Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
అండర్ ఆర్మ్స్(చంకల్లో)నలుపును తగ్గించే చిట్కాలు(వీడియో)
ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు అండర్ ఆర్మ్స్(చంకల్లో)నలుపు సమస్యతో బాధపడుతున్నారు. అందమైన డ్రెస్సులను, స్లీవ్ లెస్ డ్రెస్సులను ధరించడానికి ఇబ్బంది పడుతూ అసౌకర్యంగా ఫీలవుతున్నారు. అడర్ ఆర్మ్స్ (చంకల్లో)నలుపుగా ప్యాచ్ ఏర్పడటానికి ముఖ్య కారణం పెర్ఫ్యూమ్స్, డియోడొరెంట్స్ మరియు బాడీ స్ప్రేలే. ఈ కెమికల్ ప్రొడక్ట్స్ మన చర్మం యొక్క రంగును మార్చేస్తాయి. ఎవరెవరైతే ఈ ప్రొడక్ట్స్ను ఉపయోగస్తున్నారో వారందరు కూడా అందులో వైటనింగ్ కెమికల్స్ ప్రభావం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవల్సి వస్తున్నది. అయితే ఎవరైతే చర్మ ఆరోగ్యమీద శ్రద్ద కలిగిన వారు కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా ఉత్తమ హోం రెమడీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
అండర్ ఆర్మ్స్ తేలిక పరిచే కొన్ని ఉత్తమ హోం రెమడీలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ హోం రెమడీస్ మంచి ఫలితాలివ్వడంతో పాటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. చాలా వరకూ ఇవి బెస్ట్ గా పనిచేస్తాయని నిరూపించుకోబడినవి. మీకు మరింత సులభంగా అర్ధం అవ్వడానికి ఈ క్రింది వీడియో ద్వారా తెలయజేస్తున్నాం..క్లిక్ చేసి చూడండి.

నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్: అండర్ ఆర్మ్స్ బ్లాక్ ప్యాచ్ లను నివారించుకోవడానికి కొన్ని పండ్ల మరియు వెజిటేబుల్స్ కూడా సహాయపడుతాయి. ముఖ్యంగా అసిడిక్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలున్న ఫ్రూట్స్ మరియ వెజిటేబుల్స్ అద్భుతంగా సహాయపడుతాయి. అందులో నిమ్మకాయ, మరియు కీరదోసకాయ వంటివి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఏఒక్కటైనా తీసుకొన, వాటితో చంకల్లో మర్దన చేసి 15నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.
బేకింగ్ సోడా మరియు నీళ్ళు: బేకింగ్ సోడ మరియు నీళ్ళు రెండింటిని చేర్చి, పేస్ట్ లా చేసి చంకల్లో అప్లై చేయాలి. 15 నుండి 20 నిముషాలు అలాగ ఉండి తర్వాత శుభ్రం చేయడం వల్ల నలుపు తొలగిపోతుంది. అందుకే దీన్ని స్కిన్ వైటనింగ్ ప్యాక్ అంటారు . అంతే కాదు, ఈ వైటనింగ్ ప్యాక్ అండర్ ఆర్మ్స్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఈ అద్భుతమైనటువంటి హోం రెమెడీ మూసుకుపోయిన చర్మ రంద్రాలను ప్రకాశవంతంగా మార్చుతుంది.
పాలు మరియు పెరుగు: పాలను, పెరుగుతో మిక్స్ చేయడం వల్ల ఈ రెండింటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. ఈ రెండింటికి కొద్ది మైదా కానీ, లేదా శెనగిపిండి, లేదా పెసరపిండి వంటివాటిలో ఏదోఒకటి మిక్స్ చేసి అప్లై చేస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. అప్లై చేసిన తర్వాత 15నిముషాలు అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications