగ్యవంతమైన పదార్థాలు ఉపయోగించడం వల్ల చర్మంలో కఠినత్వాన్ని తొలగించుకోవచ్చు. మీ పాదానలు మరియు అరచేతులను సాఫ్ట్ గా మార్చుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ లో ఉన్న చిట్కాలను పాటించడం ద్వారా ఎక్కువగా సహాయపడుతాయి.. మరి ఆ చిట్కాలేంటో ఒక సారి చూద్దాం..

గోరువెచ్చని నీటిలో కొంత సమయం నాననివ్వాలి:
గోరువెచ్చని నీటిలో పాదాలు కానీ, అరచేతులను కానీ కొద్ది సమయంలో నానబెట్టడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది. మంచి ఫలితాలను పొందాలంటే పాదాలను మరియు అరచేతులను 10నిముషాల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. గోరు వెచ్చని నీటిలో పాదాలను మరియు అరచేతులను పెట్టడం వల్ల కొంత పొడిబారవచ్చు.

గోరువెచ్చని నీటితో షవర్ బాత్:
గోరువెచ్చని నీటిలో ల్యావెండర్ ఆయిల్ లేదా రోజ్ ఆయిల్ మిక్స్ చేసి గోరువెచ్చగా షవర్ బాగ్ చేయడం ఉత్తమం.

నిమ్మతొక్కతో స్ర్కబ్ చేయాలి:
గోరువెచ్చని నీటిలో పాదాలను, అరచేతులను నానబెట్టిన తర్వాత బయటకు తీసిన పొడి టవల్ తో తడిని పూర్తిగా తొలగించాలి. తర్వాత నిమ్మతొక్కను పంచదార లేదా ఉప్పులో అద్ది పాదాల మీద, మరియు అరచేతుల్లో స్క్రబ్ చేయాలి. సర్కులర్ మోషన్ లో స్ర్కబ్ చేయడం వల్ల అరచేతులు, వేళ్ళు డ్యామేజ్ కాకుండా ఉంటాయి. తర్వాత ప్యూమిస్ స్టోన్ ఉపయోగించి రుద్ది గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి మంచి ఫలితాలను మీరు గమనించవచ్చు.

స్ర్కబ్బింగ్ చేసుకొన్న తర్వాత :
స్ర్కబ్బింగ్ చేసుకొన్నత తర్వాత, తిరిగి మీ పాదాలను మరియు అరచేతులను గోరువెచ్చని నీటిలో డిప్ చేయడం మర్చిపోకండి. స్ర్కబ్బింగ్ చేసుకొన్న తర్వాత కూడా ఇలా గోరువెచ్చని నీటిలో పాదాలు, చేతులను కొంత సమయం నానబెట్టుకోవడం వల్ల చర్మం చాలా సాఫ్ట్ గా మరియు మంచి షైనింగ్ తో కనబడుతుంది.

నేచురల్ ఆయిల్:
చిన్న కాటన్ బాల్స్ మీద కొంత నేచురల్ ఆయిల్ ను పోసి, కఠినంగా మారిన పాదాలు, మరియు చేతుల చర్మం మీద మర్ధన చేయాలి. సర్క్యులర్ మోషన్ లో మాయిశ్చరైజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మురికిని నిర్మూలించాలి:
మీ పాదానలు సాఫ్ట్ గా ఉంచుకోవాలనుకుంటే, దుమ్ము, దూళి నుండి పాదాలకు రక్షణ కల్పించడానికి సాక్సులను ధరించాలి. దాంతో ఎక్కువ సమయం పాదాలు క్లీన్ గా ఉంటాయి. అదేవిధంగా నేచురల్ ఆయిల్ చేతులకు మర్దన చేసిన తర్వాత చేతులకు గ్లౌజులను ధరించాలి. ఈ పద్దతిని మీరు తిరిగా పడుకొనే ముందు కూడా ఫాలో చేసినట్లైతే చాలా బాగా సహాయపడుతుంది. పాదాలు, చేతులు సాఫ్ట్ గా మారుతాయి.

హోం రెమడీ:
ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మరియు రెండు టేబుల్ స్పూన్ల పంచదార తీసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమంతో అరచేతులను మరియు పాదానలు రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల పాదాలు, అరచేతులు చాలా సాప్ట్ గా పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
మంచి ఫలితాల కోసం, రెగ్యులర్ గా పాటించండి. ప్రతి రోజూ నేచురల్ ఆయిల్స్ ను కఠిన చర్మానికి అప్లై చేయడం చాలా అవసరం. ఎందుకంటే, క్రమంగా రాయడం వల్ల సాఫ్ట్ స్కిన్ ను త్వరగా పొందవచ్చు.



Click it and Unblock the Notifications