For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంకల్లో చెమట-దుర్వాసన: నివారించే చిట్కాలు

|

చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. చెమట కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు మరియు ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది.స్నానం చేసిన కొద్ది సేపటికే చెమటపడుతుంది. ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి చెమట పోస్తుంది. కొంతమందికి మరింత ఎక్కువగా పోస్తుంది. మరికొంత మందికి చాలా తక్కువగా చెమట పడుతుంది. శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమటతోబాటు శరీరంనుంచి అనాయాసంగా అమోనియా, ప్రొటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలుకూడా శరీరంలోంచి బయటకు వచ్చేస్తాయి. చెమటతో చర్మం తేమగా వుంటుంది. ఎండకు, ఎక్కువ వేడికి చర్మం ఎండిపోకుండా ఉండేందుకు చెమట పోస్తుంది.

వేడి వాతావరణం తీసుకునే ఆహారం తదితర కారణాల వల్ల చెమట అధికంగా పడుతుంది. కిడ్నీ వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కాలేయ వ్యాధలు, శరీరంలోకి తీసుకునే పలు రకాల మందులు శరీరం నుంచి దుర్వాసనకు వెలువడడానికి కారణమవుతాయి. శరీరంలో జరిగే పలు రకాల మార్పులు, రసాయనిక ప్రక్రియల కారణంగా దేహం నుంచి చెడు వాసన చెమట రూపంలో వెలువడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నలుగురిలోకి వెళ్లాలంటే నామోషిగా ఫీలవుతుంటారు. ఎదుటివారి ముందు చిన్న చూపుకూ లోనవుతాం. సంబంధాలు కూడా దెబ్బతింటాయి. కనుక దేహం నుంచి దుర్వాసన వెలువడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

బహుమూలల్లో చెమట పట్టించే ఈ ఆహారాలకు చెక్ పెట్టండి:క్లిక్ చేయండి

ఇలా చెమట సమస్యను ఎదుర్కుంటున్నవారు, ముఖ్యంగా ఎటువంటి ఆహారాలను తీసుకుంటున్నారు, ఎలాంటి దుస్తులను వేసుకుంటున్నార్న దాని మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ఉదా: మసాలా ఆహారాలు, ఉల్లి, వెల్లుల్లి వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చెమట దుర్వాస వస్తుంది. అలాగే పాలిస్టర్ మరియు లిన్ దుస్తులు వేసుకోవడం వల్ల లోపలికి గాలి చొరవకుండా ఎక్కువగా చెమట పట్టుటకు కారణం అవుతుంది. కొంతమందికి అత్యధిక చెమట వచ్చినా కూడా దుర్వాసన రాదు. కాని కొంతమందిలో చెమట తక్కువగా వచ్చినా కూడా దుర్గంధం భరించరానంతగా వుంటుంది. దీనినుండి బయట పడటం ఏమంత కష్టం కాదు. అధిక చెమటను తగ్గించుకోవడానికి కొన్ని మంచి మార్గాలున్నాయి. కొన్ని ఉత్తమ హోం రెమడీస్ ను ఉపయోగించి చెమటను సహజంగానే తగ్గించుకోవచ్చు. మరి ఆ హోం రెమిడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

సమ్మర్ లో అధిక చెమటలకు గుడ్ బై చెప్పండిలా: క్లిక్ చేయండి

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

చంకల్లో ఆపిల్ సైడర్ వెనిగర్ ను రెగ్యులర్ గా ప్రతి రోజూ అప్లై చేయవచ్చు. రాత్రి నిద్రించే ముందు చంకల్లో రాసుకోవచ్చు. లేదా స్నానానికి వెళ్ళే అరగంట మందు రాసుకోవచ్చు. స్నానానికి మంచి మన్నికైన షాంపును ఉపయోగించాలి. రాత్రుల్లో రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడా :

బేకింగ్ సోడా :

కొద్దిగా బేకింగ్ సోడా తీసుకొని కొన్ని చుక్కల నీళ్ళు పోసి, మెత్తగా పేస్ట్ లా చేసి, దీన్ని చంకాల్లో అప్లై చేయాలి అరగంట అలాగే వదిలేసి, తర్వాత స్నానం చేయాలి. బేకింగ్ సోడా అప్లై చేయడం వల్ల ఆ ప్రదేశంలో చర్మం పొడిగా మారుతుంది. అయితే తడిగా ఉండేకంటే పొడిగా ఉండటమే మేలు కదా..

కార్న్ స్ట్రార్చ్:

కార్న్ స్ట్రార్చ్:

చెమటను నివారించుకోవడానికి టాల్కం పౌడర్ ను చంకల్లో చల్లుకోవడానికి బదులు, మీరు చాలా సింపుల్ గా కొద్దిగా కార్న్ స్టార్చ్ పౌడర్ ను అప్లై చేయండి. ఇది ఎక్కువ చెమటను గ్రహిస్తుంది అంతే కాదు, చెమట వాసనను నివారిస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

చెమటను, చెమట వాసనను నివారించడంలో నిమ్మరసం ఒక ఉత్తమ హోం రెమెడీ. నిమ్మతొక్కతో చంకల్లో రుద్ది, స్నానం చేయడం వల్ల చెమటను నివారించడంతో పాటు, చంకల్లో నలుపును నివారిస్తుంది.

కాటన్ దుస్తులను ధరించాలి:

కాటన్ దుస్తులను ధరించాలి:

మీరు వేసుకొనే దుస్తులు ఫ్యాబ్రిక్ వి కాకుండా, చాలా తేలికగా, సులభంగా చెమటను గ్రహించేటటువంటి దుస్తులను ధరించడానికి ప్రాధాన్యతను ఇవ్వండి.

మసాలాలు మరియు కారం ఆహారాలను నివారించండి:

మసాలాలు మరియు కారం ఆహారాలను నివారించండి:

అధిక చెమటతో బాధపడే వారు మసాలా మరియు కారంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. రెడ్ చిల్లీ, బెల్ పెప్పర్ వంటి కారంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి.

English summary

Excessive Underarm Sweating: Try Home Remedy

Armpit or underarm sweating can appear really embarrassing. It becomes really difficult to lift your arms up as the wet patches will be a real turn off. Moreover, the sweat odour is so strong that even the fragrance of a perfume falls weak.
Desktop Bottom Promotion