For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడ, గడ్డం మరియు ముఖం కొవ్వు కరిగించడానికి 10 చిట్కాలు

By Super
|

లావుగా ఉండటం అన్నది అందరికి అవాంఛనీయమే మరియు మనమందరం కూడా నాజూగ్గా మరియు సన్నగా ఉండాలనే కోరుకుంటాము. సాధారణంగా కండరాల శిక్షణకోసం మరియు గుండెకు సంబంధించిన సెషన్ల కొరకు మనం వ్యాయామశాలకు లేదా వ్యాయామ తరగతులకు వెళ్ళటం పరిపాటి. మెడ, గడ్డం మరియు ముఖం మొదలైన ప్రాంతాల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచటం అవసరం. .మెడ కొవ్వు తొలగిన్చుకోవటానికి వివిధ మార్గాలు ఉన్నాయి. మనం ఈ రోజు ఈ వ్యాసంలో చూద్దాం.

డబుల్ చిన్ లేని వారికి ఈ విషయం పెద్ద ఆందోళనకరమైనది కాదు కానీ ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మెడ కొవ్వును తొలగించుకోవటం చాలా పెద్ద పని.

ఇక్కడ మనం ఒక సన్నని మరియు సొగసైన మెడతో ఉన్న ముఖారవిందం పొందటానికి మరియు గడ్డం కొవ్వు కరగటానికి కొన్ని చిట్కాలను చర్చిద్దాము. మీ సాధారణ దినచర్యలో ఎటువంటి మార్పు చేసుకునే అవసరం లేకుండానే చాలా ప్రభావం గల ఉపాయాలు ఉన్నాయి.

నిజానికి, రోజువారీ జీవితంలో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవటం వలన చాలావరకు సహాయపడుతుంది. మిగిలిన సగం మీరు చూపించే శ్రద్ధ, పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది.

కాబట్టి మెడ కొవ్వు కోల్పోవటానికి మార్గాలు ఏమిటో తెలుసుకోవాలనుందా?

1. సార్ద్రతగా ఉండండి

1. సార్ద్రతగా ఉండండి

ఆరోగ్యకరమైన మెదడు మరియు చురుకుగా శరీరం, రెండూ కూడా బాగా సార్ద్రత కలిగిన శరీర ప్రాముఖ్యత మీద ఆధారపడి ఉన్నది. శరీరానికి తగినంత నీరు అందించటం మీద శరీరం పనితీరు ఆధారపడి ఉంటుంది. తగినంత నీటిని శరీరం తీసుకోవటం వలన మెడ మరియు గడ్డం ప్రాంతం చుట్టూ అనిశ్చితమైన నీరు నిలుపుదల కూడా నిరోధించబడుతుంది.

2. సరైన భంగిమను నిర్వహించండి

2. సరైన భంగిమను నిర్వహించండి

మీరు ఎలా కూర్చోవాలి? మీరు నిలబడినప్పుడు మరియు కూర్చుని ఉన్నప్పుడు మీ భంగిమను చూసుకోండి. మీరు తల వంచడం చేస్తున్నారా? మీ మెడ మరియు గడ్డం ప్రాంతాలలో కొవ్వు పెరగటానికి మరియు ముడుతలుగా ఏర్పడటానికి ఇది ఒక కారణం కావచ్చు. మీ భుజాలు నిటారుగా మరియు వెనుకభాగం నిటారుగా ఉంచండి. మెడ ప్రాంతం యొక్క కండరాల పటుత్వం కోల్పోనివ్వవొద్దు మరియు వాటిని వంగిపోనివ్వ వొద్దు.

3. సమతుల్య ఆహారం తీసుకోండి

3. సమతుల్య ఆహారం తీసుకోండి

ఆహారం మరియు ఆరోగ్యం రెండు కూడా ఒకదాని వెంబడి ఒకటి ఉంటాయి. మీరు మీ కోసం అన్ని పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటం చేయటం వలన మీకు మీరు మంచి చేసుకున్నట్లే. దీనివలన మీరు వివిధ ఆహారం సంబంధిత వ్యాధులు నివారించడం మాత్రమే కాదు కానీ అనవసర కొవ్వు పెరగతానని కూడా నివారిస్తున్నారన్న మాట.

4. తక్కువ సోడియం తీసుకోండి

4. తక్కువ సోడియం తీసుకోండి

ఎక్కువ సోడియం తీసుకోవటం వలన శరీరంలో నీటి నిల్వ ఎక్కువగా ఉంటుంది. మీ డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ షేకర్ తొలగించండి మరియు ఏ ఆహారంలో కూడా ఎక్కువ ఉప్పు వాడకండి.

5. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి

5. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి

ఆహారంలో ఫైబర్ ఉండటం జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. దీనితో పాటు ఇది ఆహార పోషకాలను మరియు అదనపు నీటిని శోషింపచేస్తుంది. మీరు ఎక్కువసేపు కడుపు భర్తీగా ఉందనే భావనతో ఉండటం వలన ఎక్కువ ఆహారం తీసుకోరు .

6. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

6. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వలన అవాంఛిత కొవ్వు పెరగకుండా సహాయపడుతుంది, శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది మరియు ఒక ఆరోగ్యకరమైన చురుకైన జీవితం గడపటానికి దోహదం చేస్తుంది. మీరు క్రమం తప్పకుండా పనిలో మునిగితే మీ మెడ, గడ్డం మరియు ముఖం కొవ్వు ఖచ్చితంగా నిరోధించబడుతుంది.

7. తగినంత శరీర బరువు నిర్వహించండి

7. తగినంత శరీర బరువు నిర్వహించండి

ప్రతి వ్యక్తి తగినంత శరీర బరువు ఉండేలా చూసుకోవటం అవసరం. ఏ రెండు శరీరాలు ఒకేలా ఉండవు మరియు అందుకే ప్రతిదీ అందరికీ వర్తించదు. అందుకే మీరు సరిఅయిన శరీర బరువు ఉన్నారో లేదో తెలుసుకోండి. దీని ప్రకారం బరువు కోల్పోవటమా లేదా పొందటమా నిర్ధారించుకోండి. మీరు సరైన శరీర బరువును కలిగి ఉంటే మీ మెడ, గడ్డం కూడా వాటి స్థానంలో సక్రమంగా ఉంటాయి.

8. జంక్ మరియు ప్యాకింగ్ ఆహారాన్ని మానుకోండి

8. జంక్ మరియు ప్యాకింగ్ ఆహారాన్ని మానుకోండి

తినడానికి సిద్ధంగా ఉన్నవి, వండటానికి సిద్ధంగా ఉన్నవి మరియు షెల్ఫ్ లలో ఉన్న ఆహారపదార్థాలలో అధిక సోడియం కంటెంట్ ఉంటుంది. ఈ అధిక సోడియం స్థాయి మీ శరీరంలో అదనపు నీరుని పెంపొందిస్తుంది మరియు మెడ కొవ్వు పెరగటంలో కూడా సహాయపడుతుంది. అందువలన మీ జీవనశైలి నుండి ఈ అంశాలనేవీ లేకుండా ఉండటానికి ప్రయత్నించండి.

9. షుగర్ ఫ్రీ గమ్ నమలండి

9. షుగర్ ఫ్రీ గమ్ నమలండి

ఇది వినటానికి కొద్దిగా అసహజంగా వినిపించవచ్చు కానీ గమ్ నమలడం చాలా ఆరోగ్యకరమైన విషయంగా పరిగణిస్తారు. దీనివలన మీరు అందరి దృష్టిలో పడవొచ్చు. కానీ ఇది ముఖం మరియు గడ్డం కొవ్వు కోల్పోతారు అని నిరూపించగలిగే చిట్కాలలో ఒకటి. మీరు అదనపు చక్కెర అవసరం లేనటువంటి చక్కెర లేని గమ్ ను మాత్రమే నములుతున్నారని నిర్ధారించుకోండి.

10. మెడకు సంబంధించిన వ్యాయామాలు

10. మెడకు సంబంధించిన వ్యాయామాలు

చేయండి మొత్తం శరీరం కోసం వ్యాయామం మంచిదే కానీ మెడ మరియు గడ్డం ప్రాంతంమీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం అవసరం. ఈ విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నది. మీరు డబుల్ చిన్ కలిగిఉంటే, సన్నని నాజూకైన మెడను నిర్వహించడానికి మెడ, గడ్డం మరియు ముఖం ప్రాంతాలను లక్ష్యంగా తీసుకొని వ్యాయామాలు చేయటం అవసరం.

English summary

10 Tips To Lose Neck, Chin And Face Fat

Being fatty is undesirable and we all look up to having that slim and lean look. On visiting a gym or workout class we normally head for muscle training and cardio sessions.
Desktop Bottom Promotion