Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
నల్లని మరియు ఒత్తైన కనుబొమ్మలు పొందడానికి ఉత్తమ చిట్కాలు
కనుబొమ్మలు మందంగా మరియు డార్క్ గా కనబడాలంటే ఏం చేయాలి?అవును , అలా కూడా మనం మ్యానేజ్ చేయవచ్చు. అందుకోసం బోల్డ్ స్కై కొన్ని బెస్ట్ టిప్స్ ను అందిస్తోంది . ఈ నేచురల్ పద్దతులను అనుసరిస్తే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీది సెన్సిటివ్ స్కిన్ అయినా ఎటువంటి సమస్య ఉండదు.
తాజాగా ఉండే కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల ఐబ్రోస్(కనుబొమ్మలు)నేచురల్ గానే ఒత్తుగా పెరుగుతాయి. దీంతో చాలా మంది ఉత్తమ ఫలితాలను పొందారు. కనుబొమ్మలు, ఒత్తుగా మరియు డార్క్ గా పెరగడానికి కొబ్బరి నూనె మాత్రమే కాదు, మరికొన్ని ఇతర హోం రెమెడీస్ కూడా ఉన్నాయి.
ఆముదం కూడా ఐబ్రో యొక్క హెయిర్ ఫోలిసెల్స్ మందంగా పెరగడం వల్ల ఐబ్రో ఒత్తుగా పెరుగుతుంది. ఆలివ్ ఆయిల్ కూడా చాలా ఐబ్రోస్ ఒత్తుగా మరియు డార్క్ గా పెరుగుతుంది. ఇవే కాదు, మరికొన్ని హోం రెమెడీస్ మీకోసం...

ఆముదం
ఒక చెంచా ముదం తీసుకొని వేడి చేసి, గోరువెచ్చగా కనుబొమ్మలకు అప్లై చేయాలి . ఈ నేచురల్ టిప్ మీ ఐబ్రో ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

కొబ్బరి నూనె
ఐబ్రో యొక్క హెయిర్ స్ట్రక్చర్ ను మ్యానేజ్ చేయడానికి కొబ్బరి నూనె చక్కగా ఉపయోగపడుతుంది . కొద్దిగా చేతివేలితో అప్లై చేసి, రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం కడిగేయాలి.

బాదం నూనె
బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది మరో ఎఫెక్టివ్ నేచురల్ టిప్. ఈ బాదం నూనె వారానికి రెండు సార్లు అప్లై చేయాలి.

ఆలివ్ ఆయిల్
ఐబ్రో ఒత్తుగా పెరగడానికి ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయవచ్చు . దీన్ని రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం కడిగేయాలి.

కలబంధ
చిన్న కలబంద ముక్కను తీసుకొని, ఐబ్రోకు మసాజ్ చేయాలి. 10నిముషాలు ఉంచుకొని తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఉల్లిపాయ రసం
కాటన్ బాల్ ను ఉల్లిపాయ రసంలో డిప్ చేసి ఐబ్రోలకు పట్టించి 10 నుండి 15 నిముషాలు అలాగే ఉండి, తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

కొబ్బరి పాలు
ఐబ్రోలను ఒత్తుగా పెరగడానికి సహాయపడే కొబ్బరి పాలు. కొబ్బరి ముక్కను మెత్తగా పేస్ట్ చేసి, వాటి ద్వారా వచ్చే పాలను కనుబొమ్మలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

గుడ్డు పచ్చసొన
గుడ్డు పచ్చసొన మరో నేచురల్ హోం రెమెడీ. మీ ఐబ్రో యొక్క వాల్యుమ్ ను పెంచుతుంది. ఇది అలాగా అంటుకొంటుంది, కాబట్టి, ఒత్తుగా మరియు డార్క్ గా పెరగడానికి సహాయపడుతుంది.

మెంతులు
మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసి ఐబ్రోలకు పట్టించాలి . ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. కనుబొమ్మలు ఒత్తుగా మరియు డార్క్ గా పెరుగుతుంది.

నిమ్మ రసం
నిమ్మతొక్కను రెండుగా కట్ చేసి ఒక బౌల్ పాలలో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని కనుబొమ్మలకు పట్టించి, మసాజ్ చేయాలి. నిమ్మరసాన్ని నేరుగా కనుబొమ్మలకు అప్లై చేయకూడదు.

మందారం నూనె
మందారం నూనె లేదా మందార పువ్వుల యొక్క పేస్ట్ ను కనుబొమ్మలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత నీళ్ళతో కడిగేయాలి.

పాలు
తాజా పాలను కనుబొమ్మలకు రెండు రోజులకొకసారి అప్లై చేస్తుండాలి. ఇలా క్రమంగా చేస్తుంటే, అద్భుతమైన మార్పును మీరు చూడగలరు.

కాజల్ ట్రిక్
కాటుక మరియు ఆలివ్ ఆయిల్ ను రెండింటింని మిక్స్ చేసి ఉపయోగించాలి . దాంతో కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. కాటక, ఆలివ్ ఆయిల్ యొక్క కాబినేషన్ చాలా ఎఫెక్టిగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications