Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వర్షాకాలంలో పాదాల సౌందర్యానికి సింపుల్ టిప్స్
వర్షాకాలం ప్రారంభమైతే చాలు...నీటిలోనే జీవనం..వర్షం వల్ల రోడ్లపైకి బురద వచ్చి చేరుతుంది. లేదంటే వర్షపు నీరు అంతా రోడ్ల మీద నిలిపోతాయి. రోడ్ల మీద పేరుకుపోయిన దుమ్ముధూళీ, వర్షపు నీటితో కలిసిపోయి, కాళ్లకు బురద అటుకోవడంతో పాటు...ప్రమాదకరమైన క్రిములు సైతం మన పాదాల మీదకు చేరుకుంటాయి.
READ MORE: వర్షాకాలంలో హెయిర్ ఫాల్ తగ్గించే ఇంటి చిట్కాలు...
ఇంకా వర్షపు నీటిలో పాదు ఎక్కువగా నానడం వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో కూడా పాదాల అందాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. మరి అందుకు సహాయపడే చిట్కాలు ఏంటో చూద్దాం...

వేడినీళ్ళతో శుభ్రపరచుకోవాలి:
పాదాలను శుభ్రపరచుకోవడానికి గోరువెచ్చని నీరు మంచిది. సువాసనపూరితమైన యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో గోరువెచ్చని నీళ్లతో కాళ్లు కడుక్కోండి కాళ్లు కడిగాక నీరు దానంతట అదే ఆరుతుందంటూ అలా వదిలేయకండి. శుభ్రమైన పొడిబట్టతో పాదాలు తుడుచుకోవాలి. మరీ ముఖ్యంగా కాలివేళ్ల మధ్య తడి అంతా ఆరి పొడిబారేలా తుడుచుకోవాలి. లేకపోతే పాదాలు చెడటం మరింత ఎక్కువవుతుంది.

పాదరక్షలు:
వర్షాకాలంలో వేసుకొనే పాదరక్షల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో వీటివల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో వీలైనంత వరకూ బూట్లను ధరించకుండా ఉండాలి. ఎందుకంటే వర్షంలో నడిచి వెళ్ళేటప్పుడు లేదా బైక్ మీద వెళ్ళేటప్పుడు వర్షపు నీరు బూట్లలో చేరి పాదాల ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది. అందుకే పాదాలను పూర్తిగా కవర్ చేసి బూట్లవంటి వాటికి దూరంగా ఉండి. పాదాలకు పూర్తిగా గాలి తగిలేలా ఫుట్ వేర్ ఎంపిక చేసుకోవడం మంచిది.

లిక్విడ్ వాష్
వర్షాకాలంలో ఎన్ని చిట్కాలు పాటించినా పాదాల శుభ్రత విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇన్ఫెక్షన్లకు గురవ్వాల్సి ఉంటుంది. కాబట్టి, వర్షాకాలంలో బయట నుండి ఇంటికి తిరిగి రాగేనే పాదాలను లిక్విడ్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. లేదంటే సబ్బును ఉపయోగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

యంటీ ఫంగల్ పౌడర్:
వర్షంలో నుండి ఇంటికి చేరుకోగానే , కాళ్లను శుభ్రపరిచి, తడిలేకుండా పూర్తిగా పొడి టవల్ తో తుడుచుకోవాలి. తర్వాత వేళ్ల మధ్యలో యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోవాలి. అలాగే కాలిగోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. లేదంటే వాటిలో మురికి చేరి దురదలు, ఇతర చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పాదాలు పొడిగా ఉన్నాయని నిర్ణయించుకొన్న తర్వాతే సాక్సులు వేసుకోవాలి. పొడిబారిన పాదాలపై టాల్కమ్ పౌడర్ వేసుకోండి. దాంతో పాదాలు చాలా సేపు పొడిగా ఉంటాయి. దాంతో ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ.

స్క్రబ్ తప్పనిసరి:
వర్షాకాలంలో పాదాలను రోజూ స్ర్కబ్ చేసుకోవడం మంచిది. దీనివల్ల పాదాలు పగలకుండా ఉంటాయి. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా షాంపూ లేదా లిక్విడ్ సోప్ కలుపుకోవాలి. దీనిలో పాదాలను పది నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత ఫుట్ స్ర్కబ్ తో శుభ్రం చేసుకోవాలి. ఫ్యూమిస్ స్టోన్ తో పాదాలను రుద్దడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి . పాదాలు తడి ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. దీని వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోవడమే కాకుండా పాదాలకు రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అయితే దీనికోసం నాణ్యమైన ఉత్పత్తులను వాడటం మంచిది.

ఉల్లిపాయ గుజ్జును :
వర్షాకాలంలో పాదాలు నీటిలో తడవడం వల్ల పాదాలు ఇన్ఫెక్షన్ కు గురై, దురద పెడుతుంటే వెంటనే ఉల్లిపాయ గుజ్జును రాస్తే తక్షణ ఉపశమనమిస్తుంది.

నిమ్మరసం, వెనిగర్ :
వర్షంలో తడిసి ఇంటికి రాగానే మురికి నీళ్ళ ప్రభావం పాదాలపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా పాదాలను మంచి నీళ్లు, లేదా గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం, వెనిగర్ వేసి శుభ్రం చేసుకోవాలి. దాంతో ఇన్ఫెక్షన్ దురద వంటివి దరిచేరకుండా ఉంటాయి.

పెప్పర్మింట్ ఆయిల్ :
కాళ్లు ఎక్కువగా నీటిలో తడవడం వల్ల కాళ్ల వేళ్ళ మద్య నుండి చెడు వాసన వస్తుంటే, చిన్న టబ్ లో 5ఎంఎల్ పెప్పర్ మెంట్ ఆయిల్ వేసి, కాళ్ళు పొనిగేంత గోరు వేచ్చని నీళ్ళు పోసి, అందులో గుప్పెడు వేపఆకులు వేసి బాగా మిక్స్ చేయలి. తర్వాత మీ పాదాలను అందులో పదినిమిషాల పాటు నాననివ్వాలి. పదినిమిషాల తర్వాత కాళ్ళు బయటకు తీసి పొడి బట్టతో తుడిచి తడి ఆరిన తర్వాత కాళ్ళ మీద టాల్కమ్ పౌడర్ ను స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేమట పట్టకుండా చేయడమే కాకుండా వాసన కలిగించే బ్యాక్టీరియా నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వెనిగర్:
ఒక లోతైనటవంటి తట్ట లేదా పాత్ర లేదా బకెట్ లో పాదాలు మునిగేటన్ని నీళ్లు పోసి అందులో ఒక కప్పు వెనిగర్, కొన్ని చుక్కల థైమ్ ఆయిల్ కలపాలి. ఆ మిశ్రమంలో పాదాలను 20 నిమిషాల పాటు ఉంచాలి. థైమ్ ఆయిల్‌లోని యాంటీసెప్టిక్ గుణం పాదాలు చెడటాన్ని తగ్గిస్తుంది. అందులోని సువాసన గుణం పాదాల నుంచి వచ్చే చెడువాసనను అరికడుతుంది ఈ పాదాలకు కాటన్ సాక్స్ వేసుకోవడం మంచిది. నైలాన్ సాక్స్ వాడటం అంత సరికాదు. ఆ కాటన్ సాక్స్‌ను ప్రతిరోజూ మార్చాలి.

పాదాలకు గాయాలు లేకుండా:
పాదాలకు గాయాలున్నట్లైతే వాటి ద్వారా బ్యాక్టీరియా, రోగాలను కలించే ఇతర క్రిములు మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. వర్షాకాలంలో ఈ బెడద మరీ ఎక్కువ. అందుకే పాదాలకు గాయాలవకుండా చూసుకోవాలి. ఒక వేళ గాయాలున్నట్లైతే తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం. రాత్రి నిద్రించే ముందు పాదాలకు ఖచ్చితంగా యాంటీ సెప్టిక్ క్రీమ్ రాసుకోవాలి.
వర్షకాలంలో వీటికి దూరంగా..
పాదాల అందం కోసం చాలా మంది పెడిక్యూర్ చేయించుకుంటుంటారు. అయితే వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెడిక్యూర్ చేయించుకోకపోవడం మంచిది. కొన్ని బ్యూటీ పార్లర్స్ లో అందరికి ఈకే వస్తువులను ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల ఇన్ఫెక్షన్లు ఒకరి నుండి మరొకరి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా అయినప్పుడు వేడినీటిలో వేసి మరగించి శుభ్రం చేసి తర్వాత ఉపయోగించుకోవచ్చు .



Click it and Unblock the Notifications