For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెమట వాసనను నిర్మూలించడానికి 4 సులభ చిట్కాలు

By Super
|

చెమట పట్టడం మానవులలో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. చెమట కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు మరియు ముఖంలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రదేశాలలో చెమట పడుతుంది.స్నానం చేసిన కొద్ది సేపటికే చెమటపడుతుంది. ఎండాకాలంలో ప్రతి ఒక్కరికి చెమట పోస్తుంది. కొంతమందికి మరింత ఎక్కువగా పోస్తుంది. మరికొంత మందికి చాలా తక్కువగా చెమట పడుతుంది. శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమటతోబాటు శరీరంనుంచి అనాయాసంగా అమోనియా, ప్రొటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలుకూడా శరీరంలోంచి బయటకు వచ్చేస్తాయి. చెమటతో చర్మం తేమగా వుంటుంది. ఎండకు, ఎక్కువ వేడికి చర్మం ఎండిపోకుండా ఉండేందుకు చెమట పోస్తుంది.

చెమట వల్ల మీ శరీరం వాసన వస్తుంది, ఇతరుకు ఇబ్బంది కరంగా ఉంటుంది. కాబట్టి, సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, మీ యొక్క పర్సనాలిటి కూడా మెరుగుపడుతుంది. అలా జరగాలంటే కొన్ని చిట్కాలు మీకోసం

మీరు రోజులో ఎన్ని సార్లు డియోడరెంట్స్ ఉపయోగిస్తారన్నది వేరే విషయం, అయితే శరీరం యొక్క దుర్వాసన మాత్రం తొలగిపోదు. ఇలాంటి సమస్యలకు మీరు శాశ్వత పరిష్కారం కోసం వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం నాలుగు సులభమైన చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.


మీరు కొన్ని విషయాలను అనుసరించాల్సి ఉంటుంది, అందులో ముఖ్యంగా మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, మరియు మేతి వంటివి పూర్తిగా తగ్గించాలి. ఈ ఆహారాలు చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి దుమ్ము, ధూలి చేరి చెమట ద్వారా దుర్వాసనకు కారణం అవుతాయి. కాబట్టి, వీటితో తయారుచేసే స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది.

తరచూ బాత్రూమ్ కు వెళుతుండాలి. అవును, మనం రెగ్యులర్ గా స్నానం చేస్తాం. అయితే వేసవిలో రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచి ఉపాయం. ఇలా చేయడం వల్ల చెమట సమస్యలను మాత్రమే కాదు, ఇతర ఆరోగ్య, చర్మ సమస్యలను కూడా దూరంగా ఉంచతుంది.

టాల్కం పౌడర్ ను ఉపయోగించాలి: దీన్ని మనం చాలా తక్కువగా అంచనా వేస్తాం కానీ, దీన్ని ఉపయోగించడం వల్ల చాలా వ్యత్యాసం కనబడుతుంది. టాల్కం పౌడర్ ఉపయోగించడం వల్ల మిమ్మల్ని ఫ్రెష్ మార్చడం మాత్రమే కాదు, ఇది చెమట దుర్వాసను నిర్మూలిస్తుంది, ముఖ్యంగా వేసవికాలంలో దీనివల్ల ఎక్కువ ప్రయోజనం.

ఒక మంచి యాంటీ సెప్టిక్ డియోడరెంట్ ను ఎంపిక చేసుకోవాలి: ఇది మీ శరీరం నుండి చెమట వాసను దూరం చేయడం మాత్రమే కాదు, మీశరీరం నుండి తాజా వాసన వచ్చేలా చేస్తుంది. అంతే కాదు, చెమటను పట్టడం నివారిస్తుంది.

How To Keep Body Odour At Bay

Desktop Bottom Promotion