For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరం నుండి దుర్వాసన నివారించడం ఎలా?

By Super
|

మ పెరిగిపోతోంది, దీంతో దేశం అంతటా ప్రజలు రోజూ ఎదుర్కొనే సమస్య చెమట పట్టడం. చెమట అందరికీ పడుతుంది కనీ, మనలో కొద్ది మందికే మరింత ఎక్కువ పడుతుంది, అక్కడే సమస్య మొదలౌతుంది. హైపర్ హైడ్రోసిస్ గా పిలువబడే చెమట ఎక్కువగా పట్టడం అనే లక్షణం వారసత్వంగా వచ్చేది కావచ్చు. అది హార్మోన్ల అసమతౌల్య౦ వల్ల, ఎక్కువ భావోద్వేగాల వల్ల, మసాలా తిండ్ల వల్లా, వ్యాయామం లేదా ఒత్తిడి వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలు ఇవిగో :

విష పదార్ధాలను నీటితో పారద్రోలండి :

How To Get Rid Of Body Odour

ఇది మీరు చాలా సార్లు వినే వుంటారు, నీరు మీ శరీరాన్ని శుద్ది చేయడమే కాదు, మీ బాహుమూలల్లో దుర్ఘందాన్ని నిరోధిస్తుంది. పైగా, రోజూ రెండు సార్లు స్నానం చేయడం వల్ల అధిక స్వేదాన్ని ఎదుర్కోవచ్చు, శరీర దుర్ఘందాన్ని దూరం చేసుకోవచ్చు.

సరైన దుస్తులు వేసుకోండి

How To Get Rid Of Body Odour

కాటన్ దుస్తులు వేసుకుంటే మీ చర్మం గాలి బాగా తీసుకుంటుంది, అధిక స్వేదాన్ని సమర్ధంగా ఎదుర్కొంటుంది. చికాకు కలిగించే దుస్తులు, చర్మానికి వేడి కలిగించేవి, అధిక స్వేదం కలిగించేవి వేసుకోకండి.

నిమ్మ తాజాదనం :

How To Get Rid Of Body Odour

నిమ్మ చెమటను తగ్గిస్తుంది, మీ బాహుమూలలను శుభ్ర పరిచి శరీర దుర్ఘంద౦ రాకుండా చేస్తుంది. (మరీ పండని) నిమ్మకాయ ఒక చెక్క తీసుకుని మీ బాహుమూలలో రుద్దండి. కొద్దిగా దురద అనిపిస్తుంది. అయితే, మీకు దద్దుర్ల లాంటివి ఉంటె నిమ్మ వాడకండి.

స్ప్రే వాడి తాజాదనం పొందండి :

How To Get Rid Of Body Odour

చెమట తగ్గించేవి, దుర్ఘంధం పోగొట్టేవి అయిన స్ప్రేలు వాడి కొంతవరకు శరీర దుర్ఘందాన్ని నిరోధించవచ్చు, కానీ ఇది అందరికీ సరిపోక పోవచ్చు. ఈ ఉత్పత్తులు చర్మ రంధ్రాలను మూసివేయడం ద్వారా చెమట చర్మం మీదకు చేరకుండా ఉండేలా చేస్తాయి. చెమట పట్టకుండా అవి వెంటనే పని చేస్తాయి, కానీ వాటిలో వుండే రసాయనాల వల్ల చర్మం దురద పుట్టడం, రంగు మారడ౦ లాంటి ప్రమాదాలు కూడా ఉండవచ్చు.


బరువు తగ్గి, చెమట తగ్గించుకోండి :

How To Get Rid Of Body Odour


ఆరోగ్యంగా తిని, బరువు తగ్గండి ఎందుకంటే అధిక బరువు వల్ల కూడా అధిక స్వేదం కలుగవచ్చు. మీరు సాధారణ బరువు కలవారైతే, మరిన్ని పీచు పదార్ధాలు ఆహారంలో తీసుకుని, మసాలాలు తగ్గించండి. దీని వలన శరీరం నుంచి విష పదార్ధాలు దూరం చేయవచ్చు.


ఈ సమస్యను ఎదుర్కోవడానికి వినేగార్ ప్రయత్నించండి :

How To Get Rid Of Body Odour

మీకు ఆశ్చర్యం కలుగవచ్చు, కానీ రాత్రి పడుకోబోయే ముందు మీ బాహు మూలల్లో వినేగార్ రాసి దాన్ని సహజంగా ఆరనివ్వండి. మరునాడు ఉదయం దాన్ని కడిగివేయండి. యాపిల్ సిడార్ రాసినా కూడా అధిక స్వేదం సమస్య కాలక్రమేణా తీరిపోతుంది.

మీ డాక్టర్ ను సంప్రదించండి :

మీ డాక్టర్ ను సంప్రదించి, కొన్ని పరీక్షలు చేయించుకోవడ ద్వారా అధిక స్వేదానికి కారణాలు తెలుస్తాయి. అయినా చెమట పట్టడం మన శరీర ఉష్ణోగ్రతను సరైన స్థాయిలో నిర్వహించడానికే కదా!

చంకల్లో చెమట-దుర్వాసన: నివారించే చిట్కాలు:క్లిక్ చేయండి

అవును శరీర దుర్ఘంధం పోగొట్టుకోవడ౦ కష్టమే కానీ, అది ఇప్పుడు మరింత తేలిక చేయబడింది మరి !

English summary

How To Get Rid Of Body Odour

Humidity levels are rising and perspiration is a major problem that people, all over the country, have to deal with every day. While everyone perspires, only some of us sweat excessively and that is when it becomes a problem.
Desktop Bottom Promotion