For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో పాదాల సంరక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు

|

చలికాలంలో చర్మం సంరక్షణ చాలా అవసరం. ముఖ్యంగా పాదాల సంరక్షణ చిట్కాలు చాలా ముఖ్యమైనటువంటివి. చలికాలంలో పాదాలు, చేతులు రంగుమారిపోతాయి. పగుళ్లు వచ్చి వికారంగా కనిపిస్తాయి. ప్రత్యేకమైన సంరక్షణ తీసుకుంటే పాదాలు, చేతులను కోమలంగా ఉంచగలుగుతాం. చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది.

అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అది తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు ఈ సీజన్ లో ఎక్కువగా పొడిబారడం జరుగుతుంది. చర్మం అతి త్వరగా పొడిబారి, పగుళ్ళు ఏర్పడి, చారలు కనబడుతుంటాయి. కాళ్ళు మరింత అసహ్యంగా కనబడుతాయి. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పాదాలను మాయిశ్చరైజ్ చేయడం: చలికాలంలో తప్పనిసరిగా అనుసరించాల్సిన ముఖ్యమైనటువంటి చిట్కాల్లో ఇది ఖచ్ఛితంగా అనుసరించాల్సినది. చలికాలంలో రోజులో మూడు నాలుగు సార్లు మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పాదాలు ఫ్రెష్ గా ఫిట్ గా మరియు హెల్తీగా ఉంటాయి.

మందంగా ఉండే షూలను ధరించాలి: స్లిప్లర్స్ ధరించడం సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, ఈ చలికాలంలో వాటిని ధరించకపోవడం మంచిది ! చలికాలంలో పాదాలకు రక్షణ కల్పించాలంటే అందుకు మందంగా ఉన్న షూలను ధరించాలి.మీరు బూట్లు ధరిస్తే కూడా ఏం అవ్వదు. మీకు సౌకర్యవంతంగా ఉన్నవి ధరించవచ్చు.

పెడిక్యూర్: అందమైన పాదాలు సొంతం చేసుకోవాలంటే 15 రోజులకోసారి పెడిక్యూర్ చేయించాలి. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్లలేని వారు ఇంట్లో దొరికే వస్తువులతోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు. గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు, హైడ్రోజన్‌పెరాకె్సైడ్ లేదా డెటాల్, షాంపూ వేయాలి. అందులో 15 నుంచి 20 నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి ప్యూమిక్‌స్టోన్ లేదా స్క్రబ్బింగ్ స్టోన్ లేదా బ్రష్ ఉపయోగించి రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి బాగా రుద్దాలి. అనంతరం ఆలివ్ ఆయిల్‌తో కాలును మొత్తం మసాజ్ చేయాలి. అనంతరం పాదాలకు సాక్స్ వేసుకోవాలి.

ఎక్కువ నీరు త్రాగాలి: వేసవికాలం, చలికాలం అనికాకుండా అన్ని సీజన్స్ లో ఎంత ఎక్కువగా నీరు త్రాగితే అంత మంచిది. చర్మం మరియు పాదాలు హెల్తీగా కాంతివంతంగా ఉంటాయి. అంతే కాదు అంతర్గత అవయవాలు కూడా చాలా మేలు చేస్తుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకూ ఎక్కువగా నీరు త్రాగాలి. చలికాలంలో ఫూట్ కేర్ టిప్స్ లో అనుసరించాల్సిన చిట్కాల్లో ఇది ఒకటి.

సాక్సులు ధరించాలి: పాదాల సంరక్షణలో భాగంగా సాక్సులు వాడుతుంటారు చాలామంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ధరించాలి. లేదంటే దుమ్ము, మురికి చేరిపోయి చెమట పట్టినప్పుడు పాదాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంటుంది. అలానే నైలాన్‌ సాక్సుల కంటే కాటన్‌వి సౌకర్యంగా ఉంటాయి. రాత్రిపూట తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కొని పొడి తువాలుతో తుడిచి కొబ్బరి నూనె రాయాలి. కొద్దిసేపు పాదాలను మునివేళ్లతో నొక్కుతూ ఉంటే రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. మర్నాటికి పాదాలు మెత్తబడతాయి.

హాట్ వాటర్ ట్రీట్మెంట్: చర్మానికి మాయిశ్చరైజ్ చేయడానికి ముందు, మీ పాదాలను హాట్ వాటర్ లో 10 నిముషాలు డిప్ చేయాలి. అలా చేయడం వల్ల పాదాలను విశ్రాంతి కలిగిస్తుంది. రోజంతా సౌకర్యవంతంగా ఉంటుంది.

6 Tips For Foot Care In Winter

English summary

6 Tips For Foot Care In Winter

Winter is the time when your skin goes for a toss. Foot care tips in winter are very important. You must know how to take care of your skin in winter. Most people do not take the efforts to take care of their foot during winter season.
Story first published: Saturday, November 22, 2014, 17:08 [IST]
Desktop Bottom Promotion