Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
హాట్ బ్యూటీ విద్యాబాలన్ బ్యూటీ సీక్రెట్
ప్రస్తుత కాలంలో వైవిధ్యమైన నటి, సౌత్ ఇండియా బ్యూటీ ఎవరనే ప్రశ్నకు విద్యా బాలన్ అనే సమాధానం వస్తుంది. 27 ఏళ్ళకే కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రస్ గా పేరు తెచ్చుకుంది. కొద్దిగా బొద్దుగానే ఉన్నా ప్రత్యేక శ్రద్దతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.
ఇదెలా సాధ్యం? అందమైన చర్మం, నిగనిగాలాడే సిల్కీ హెయిర్ తో పాటు అందమైన ఆకర్షణీయమైన కళ్ళు ఆమె సొంతం కావడం వల్లేననే సమాధానం లభిస్తుంది. ఆకర్షించే ఆమె కళ్ళు ఆమె అందాన్ని పదింతలు పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు.
విద్యా బాలన్ బ్యూటీ సీక్రెట్స్
హెవీ షెడ్యూల్స్ తో బిజీగానున్నా, నిద్ర లేమి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నా వీటినన్నింటినీ మేనేజ్ చేస్తూ అందాన్ని కాపాడుకోవడంపై విద్యాబాలన్ శ్రద్ద అభినందించదగినది. విద్యా బాలన్ బ్యూటీ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.స్కిన్:క్లెన్సింగ్
ఘాటైన కెమికల్స్ కలిగిన మేకప్ ను సినీతారలు వాడడం సహజం. వాటిని సరైన పద్దతిలో తొలగించుకోవడంపై విద్యా బాలన్ దృష్టి పెడుతుంది. క్లెన్సింగ్ తో చర్మాన్ని క్లీన్ చేసుకుంటుంది. MAC మేకప్ వైప్స్ తో చర్మంపై నున్న మేకప్ ను సున్నితంగా తొలగించుకుంటుంది విద్యా బాలన్. చర్మ సంరక్షణలో క్లెన్సింగ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం వల్లే విద్యా టాప్ పోసిషన్ లో ఉంది.
2. కళ్ళు
విద్యా బాలన్ కళ్ళు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి దృష్టినీ తనవైపు తిప్పుకోవడంలో ఆమె కళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆ కళ్ళకు మరింత అందాన్నిచ్చేందుకు పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసిన కాజల్ ను విద్యా ఉపయోగిస్తుంది. ఒక వేళ అటువంటి కాజల్ ని మీరు ఇంపోర్ట్ చేయించుకోవలేకపోతే దేశంలో దొరికే మంచి ప్రోడక్ట్ ను ఎంచుకోవడానికి ప్రయత్నించండి.
3. ఆహారం
విద్యా ఆహారంలో కేవలం ఆర్గానిక్ స్టఫ్ మాత్రమే ఉంటుంది. పచ్చి కూరగాయలు, తాజా పండ్లు ఆమె ఆహారంలో భాగం. ఎక్కువగా తాజా పళ్ళ రసాలను తీసుకోవడం, కొబ్బరి నీళ్ళను తాగడం ద్వారా విద్యా డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకుంటోంది.
4. సోప్స్
చర్మ సంరక్షణకు విద్యా సహజసిద్ధంగా తయారు చేయబడ్డ ఉత్పత్తులనే వాడుతుంది. రోజ్, లెమన్ల ఖాది హెర్బల్ ఫేస్ అండ్ బాడీ వాష్ ను విద్యా ఉపయోగిస్తుంది.
5. జుట్టు
తన అందమైన జుట్టు పరిరక్షణకోసం విద్యా బాలన్ తరచూ ఆయిల్ మసాజ్ లకు ప్రాధాన్యతనిస్తుంది. ఆరోగ్యకరమైన, ఆకర్షణీయమైన, అందమైన జుట్టుకోసం విద్యా ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తుంది.
అవండి, విద్యా బాలన్ బ్యూటీ సీక్రెట్స్. సింపుల్ గా చెప్పాలంటే, ఆరోగ్యకరమైన ఆహరం, చర్మ సంరక్షణ, నిగనిగలాడే జుట్టుకు సరైన పోషణ ఇవన్నిటితో బ్యూటీని పెంపొందించుకోవచ్చని విద్యాబాలన్ సీక్రెట్స్ చెప్తున్నాయి.



Click it and Unblock the Notifications