Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
పండు టమాటాలు మీ అందాన్ని ఎలా మెరుగుపరుస్తాయి
టమాటాలు తినడానికే కాకుండా మీ అందంపై కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఎందువల్ల అంటే టొమాటోలలో ఉండే లైకోపెన్ మెరిసే ప్రభావం తగ్గడం, మీ చర్మ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అంతేకాకుండా, దీనివల్ల మీ చర్మం కాంతివంతంగా, మెరిసిపోతూ అదేవిధంగా బిగుతుగా కూడా ఉంటుంది. ఇది మీ జుట్టుకు సహజ కండిషనర్ గా పనిచేసి ఎంతో కాంతివంతంగా, మృదువుగా కూడా చేస్తుంది.
మీ అందానికి టొమాటోలు ఎలా పనిచేస్తాయి

కమిలిన చర్మానికి
టొమాటోలు మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచడానికే కాకుండా, మీ చర్మానికి పైపూతగా కూడా ఉపయోగించవచ్చు. నిజానికి, మీ చర్మంపై టొమాటో రసం లేదా టొమాటో ముక్కను రుద్దినట్లయితే కమిలిన చర్మం తగ్గిపోయి, కొద్దిరోజుల్లో కాంతివంతంగా కనిపిస్తుంది. ఇది విటమిన్ C ఎక్కువగా కలిగి ఉండడం వల్ల మీ చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది.

మొటిమలను తగ్గిస్తుంది
మొటిమలకు చికిత్సగా వాడే క్రీములు, ఆయింట్మెంట్ లలో సాధారణంగా వాడే విటమిన్ C,A లు టొమాటో లలో అధికంగా ఉంటాయి. అందువల్ల, మీకు మొటిమలు ఉంటె, మీరు టొమాటో రసాన్ని అప్లై చేయండి.

కమిలిన చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది
కమిలిన చర్మాన్ని సహజంగా రక్షించుకోవడానికి కనీసం 3 నెలలపాటు ప్రతిరోజూ షుమారు 4-5 టేబుల్ స్పూన్ల టొమాటో రసాన్ని వాడతారో వారికి చర్మం కమలదని అనేకమంది అందం నిపుణులు నమ్ముతారు. ఒకవేళ మీరు కమిలిన చర్మంతో బాధపడుతుంటే, ఉపశమనం కోసం ఆ ప్రదేశంలో టొమాటో ని అప్లై చేయండి.

చుండ్రును ఎదుర్కోవచ్చు
శీతాకాలంలో అనేకమంది చుండ్రును సమస్యను ఎదుర్కుంటారు. కానీ దీన్ని ఎదుర్కొనడానికి టొమాటో బాగా సహాయపడుతుంది. మీరందరూ అద్భుతమైన ఉపశమనం కోసం టొమాటో గుజ్జును మీ మెదడుపై అప్లై చేయండి. ఇలా ప్రతి వారం ఒకటి లేదా రెండుసార్లు చేసి ఫలితాన్ని చూడండి.

టొమాటో నూనె చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది
మీ చర్మం మృదువుగా ఉండడానికి, ప్రభావిత ప్రాంతంపై టొమాటో నూనెను మర్దన చేయండి. రాత్రంతా అలా ఉంచి, ఉదయాన్నే కడిగేయండి. టొమాటో నూనెను ఫేషియల్ క్రీములలో, మీ చర్మం మృదువుగా, సున్నితంగా ఉంచే స్క్రబ్ లలో కూడా కలుపుతారు.

టొమాటో రసం చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది
మీ ముఖంపై ఉన్న చర్మ రంధ్రాలను శుభ్రపరచడానికి, మీరు ఒక టేబుల్ స్పూన్ నీటిలో 3-4 చుక్కల టొమాటో రసాన్ని కలిపి, కాటన్ బాల్ తో మీ ముఖంపై అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సున్నితంగా రుద్దండి, 10-15 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇలా ప్రతిరోజూ చేస్తే, మీ ముఖంపై ఉన్న రంధ్రాల పరిమాణం క్రమంగా తగ్గుతాయి.

టొమాటో గుజ్జు పొక్కులు, మొటాలను తగ్గిస్తుంది
టొమాటో ను సగం కోసి మీ ముఖంపై రాసి మీ ముఖంపై ఉన్న పోక్కులను, మొటాలను పోగొట్టుకోవచ్చు. మీకు మొటాల సమస్య ఉంటె, ఒక టొమాటో ను తోలుతీసి, గుజ్జుచేసి, దాన్ని మీ చర్మంపై రాయండి, ఒక గంట అలా వదిలేయండి. మీ ముఖంపై ఉన్న గుజ్జును కడిగేసి, తుడవండి. ఈ సహజ పాక్ ను ఉపయోగించి మీరు మీ చర్మంపై ఉన్న మొటాలను, ఎండవల్ల వచ్చిన టాన్ నుండి ఉపశమనం పొందవచ్చు.

మృదువైన చర్మం కోసం తేనెతో టొమాటో రసాన్ని తీసుకోండి
మీ చర్మం సున్నితంగా కనిపించాలి అంటే, టొమాటో రసానికి తేనెను కలిపి పేస్ట్ లా చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై రాసి దాదాపు 15 నిమిషాల పాటు ఉంచండి. మామూలు నీటితో శుభ్రం చేయండి. మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
