Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పగిలిన పెదవులకు కొబ్బరినూనెతో కలిగే ప్రయోజనాలు
పగిలిన పెదవులతో ఇబ్బందులు పడుతున్నారా? శీతాకాలంలో మీ పెదవులు పగుళ్ళు ఇబ్బంది పెడుతోందా? ఎన్ని లిప్ బామ్స్ అప్లై చేసినా సమస్య పరిష్కారం కావట్లేదా? అయితే మీరు కొబ్బరి నూనెతో ఈ సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు. పగిలిన పెదవుల ఇబ్బందిని సరి చేసేందుకు కొబ్బరి నూనెను ఎంతో కాలంగా ఎంతో కాలంగా వాడుకలో ఉంది.
పెదవులు ఎండిపోయి పొరలుగా ఏర్పడుతుంటే పెదవులకు తగినంత తేమను అందించడం ముఖ్యం. పెదవుల పగుళ్ళకు ఎన్నో కారణాలున్నాయి. వాతావరణ మార్పుల వల్ల అలాగే పెదవులను తరచూ తడిచేయడం వల్ల పెదవుల పగుళ్ళు ఏర్పడతాయి. మార్కెట్ లో వివిధ ఫ్లేవర్స్ లో లభ్యమయ్యే లిప్ బామ్స్ ని వాడే బదులు సహజసిద్ధంగా దొరికే కొబ్బరి నూనెను పెదవులకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో ఉండే ఎన్నో మినరల్స్ పెదవులకు కావలసినంత తేమను అందించి పెదవులు మృదువుగా ఉండేందుకు తోడ్పడుతాయి.

పెదవుల పగుళ్ళకు కొబ్బరినూనె చిట్కా
హై క్వాలిటీ లిప్ స్క్రబ్ తో పెదవులపై నున్న పొడి చర్మపు పొరలను తొలగించండి
ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను ఒక టీస్పూన్ ఉప్పుతో కలపండి. ఈ మిశ్రమాన్ని పెదవులపై కాటన్ బాల్ తో అద్దండి. కోమలంగా మీ వేళ్ళతో పెదవులపై సర్కులర్ మోషన్ లో ఒక నిమిషం పాటు మసాజ్ చేయండి. కొద్ది సేపటి తరువాత, మీ పెదవులు కోమలంగా, మృదువుగా తయారయ్యాయన్న భావన మీకు కలుగుతుంది. ఆ తరువాత మెత్తటి వస్త్రంతో మీ పెదవులను తుడుచుకోండి.
2. లిప్ బామ్ బదులు కొబ్బరి నూనెను వాడండి
కొన్ని చుక్కల కొబ్బరి నూనెను మీ అరచేతిలోకి తీసుకుని మీ వేలిని అందులో ముంచి మీ పెదవులపై సున్నితంగా మసాజ్ చేయండి. మీ పెదవులు పొడిపొడిగా ఉన్నాయనిపించినప్పుడు ఈ పద్దతిని పాటించండి.
3. హోమ్ మేడ్ లిప్ బామ్
ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను ముప్పావువంతు టేబుల్ స్పూన్ హనీతో కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక మూత ఉన్న జార్ లో భద్రపరచండి. రోజంతా ఎప్పుడు కావస్తే అప్పుడు ఈ హోమ్ మేడ్ లిప్ బామ్ ను వాడవచ్చు.



Click it and Unblock the Notifications