Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
అప్పర్ లిప్ హెయిర్ నేచురల్ గా తొలగించే 10 సింపుల్ చిట్కాలు
పెదాలు అందంగా ఉంటే, ఆ ముఖ సౌందర్యం మరింత అందంగా కనిపిస్తుంది. అదే పైపెదవి మీద సన్నని హెయిర్ ఉన్నట్లైతే, అవి బయటకు కనబడుతుంటే, ఆ పెదాలకు లిప్ స్టిక్ వేసినా, అందవిహీనంగా మారిపోతుంది. అందమైన ముఖంలో పెదాల మీద సన్నగా వెంట్రుకలు కనబడుట వల్ల పురుషలవలే కనబడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం వివిధ రకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. ఈ లిప్ హెయిర్ సమస్య మహిళల్లో చాలా మందిలో ఒక సాధారణ సమస్యగా మారింది. కాబట్టి, ఎట్టువంటి నొప్పి లేకుండా నేచురల్ గా అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.
READ MORE: పెదాల మీద మొటిమలను, ఇన్ఫెక్షన్ మాయం చేసే చిట్కాలు
అప్పర్ లిప్ హెయిర్ ను తొలగించడం ఎలా? ఈ సమస్య నుండి ఎలాంటి నొప్పి లేకుండా...ఖరీదైన ప్రొడక్ట్స్ ఉపయోగించకుండా అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడానికి హోం రెమెడీస్ ను సరైన సమయంలో సరిగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందువల్ల, ఈ క్రింద తెలిపిన వివిధ రకాల టిప్స్ ను మీకు అందిస్తోంది. ఈ టిప్స్ ను క్రమంగా ఉపయోగిస్తే, అప్పర్ లిప్ హెయిర్ ను చాలా సున్నితంగా తొలగించుకోవచ్చు .
ముఖ్యంగా మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణం హార్మోనుల లేదా జన్యుసంబంధిత లేదా ఈ రెండిటి కాంబినేషన వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది . సాధారణంగా 5-10శాతం మహిళల్లో ఈ సమస్య ఉంటుంది. అయితే వీటి మీద పరిశోధనలు కూడా జరుపుతున్నారు కానీ, ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి, మనం నేచురల్ గా మనఇంట్లో ఉండే వస్తువులతో అవాంఛిత రోమాలను ఎలా తొలగించుకోవాలో చూద్దాం...
READ MORE: పెదాల ఆకర్షణకు ఇంట్లోనే ఉందిగా ఓ బ్యూటీ కిట్....!
సూచన: చాలా సున్నితమైన చర్మతత్వం కలిగిన వారు,ఈ హోం రెమెడీస్ ఉపయోగించడానికి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

పసుపు మరియు పాలు :
పసుపును ఒక మ్యాను ఫ్యాక్చరింగ్ బ్యూటి ప్రొడక్ట్ గా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మంను శుభ్రం చేస్తుంది . చర్మం ఎప్పుడు కాంతివంతంగా కనబడేలా చేస్తుంది . పాలు కూడా మీరు అందంగా కాంతివంతంగా కనబడుటకు సహాయపడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా ఖచ్చింగా నేచురల్ గా మంచి గ్లోను అందిస్తుంది. ఒక చెంచా పాలు మరియు పసుపును తీసుకొని బౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత చేతి వేళ్ళతో అప్పర్ లిప్ మీద అప్పై చేయాలి . డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత రబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి .

పసుపు మరియు నీళ్లు:
పసుపు మరియు నీళ్లు మిశ్రమాన్ని తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి ఫలితాలను అంధిస్తుంది.

గుడ్డు తెల్లసొన:
గుడ్డులోని తెల్లసొన మరో మంచి హోం రెమెడీ ఇది అప్పర్ లిప్ హెయిర్ ను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. ఇది చర్మంను స్మూత్ చేసి మంచి ఫలితాలను అందిస్తుంది. . ఒక ఎగ్ వైట్ తీసుకొని అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ మరియు షుగర్ మిక్స్ చేసి స్టిక్కీ పేస్ట్ లా అయిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. అరగంట అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.. మెరుగైన ఫలితం కోసం ఈ థెరఫిని వారంలో రెండు సార్లు వేసుకోవాలి. ఒక నెలలోపు , పెదాల మీద హెయిర్ పెరగడం తగ్గుముఖం పడుతుంది.

శెనగపిండి:
అవాంఛిత రోమాలను ఎఫెక్టివ్ గా తొలగించడానికి చెన్నా దాల్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . శెనపిండిలో కొద్దిగా నీళ్లు మరియు పసుపు మిక్స్ చేసి తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత స్ర్కబ్ చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

పంచదార:
నిమ్మరసంలో కొద్దిగా పంచదార వేసి బాగా మిక్స్ చేసి, వేడి చేయాలి. తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, కాటన్ క్లాత్ తో అప్లై చేసి, గుండ్రంగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. అలాగా పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగించి వాక్సింగ్ లా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు, శెనగపిండి మరియు పసుపు:
పెరుగు, శెనగపిండి మరియు పసుపు ఒక బౌల్లో వేసి, బాగా మిక్స్ చేసి, చిక్కగా పేస్ట్ అయిన తర్వాత, ఈ పేస్ట్ ను పై పెదవి మీద వేసి 15 నుండి 20 నిముషాలు అలాగే ఉంచి, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి.

మైదా లేదా గోధుమపిండి:
అప్పర్ లిప్ హెయిర్ ను నేచరుల్ గా తగ్గించాడానికి పసుపు గ్రేట్ గా సహాయపడుతుంది . మైదా లేదా గోధుమపిండిలో కొద్దిగా పసుపు వేసి, పాలు మిక్స్ చేసి, తయారైన క్రీమ్ పేస్ట్ ను పై పెదవి మీద అప్లై చేసి 15 నిముషాలు ఎండిన తర్వాత రుద్ది, గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగి నేచురల్ గా తొలగించుకోవచ్చు.

నిమ్మరసం:
నిమ్మరసంలో , కొద్దిగా నీళ్ళు, పంచదార మిక్స్ చేసి అప్పర్ లిప్ మీద అప్లై చేసి, 15నిముషాలు డ్రై అయిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసేసుకోవాలి.

త్రెడ్డింగ్
త్రెడ్డింగ్ చేయడం వల్ల కూడా అప్పర్ లిప్ హెయిర్ ను తొలగించుకోవచ్చు . త్రెడ్డింగ్ తాత్కాలిక మార్గం మాత్రమే. 15 రోజులకు సమస్య తిరిగి ప్రారంభమవుతుంది.

సిజర్:
మరో చిట్కా సిజర్ ను ఉపయోగించి అవాంఛిత రోమాలను తొలగించుకోవడం . మహిళల్లో అప్పర్ లిప్ హెయిర్ చాలా సాధారణ సమస్య మరియు చాలా సున్నితమైన చిన్న సమస్య. కాబట్టి, వీటిని తొలగించడానికి సిజర్ అవసరం ఉండవచ్చు మరయు ఉండకపోవచ్చు.



Click it and Unblock the Notifications