For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లిప్ స్టిక్ వలన కలిగే హానికరమైన ప్రభావాలతొ జాగ్రత్తగా సుమా..

|

ప్రతి స్త్రీ ఆమె సౌందర్యసాధనాల బాక్స్ లో ఆమెకు ఇష్టమైన షేడ్ తో ఉన్న లిప్స్టిక్ ఉంచుకుంటుంది. స్త్రీ యొక్క పెదవులు హైలైట్ చేసుకోవటం ముఖ్యం అని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదు. అందుకే స్త్రీ పెదవులను 'రోజీ పెదవులు' గా పిలుస్తుంటారు.

కానీ, ఎందుకంటే వాటి తయారీలో ఉపయోగించే పదార్థాల కారణంగా లిప్స్టిక్లు ఉపయోగించటం వలన అనేక ప్రతికూలతలు ఉన్నాయి.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే లిప్స్టిక్లు ఉపయోగించడానికి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది లేదా మీరు రోజుకు ఒకసారి మాత్రమే లిప్స్టిక్ వర్తిమ్పచేయతానికి నిర్ణయించుకోవాలి. లిప్స్టిక్ నాణ్యత కూడా లెక్కలోకి వొస్తుంది. ఎల్లప్పుడూ నాణ్యత గల ఉత్పత్తులనే ఉపయోగించండి, చౌకగా మరియు తక్కువ నాణ్యత ఉన్నవాటిని నివారించండి. దీనివలన లిప్స్టిక్లు వలన కలిగే అత్యధిక సమస్యలను పరిష్కరించవొచ్చు.

పెదాల సంరక్షణ విషయానికి వొచ్చినప్పుడు మీరు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంతే కాకుండా పెదవులపైన ప్రత్యక్ష చర్య వలన, లిప్స్టిక్లలో ఉన్న హానికరమైన రసాయనాలు మీ మొత్తం ఆరోగ్యం మీద ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతుంది. నిరంతరం చర్మం మీద లిప్స్టిక్ తాకుతూ ఉండటం వలన ప్రమాదవశాత్తు రసాయనాలు శరీరం వ్యవస్థలోకి ప్రవేశించటం వలన సాధారణంగా హానికరమైన ప్రభావం కలుగుతుంది.

మీరు నిరంతరం తక్కువ నాణ్యత లిప్స్టిక్లు ఉపయోగిస్తే ఏర్పడే కొన్నిహానికరమైన ప్రభావాలను క్రింద ఇచ్చాము. చూడండి.

హెవీ మెటల్స్
లిప్స్టిక్లలో గల క్రోమియం, కాడ్మియం మరియు మెగ్నీషియం స్థాయిలు ఆలోచింపచేసేవిగా ఉన్నాయని పరిశోధనలు చెపుతున్నాయి. వీటి ఫలితంగా ప్రమాదకరమైన వ్యాధులు మరియు అవయవాలకు హాని కలిగే ప్రమాదం పెరుగుతున్నది. కాడ్మియం ఎక్కువ స్థాయిలలో మూత్రపిండాలలో నిల్వ ఉండటం వలన మూత్రపిండ వైఫల్యం సంభవిస్తున్నది. రోజులో అనేక సార్లు లిప్స్టిక్లు వర్తింపచేయటం వలన కడుపులో కణితులకు దారితీస్తున్నది. లిప్స్టిక్లు వాడకం వలన ఇంకా ఎన్నో హానికరమైన ప్రభావాలు ఉన్నాయి.

Harmful Effects Of Lipsticks

లెడ్
లిప్స్టిక్లలో ప్రమాదకరమైన సీసం అధిక మోతాదులో ఉన్నదని పరిశోధనలు వెల్లడించాయి. ఈ లెడ్ నాడి కణ సంహారక విషపూరితం మరియు ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. దీనివలన మెదడుకు నష్టం కలగవచ్చు. హార్మోన్ అసమతుల్యత మరియు వంధ్యత్వానికి కలగటానికి ఈ లెడ్ ఒక కారణం. దీనిని అతితక్కువ పరిమాణంలో తీసుకున్నా, అది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

పెట్రోకెమికల్స్
లిప్స్టిక్లు తయారీలో ఉపయోగించే పదార్థాలలో ఇది ఒకటి. ఇది కూడా ఆరోగ్యానికి హానికరం. దీనిలో ముడి చమురు మరియు సహజ వాయువు నుంచి తయారయిన రసాయనాలు ఉంటాయి. దీని వినియోగం వలన పునరుత్పత్తి, అభివృద్ధి, తెలివితేటలు మరియు పెరుగుదలతో సంకర్షణ చెందే ఎండోక్రైన్ అంతరాయానికి కారణమవుతుంది. లిప్స్టిక్ల వినియోగం వలన కలిగే హానికరమైన ప్రభావాలలో ఇది ఒకటి.

Harmful Effects Of Lipsticks

ఫార్మాల్డిహైడ్ మరియు మినరల్ ఆయిల్
ఫార్మాల్డిహైడ్ కూడా మానవ కాన్సర్ కారకము అని చెపుతారు. శ్వాసలో గురక, దగ్గు, కళ్ళు మరియు చర్మం ఇరిటేషన్ వంటివి ఫార్మాల్డిహైడ్ వలన కలిగే ఇతర ప్రభావాలు. లిప్స్టిక్ లో ఉపయోగించే మినరల్ ఆయిల్ శరీర రంధ్రాలను మూసివేస్తుంది. లిప్స్టిక్లలో ఉండే రసాయనాలు కారణంగా కలిగే హానికరమైన ప్రభావాలు చాలా ఉన్నాయి.

పారాబెన్స్ మరియు బిస్మత్ ఆక్సీ క్లోరైడ్
ఈ రెండు పదార్థాలను లిప్స్టిక్లు తయారీలో ఉపయోగిస్తారు. లిప్స్టిక్ల వలన హానికరమైన ప్రభావం ఎందుకు కలుగుతున్నదంటే ఈ రెండు పదార్ధాలు కాన్సర్ కారకాలు కావటమే. పారాబెన్స్ కూడా ఫార్మాల్డిహైడ్ వంటి నిల్వపదార్థాల వలెనే పనిచేస్తాయి. దీనిని లిప్స్టిక్ నిల్వ ఉంచడంలో ఉపయోగిస్తున్నప్పటికీ, ఇది శరీరానికి చాలా హానికరం.

లిప్స్టిక్లు కొనుగోలు విషయంలో నాణ్యతపై రాజీ ఎప్పుడూపడకూడదు . వీటి వినియోగాన్ని తగ్గించండి. మీరు భద్రతా కారణాల కోసం ఇంట్లో తయారుచేసిన లిప్స్టిక్లు ప్రయత్నించవచ్చు.

Desktop Bottom Promotion