Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
దంతాలను సంరక్షించుకోవడంలో మీరు చేసే తప్పిదాలు
దంత సంరక్షణ చాలా వరకూ విఫలమైందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది అందానికి ఇచ్చే ప్రాధాన్యత దంతసంరక్షణకు, ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. దంత సంరక్షణను చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దాని వల్ల ఆరోగ్యం మీద ఎక్కువ దుష్ప్రభావం ఉంటుంది. దంత సంరక్షణ పాటించే కొంత మందికి మాత్రం సరైన మార్గంలో ఎలా సంరక్షించుకోవాలనేది మాత్రం తెలియదు.
ఏదో ఒకరకంగా బ్రష్ చేసుకొన్నామా, నోరుకడిగేసుకొన్నామా అన్న విధంగా చేస్తుంటారు. అయితే దంతాలను సంరక్షించుకోవడం చాలా సులభం. దంతాలను సంరక్షించుకోగలిగినప్పుడే మనం ఆరోగ్యంగా జీవించగలము. దంత సంరక్షణాలో మనం ప్రతి రోజూ చేసి చిన్న చిన్న తప్పిదాలను ఈ క్రింది లిస్ట్ లో తెలుపడం జరిగింది.వీటిని కనుక సరిదిద్దుకొన్నట్లైతే మీరు తప్పకుండా ఆరోగ్యకరమైన దంతాలను పొందుతారు. మరి ఆ తప్పిదాలేంటో ఒకసారి చూద్దాం...

బ్రేక్ ఫాస్ట్ కు ముందు బ్రష్ చేసుకోవడం:
ప్రతి సారి పళ్ళను తోముకొన్నట్లైతే నోట్లో ఏమౌతుంది?దంతాల మీ పొర( నేచురల్ ఎనామిల్ )ను తగ్గిస్తుంది. బ్రష్ చేసి 60నిముషాల లోపలే మీరు ఆహారాన్ని తీసుకొన్నట్లైతే, మీ దంతాల మీద ఎనామిల్ అనే రక్షణ కవచం లేకున్నా ఉన్నప్పుడు ఆహారాల యొక్క ఆసిడ్స్ దంతాల మీద ఎక్కువ ప్రభావం చూపి సాధారణం కంటే ఎక్కువగా దంతాలను డ్యామేజ్ చేస్తాయి.

బ్రేక్ ఫాస్ట్ ముగిసిన వెంటనే బ్రష్ చేయడం:
చాలా మంది చేసి అతి పెద్ద తప్పిదం బ్రేక్ ఫాస్ట్ తిన్న వెంటనే వాష్ బేసిన్ వద్దకు హాడావిడిగా వెళ్ళి నోరు కడుక్కుంటారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియాను సులభంగా నివారించగలం అనుకొంటారు. అయితే ఇలా చేయడం వల్ల దంతాలను రుద్దడం వల్ల దంతాల యొక్క ఎనామిల్ తగ్గిపోతుంది.

స్వీట్స్ తిన్న తర్వాత బ్రష్ చేసుకోకపోవడం:
స్వీట్స్ లో చాలా ప్రమాధకరమైన పదార్థాలుగా చెబుతుంటారు, ఎందుకంటే వీటీలో ప్రిజర్వేటివ్స్ మరియు యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరం యొక్క ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా దంతాల యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తాయి. దంతాలను మరింత బలహీనంగా మార్చుతాయి మరియు ప్రతి సారి దుష్ప్రభావాలను పెంచుతాయి.

నోటి దుర్వాసనను నిర్మూలించడానికి ఒత్తిడి(మరింత బలంగా దంతాల మీద రుద్దడం)తో బ్రష్ చేయడం:
నోటిలో ప్రధానమైనటువంటి భాగాలు దంతాలు, నాలుకమీద ఆల్ట్రా బ్యాడ్ స్మెల్ వల్ల మీలో ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి దుర్వాసను మీరు కూడా ఇష్టపడరు. కాబట్టి, మీ దంతాలు ఊడిపోకుండా ఉండాలంటే, దంతాలను సున్నితంగా రుద్దాలి. దంతాలతో పాటు నాలుకమీద మరియు దంతాల మద్య బ్రష్ చేసుకోవడం వల్ల వ్యత్యాసం మీకే తెలుస్తుంది.

నిద్రించడానికి ముందు బ్రష్ చేయకపోవడం:
నిద్రలేవాలంటే చాలా మంది బద్దకిస్తుంటారు. అదే నిద్రపోవాలంటే త్వరగా బెడ్ మీదకు చేరిపోతారు. నిద్రించే ముందు బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఆహార పదర్థాల యొక్క చిన్న చిన్న స్పటికలు, ముక్కలు నోట్లో దంతాల మద్య, నాలుక క్రింద, దవడ వల్ల చేరి, 8గంటల సేపు నోట్లో ఉండటం వల్ల చెడు బ్యాక్టీరియా చేరి దంతాలను పాడుచేస్తుంది. నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.

పాచి తొలగించకపోవడం:
ఇండియాలో దంత సంరక్షణ విధానంలో చాలా విస్తృతంగా నిర్యక్ష్యం చేస్తారు. మనం సాధారణంగా ఇది మనకు అనవసరమైన విషయం. తీసుకొన్న ఆహారం దంతాల మద్య చిక్కుకొని, నోట్లో పాచిగా మారుతుంది. కాబట్టి, ఎప్పటికప్పడు నాలుక మీద, దంతాల మీద పాచిని తొలగించపోతే, బ్యాక్టీరియా చేరి దంతక్షయానికి దారితీస్తుంది.

భోజనం చేసిన తర్వాత మౌత్ వాష్ చేసుకోవడం:
మీల్స్ తీసుకొన్న తర్వాత నోటి నుండి వాసన రాకుండా ఉండటానికి మౌత్ వాష్ ను ఉపయోగిస్తుంటారు. మౌత్ వాష్ లో ఉండే సాధరణ యాసిడ్స్ దంతాల మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి, భోజనం చేసిన 45నిముషాల తర్వాత మౌత్ వాష్ చేసుకోవడం ఉత్తమ మార్గం.

సరైన మెడికల్ చెకప్ లు చేయించుకోకపోవడం:
ప్రతి 6నెలకొకసారి డెంటిస్ట్ ను సంప్రదిస్తుండాలి. ఓరల్ హెల్త్ ను అనుసరించడం వల్ల మన ఓరల్ హెల్త్ ను కాపాడుకోవడం మాత్రమే కాదు, మొత్తం మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము. లేదంటే ముందు ముందు మరింత ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications











