Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
కాలి గోళ్ళులో ఫంగస్ నివారించడానికి ఉత్తమ హోం రెమెడీస్
టాయ్ నెయిల్ ఫంగస్(కాళివేళ్లగోర్లకు శిలీంద్ర తాకిడి), శాస్త్రీయంగా ఓనీకోమైకోసిస్ అంటారు. ఇది , ఫంగస్ లేదా బ్యాక్టీరియా నెయిల్ బెడ్ లేదా గోళ్ళయొక్క చర్మం లేదాక్యూటికల్స్ ద్వారా గోళ్ళయొక్క చర్మంలోనికి చొచ్చుకొని పోతుంది, ఫలితంగా గోళ్ళు రంగులో మార్పు మరియు నొప్పి మరియు కొన్ని సందర్భాలు ఇబ్బందికరంగా ఉంటుంది. గోళ్ళు రంగు మారినప్పడు, ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటుంది. నెయిల్ ఫంగస్ కు వెంటనే చికిత్సను అంధించడం చాలా ముఖ్యం. ఇన్ఫెక్షన్ మరింత తీవ్రంగా అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఈ సమస్యను నివారించడానికి అందుబాటులో అనేక ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, అయితే ఈ మెడిసిన్స్ లో చాలా వరకూ సైడ్ ఎఫెక్ట్స్ లివర్ డ్యామేజ్ వంటివి దుష్పభావాలకు కారణం కావచ్చు. అందువల్ల టాయ్ నెయిల్ ఫంగస్ సమస్యకు గరైనవారు ప్రత్యామ్నాయంగా ఏదైనా హోం రెమెడీస్ ను చూసుకోవడం ఉత్తమం.
కొన్ని సంవత్సరాలు, టాయ్ నెయిల్ ఫంగస్ సమస్యకు కొన్ని హోం రెమెడీలను ఉపయోగిస్తున్నారు. అయితే వీటికి ఎటువంటి క్లీనికల్ ట్రయల్స్ లేదా ఇవి పనిచేసే విధానం మీద ఎటువంటిసమాంతర రుజువు చూపించలేదు. ఈ హోం రెమడీస్ రిస్క్ ఫ్రీ మరియు చాలా చవకైనవి కూడా. మరి టాయ్ నెయిల్ ఫంగస్ నివారణకు ఉపయోగించే హోం రెమడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

వెనిగర్:
ఇది ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా వైట్ వెనిగర్ ఏదైనాకావచ్చు, ఫింగర్ లేదా టాయ్ నెయిల్ ఫంగస్ నివారించడానికి ఇది ఒక చౌకైన చికిత్సలో ఒకటి. ప్రతి రోజూ నీళ్ళు మరియు వెనిగర్ చెరిసమానంగా తీసుకొని కాళ్ళను శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . ప్రత్యామ్నాయంగా వేడినీటి స్నానం లేదా చన్నీటి స్నానం . ఈ రెండింటిలో ఏది చేసిన పాదాలను 30గంటపాటు ఆపిల్ సైడర్ వెనిగర్ నీటిలో నానబెట్టి తర్వాత స్నానం చేయాలి.దీన్ని రోజులో మూడుసార్లు చేసుకోవచ్చు

విక్స్ వాపర్ రబ్
ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడానికి ఇది ఒక సింపుల్ మరియు ఎఫెక్టివ్ రెమెడీ. అయితే, విక్స్ వాపర్ రబ్ యొక్క బలమైన వాసన అధికంగా ఉంటుంది , ఈ హోం రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఇన్ఫెక్షన్ అయిన గోళ్ళ మొత్తానికి విక్స్ వాపర్ రబ్ ను అప్లై చేయవచ్చు . తర్వాత సాధారణ గాలిలో ఆరనివ్వాలి . ఇంకా మీరు బ్యాండ్ ఎయిడ్ ను కూడా ఉపయోగించవచ్చు . దీన్ని రోజుకు రెండు సార్లు ప్రయత్నించవచ్చు .

సాల్ట్ వాటర్ లో సోక్ చేయడం
కొన్ని సందర్భాల్లో, మీరు సముద్రనీటికి దగ్గరలో జీవిస్తున్నట్లైతే ఆనీటిలో కాళ్ళను కొంచెం సేపు డిప్ చేయాలి. నెయిల్ ఫంగస్ మరియు బ్యాక్టీరియా నివారించడానికి సాల్ట్ వాటర్ ఒక నేచురల్ హోం రెమెడీ. సముద్రం దగ్గరలో మీరు నివసించనట్లైతే ఉప్పును నీటిలో వేసి, ఆ నీటిలో పాదాలను ముంచి కొద్దిసేపు నాననివ్వాలి. ఈ హోం రెమెడీ ఎఫెక్టివ్ గాపనిచేస్తుందని నిరూపించబడినది. మొదట, టాయ్ నెయిల్ ను ట్రిమ్ చేయాలి. టాయ్ నెయిల్ కు సాల్ట్ వాటర్ తాకే విధంగా చూసుకోవాలి.
ఒక బేసిన్ లో, కొన్ని గోరువెచ్చనినీళ్ళుపసి, కాళ్ళమునిగేలా నీళ్ళు పోసి అందులో హైడ్రోజెన్ పెరాక్సైడ్ వేసి తర్వాత అందులో మీ పాదాలను డిప్ చేయాలి. తర్వాత పాదాలను పైకి తీసి దానికి మీద కొద్దిగా సీసాల్ట్ చల్లాలి. మూడు నిముషాలు అలాగే ఉంచి, తిరిగి కాళ్ళను నీటిలో ముంచాలి.

బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా, ఇందుల ఎక్కువ ఆల్కలైన్ ఉండటం వల్ల పిహెచ్ లెవల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఫంగస్ లేదా బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉండదు. నీళ్ళలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి పేస్ట్ లా చేసి, ఈపేస్ట్ ను కాళ్ళవేళ్ళు, గోళ్లకు అప్లై చేయాలి. అలాగే కొంత బేకింగ్ సోడాను షులలోపల చిలకరించాలి.దాంతో ఫంగస్ వృద్ధి చెందకుండా ఉంటుంది.

లెమన్ గ్రాస్ ఆయిల్:
లెమన్ గ్రాస్ ఆయిల్ ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది టాయ్ నెయిల్ ఫంగస్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్లో యాంటీఫంగల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలుఅధికంగా కలిగి ఉన్నాయి. టాయ్ నెయిల్స్ లో ఉన్న ఫంగస్ మీద దాడి చేస్తుంది . గోళ్ళ వక్రీకరణ, సూక్ష్మ గోళ్ళు మరియు నాసిరకమైన గోళ్ళ వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
ఈ లెమన్ గ్రాస్ నూనెను ఇతర నూనెలతో కలిపి ఉపయోగించవచ్చని మద్దతిస్తున్నారు. ఇతరనూనెలతో కలిపి చేయడం వల్ల కూడా ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . బ్యాక్టీరియా మరియు ఫంగస్ ను నాశనం చేస్తుంది . అందుకు కారియర్ ఆయిల్ లేదా ద్రాక్ష విత్తనాల నూనె వంటివి హెల్తీ ఫుడ్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు . ఈ నూనెలు పాత్ర లెమన్ గ్రాస్ ఆయిల్ యొక్క తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది.
క్యారియర్ నూనె (1 ఔన్స్)ను లెమన్ గ్రాస్ ఆయిల్ (12చుక్కలతో)మిక్స్ చేయాలి. ఈ ఆయిల్ ను అప్లై చేయడానికి ముందు చేతులను శుభ్రంగా చేసుకోవాలి. అలాగే మీరు ఇంకా లెమన్ గ్రాస్ టీ(1cup)ను రోజుకు 3సార్లు త్రాగవచ్చు. అలాగే ప్రభావం ఉన్న ప్రాంతంలో టీ బ్యాగ్స్ ను ఉపయోగించవచ్చు . ఇలా చేయడం వల్ల ఫంగస్ త్వరగా క్లియర్ చేస్తుంది.

పసుపు:
టర్మరిక్ ఆయిల్ మరియు నీళ్ళు 1:3రేషన్ లో తీసుకోవాలి . ఈ రెండింటి మిశ్రమంతో టాయ్ నెయిల్స్ ను కాటన్ తో అప్లై చేయాలి. ఈ పద్దతిని రోజుకు మూడు సార్లు పునరావృతం చేయవచ్చు. అదనంగా పసుపు (300మిల్లీగ్రామ్స్)యొక్క సారంను నోటి ద్వారా తీసుకోవచ్చు.

వేపనూనె:
వేపనూనెలో యాంటిఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వేపనూనె నెయిల్ ఫంగస్ ను నివారించడానికి సహాయపడుతుంది మరియు టాయ్ నెయిల్స్ కు తగినంత తేమను కూడా అందిస్తుంది. టాయ్ నెయిల్స్ మీద ఈ నూనెను అప్లై చేయడం వల్ల , ఎఫెక్ట్ అయిన ప్రదేశంలో నే కాకుండా చుట్టూ కూడా అప్లై చేయాలి. వేపనూనెలో సల్ఫ్యూరస్ కాంపౌండ్స్ వాసన కలిగి ఉంటుంది.

కొబ్బరినూనె:
గాయంను లేదా పుండును నయం చేసే లక్షణాలు కొబ్బరి నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో లారిక్ యాసిడ్ , సాచురేటెడ్ ఫ్యాట్స్ ను కలిగి ఉండటం అరుదైన రకం. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ మీడియం చైన్ ట్రై గ్లిజరైడ్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి.
కొబ్బరి నూనె డ్యామేజ్ అయిన చర్మాన్ని తిరిగి పునరుద్దరించడానికి సహాయపడుతుంది. ఈ నూనె నొప్పిని నివారించడానికి మరియు టాయ్ నెయిల్ ఫంగస్ ను నిర్మూలించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫంగస్ ను మీరు ఒక సారి నిర్మూలించగలిగినట్లైతే అది తిరిగి అది రాకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications











