Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
హోం మేడ్ హ్యాండ్ స్ర్కబ్: నునుపైన చేతులు
సాధారణంగా ప్రతి ఒక్కరి ముఖంలో డెడ్ స్కిస్ సెల్స్ ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి స్క్రబ్బింగ్ ఉపయోగిస్తుంటాం. ముఖంలో మాదిరిగానే చేతుల మీద కూడా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి. చేతుల అందానికి అడ్డుపడే మీద డెడ్ స్కిన్ సెల్స్ ను తగ్గిండానికి కూడా హ్యాండ్ స్ర్కబ్బింగ్ ను ఉపయోగించవచ్చు . చర్మం నునుపుగా మరియు తెల్లగా మార్చుకోవడానికి ఎటువంటి పగుళ్ళు లేకుండా చూడటానికి డెడ్ స్కిన్ సెల్స్ తొలగించుకోవడానికి మార్కెట్లో వివిధ రకాల ట్రీట్మెంట్లు, క్రీములు, స్ర్కబ్స్ ను అందుబాటులో ఉన్నాయి. కానీ, అవి ఖర్చుతో కూడుకొన్నవి. మరియు ఫలితం శాస్వతంగా ఉండదు. అందువల్ల స్వచ్చమైన, నునుపైచే చేతుల యొక్క సౌందర్యాన్ని పొందాలంటే, మన ఇంట్లో నేచురల్ గా దొరికే మనం హోం మేడ్ హ్యాండ్ స్ర్కబ్ ను ఉపయోగించుకోవచ్చు.
మన ఇంట్లో ఉండే వివిధ రకాల నేచురల్ పదార్థాలను ఉపయోగించి, హోం మేడ్ స్ర్కబ్బింగ్ ను ఉపయోగించుకొని చేతులను శుభ్ర పరచుకోవచ్చు . ఈ హోం మేడ్ స్ర్కబ్బింగ్ పదార్థాలు ఖరీదు కూడా తక్కువే. చేతులను అందంగా ఆకర్షణీయంగా మార్చే హోం మేడ్ నేచురల్ స్ర్కబ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. షుగర్ హ్యాండ్ స్ర్కబ్ : షుగర్ ఒక నేచురల్ బ్యూటీ వస్తువు. చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది . మీరు షుగర్, లెమన్ జ్యూస్ తేనె మిక్స్ చేసి చేతులకు స్ర్కబ్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా ఫలితానలు అంధిస్తుంది . షుగర్ స్ర్కబ్ చాలా మన్నికైనది మరియు ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది . చర్మరంధ్రాల్లో చేరిన అన్ని రకాల దుమ్ముధూళిని శుభ్రం చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ హ్యాండ్ స్ర్కబ్ కు కొద్దిగా మినిరల్ ఆయిల్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.
2. బాదం హ్యాండ్ స్ర్కబ్: చర్మం శుభ్రం చేయడానికి బాదం కూడా అద్భుతంగా సహాయపడుతుంది మరియు చర్మంలోనో పేరుకొన్న మలినాలు మరియు దుమ్ము, ధూళిని తొలగించడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. బాదం ఇంకా క్లియర్ గా చేతులను శుభ్రం చేస్తుంది. బాదంతో హోం మేడ్ హ్యాండ్ స్ర్కబ్ తయారుచేసుకోవాలంటే డ్రై బాదంను పొడి చేసుకోవాలి. దీనికి కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి తర్వాత మీ చేతులకు రుద్ది తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా మీకు సమయం దొరికినప్పుడల్లా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. చేతులు శుభ్రపడుతాయి.
3. తేనెతో హ్యాండ్ స్ర్కబ్: తేనె ఒక మంచి క్లీనరగ్ గా భావిస్తారు. మంచి క్లెన్సర్ గా పనిచేయడం వల్ల ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది మరియు చర్మరంధ్రాల్లోని మలినాలను తొలగిస్తుంది. తేనెతో హోంమేడ్ హ్యాండ్ స్ర్కబ్ వల్ల చేతులు శుభ్రపడుతాయి. కొద్దిగా తేనె తీసుకొని నేరుగా చేతులకు మర్ధరన చేయాలి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగి శుభ్రపరచుకోవాలి. అలాగే మంచి ఫలితం కోసం తేనెకు కొంద్దిగా పంచదార కూడా జోడించి స్ర్కబ్బింగ్ గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని రెగ్యులర్ గా చేస్తే మంచి కాంతివంతమైన చర్మంతో పాటు, స్మూత్ హ్యాండ్స్ ను మీరు పొందవచ్చు.
4. ఆయిల్ మరియు ఉప్పుతో హ్యాండ్ స్ర్కబ్: కొబ్బరి నూనె మరియు ఉప్పు ఒక మంచి హ్యాండ్ స్ర్కబ్ గా పనిచేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ లో చేతులను శుభ్రం చేసుకోవచ్చు . కొద్దిగా కొబ్బరి నూనెను ఉపయోగించి చేతలకు మొత్తం అప్లై చేయాలి. తర్వాత కొద్దిగా ఉప్పు తీసుకొని చేతలకు మీద చిలకరించి రుద్దిలి. చేతుల మీద మురికి తొలగిపోతుంది. చేతులు శుభ్రపడటంతో పాటు, ఎఫెక్టివ్ గా మరికిని తొలగిస్తాయి.



Click it and Unblock the Notifications