Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
పురుషుల పాదాల పగుళ్ళు: నివారణ చిట్కాలు
పాదాల పగుళ్ళు అనేవి చాలా సర్వ సాధారణమైనటువంటి సమస్య. ఈ సమస్య స్త్రీలలో మాత్రమే కాదు, పురుషుల్ని కూడా బాధించి ఒక సమస్య. అందం విషయంలో ఇది ఒక సమస్యగా మాత్రమే కాకుండా, నొప్పిని కలిగిస్తుంది. అంతే కాదు, ఇతరుల ముందు సిగ్గుపడేలా చేస్తుంది. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం లేదా తగినంత శ్రద్ద తీసుకోకపోవడం. అందువల్ల, పాదాల పగుళ్ళకు వివిధ రకాల కారకాలు పాదాల పగుళ్ళకు దారితీస్తుంది. అందవల్లే తరచూ ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. అంతే కాదు, పాదల పగుళ్ళకు న్యూట్రిషినల్ లోపం వల్ల కూడా పాదాల పగుళ్ళు ఏర్పడుతాయి.
కాబట్టి, పాదా పగుళ్ళను గుర్తించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాదాల పగుళ్ళతో పాటు, నొప్పి, గాయల కూడా నివారించుకోవచ్చు . మీరు ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే అందుకు కొన్నిఉత్తమ వంటింటి చిట్కాలున్నాయి. ఈ చిట్కాలను అనుసరించి మీ పాదాల పగుళ్ళను నయం చేసుకోవచ్చు. ఒక సారి మీ పాదా పగుళ్ళను తగ్గించుకొన్నాక, తర్వాత ముందు ముందు ఇటువంటి సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాల మీద చర్మం చాలా హార్డ్ గా ఉంటుంది. ఒక సారి సమస్య వచ్చిన తర్వాత, వెంటనే తొలగించడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, ఉత్తమ పదార్థాలను ఎంపిక చేసుకోవడం వల్ల త్వరగా పాదాల పగుళ్ళ సమస్యను అధిగమించవచ్చు.

1. ఫ్యూమిస్ స్టోన్:
మీ పాదాలను గోరువెచ్చని నీటిలో ముంచి 15-20నిముషాలు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల పాదాల మీద ఉన్నహార్డ్ స్కిన్ సాఫ్ట్ గా మారుతుంది. వెంటనే నీళ్ళలో నుండి పాదాలను బయటకు తీసిన ఫ్యూమిస్ స్టోన్ తో పాదాలను రుద్దడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతుంది . తర్వాత ఒక మంచి ఫూట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ను అప్లై చేయాలి. మరియు 20 నిముషాలు అలాగే ఉంచుకోవడం వల్ల అది పాదాల వరకూ షోషింపబడుతుంది . తర్వాత రాత్రుల్లో లేదా పగలంతా కూడా పాదాలకు సాక్సులను ధరించడం వల్ల పాదాలు తేమగా ఉంటాయి. ఇలా ప్రతి రోజూ ఒక వారం పాటు ఇలా చేయడం వల్ల డిఫరెన్స్ ను మీరే గుర్తించవచ్చు.
2.పాదాలకు మాస్క్
ఒక పెద్ద బేషిన్ లేదా బకెట్ తీసుకొని అందులో పాదాలు మునిగే వరకూ గోరువెచ్చని నీటిని పోసి అందులో ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ వేసిచి బాగా మిక్స్ చేసి, ఆ నీటిలో మీ పాదలను ముంచి 15-20నిముషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఫ్యూమిస్ స్టోన్ లేదా ఫూట్ స్ర్కబ్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తర్వాత ఒక టీస్పూన్ గ్లిజరిన్, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మరియు నిమ్మరసం వేసి మిక్స్ చేసి పాదాల పగుళ్ళకు మర్ధన చేసుకోవాలి. రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
3. తేనె మిక్స్
పాదాల పగుళ్ళను నివారించడంలో తేనె ఒక గొప్ప మాయిశ్చరైజర్ మరియు ఇందులో ఒక గ్రేట్ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి మరియు కొద్దిగా తేనె మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీ పాదాలు ఎక్కువగా పగిలినట్లైతే, పొడి బారి అందవిహీనంగా కనబడుతున్నట్లైతే ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ తో పాదాలను మసాజ్ చేయండి . మీ పాదాలను 10 నిముషాలు గోరువెచ్చని నీటిలో డిప్ చేసి తర్వాత బాగా రుద్ది తర్వాత ముందుగా తయారుచేసుకొన్న పేస్ట్ ను అప్లై చేసి కడగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
4. తేనె లేదా ఆలివ్ నూనె
మీరు ఇప్పటికే పాదాల పగుళ్ళ సమస్యను అనుభవిస్తుంటే కనుక మీరు స్వచ్చమైన తేనెను లేదా ఆలివ్ ఆయిల్ ను పాదాలకు అప్లై చేసి సున్నితంగా రుద్దాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉండనిచ్చి తర్వాత రోజు ఉదయం శుభ్రంగా కడిగేయాలి. ఇలా ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications