Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
పెదాల మీద మొటిమలను, ఇన్ఫెక్షన్ మాయం చేసే చిట్కాలు
అందంగా ఉన్న ముఖంలో ఏదైనా చిన్న మచ్చకనబడితే చాలు ఆ అందం కాస్త పోతుంది. ముఖంలో మాత్రమే కాదు, అందమైన పెదాల మీద కూడా అంతే. పెదాలకు మేకప్ లేదా లిప్ స్టిక్ వేయకపోయినా పర్వాలేదు కానీ, పెదాల మీద మొటిమలు లేదా గుల్లలు వంటివి ఏర్పడితే మాత్రం ఇక మొత్తం ముఖ అందాన్నే హారించి వేస్తుంది.
పెదాల మీద మొటిమలు రావడం వల్ల మొత్త ముఖ అందాన్ని పాడు చేయడంతో పాటు, మూడ్ కూడా మార్చేస్తుంది. స్పైసీ ఫుడ్ తినడానికి కి వీలు పడదు మరియు మాట్లాడటానికి కష్టం అవుతుంది. నోరు తెరవడానికి మరింత కష్టంగా మార్చే ఈ లిప్ పింపుల్స్ ను నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి .
ఇవి చాలా సింపుల్ హోం రెమెడీస్ . కొన్ని నేచరల్ ఆయిల్ లేదా పింపుల్ ప్యాక్ ద్వారా లిప్ పింపుల్స్ ను నేచురల్ గా నివారించుకోవచ్చు. .
పెదాల మీద ఏర్పడ్డ మొటిమలను నివారించడానికి కొన్ని బెస్ట్ హోం రెమెడీస్. వీటిని ఉపయోగించడం ద్వారా మొటిమలను నివారించడంతో పాటు మచ్చలను కూడా మాయం చేయవచ్చు. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

1. టూత్ పేస్ట్:
మొటిమలను నివారించడానికి టూత్ పేస్ట్ ఒక గొప్ప హోం రెమెడీ. ముఖంను శుభ్రంగా కడిగి, తడి పూర్తిగా ఆరిన తర్వాత, పెదాల మీద ఏర్పడ్డ మొటిమల మీద టూత్ పేస్ట్ ను అప్లై చేయాలి . ఇలా కొన్ని సార్లు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. వేప పేస్ట్:
రెండు వేపఆకుల తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి . ఈ పేస్ట్ ను పెదాల మీద ఏర్పడ్డ మొటిమల మీద అప్లై చేసి నిధానంగా మసాజ్ చేయాలి . ఇలా రెమెడీని క్రమం తప్పకుండా అప్లై చేస్తుంటే, రెండు రోజుల్లో సమస్యను నివారించడం జరుగుతుంది.

3. ఆలివ్ ఆయిల్:
ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తీసుకొని, క్యాండిల్ మీద వేడి చేయాలి . గోరువెచ్చగా అయిన తర్వాత ఈ ఆయిల్ ను మొటిమల మీద నేరుగా అప్లై చేయాలి. ఈ హాట్ ఆయిల్ మొటిమలు పగిలిపోయేలా చేసి మొటిమలు కనబడకుండా చేస్తాయి.

4. కొబ్బరి నూనె:
లిప్ పింపుల్స్ నివారించడంలో కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ అప్లై చేసిన పద్దతి ప్రకారమే కొబ్బరి నూనె కూడా అప్లై చేయాల్సి ఉంటుంది.

5. వాటర్ మ్యాజిక్ :
మీకు కనుక సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లైతే, వాటర్ ద్వారానే మొటిమలను నివారించుకోవచ్చు. మొటిమల మీద చల్లటి నీటిని పోసి కడగాలి. తర్వాత తడిని పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

6. కలబంద:
ఫ్రెష్ గా ఉండే అలోవెరాను లిప్ పింపుల్స్ మీద డైరెక్ట్ గా అప్లై చేయాలి . కలబంద అప్లై చేయడం వల్ల ఇది ఇతర ఇన్ఫెక్షన్స్ సోకకుండా నివారిస్తుంది. కొద్దిగా పసుపు మిక్స్ చేస్తే మరింత త్వరగా నయం అవుతుంది.

7. పసుపు:
ఒక చెంచా పసుపును నీళ్ళలో వేసి, పేస్ట్ లా చేసి ఈ పేస్ట్ ను నేరుగా లిప్ పింపుల్ మీద అప్లై చేయాలి . ఈ హోం రెమెడీ మొటిమలను నివారించడంతో పాటు, ఇన్ఫెక్షన్స్ ను కూడా నివారిస్తుంది.

8. నిమ్మరసం:
లిప్ పింపుల్స్ మీద నిమ్మరసంను నేరుగా అప్లై చేయడం వల్ల , మొటిమలు బర్న్ అవుతాయి. తర్వాత కొద్దిగా పాలు అప్లై చేస్తే స్మూతింగ్ ఎఫెక్ట్ కలుగుతుంది.

9. బాదం:
బాదంకు కొద్దిగా పాలు జోడించి, పేస్ట్ లా చేసి తర్వాత నేరుగా మొటిమలకు అప్లై చేస్తే సమస్య నివారించబడుతుంది. లిప్ పింపుల్స్ నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

10. కాఫీ ట్రీట్మెంట్ :
కొద్దిగా కాఫీ పౌడర్ ను నీటిలో వేసి మిక్స్ చేసి తర్వాత పెదాల మీద మసాజ్ చేయాలి . ఇలా చేస్తే మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు కూడా తొలగిపోతాయి.

11. బొప్పాయి :
మొటిమలను నివారించడానికి బొప్పాయి మరో బెస్ట్ హోం రెమెడీ. బొప్పాయితో ఫేస్ మాస్క్ వేసుకున్నట్లే, పెదాల మీద కూడా మాస్క్ వేయడం ద్వారా ఒక్క వారంలోనే లిప్ పింపుల్స్ నివారించబడుతాయి.

12. ఆరెంజ్ పీల్ పేస్ట్:
ఆరెంజ్ తొక్కను తీసి మెత్తగా పేట్ట్ చేసి మొటిమల మీద నేరుగా అప్లై చేయాలి. ఇందులో ఉండే నేచురల్ యాసిడ్స్ మొటిమలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications
