కొబ్బరి నూనెలో దాగి ఉన్న సౌందర్య రహస్యాలు

కొబ్బరినూనె ప్రతిరోజూ వాడితే చర్మం చక్కటి తేమ కలిగి నిగ నిగ లాడుతుందని చర్మ నిపుణులు చెపుతున్నారు. ప్రకృతి పరంగా ప్రసాధించిన బ్యూటీ వస్తువులలో కొబ్బరి నూనె ఒక మంచి బహుమతి మనకు. కొబ్బరి నూనెను బ్యూటీ ప్రొడక్ట్ గా ఉపయోగిస్తారు. కొబ్బరినూనెను వివిధ రకాలు గా ఉపయోగించుకోవచ్చు మంచి ఫలితాన్ని పొందవచ్చు. బ్యూటీ విషయంలో శరీరంలో అన్ని భాగాలకు కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. మరియు దీని వలన అనేక ప్రయోజనాల పొందవచ్చు. కొబ్బరి నూనె నేచురల్ గా యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉన్నది. అలాగే lauricఆమ్లంను కూడా కలిగి ఉన్నది .

కొబ్బరి బోండాంలో ఉండే పోషకాంశాలు మీకు తెలుసా...!?

సాధారణంగా ముఖంపైనే కాదు శరీరం పై కూడా వచ్చే మచ్చలు, శరీర సౌందర్యాన్ని అందవిహీనంగా మార్చేస్తాయి. అయితే ఒక్కొక్కసారి ఇవి వయస్సుతో సంబందం లేకుండా కొన్ని సందర్భాలలో సూర్యరశ్మి కారణంగా కూడా మచ్చలు, వస్తాయి. కొద్దరి స్కిన్ అలర్జీవల్లనూ మచ్చలు ఏర్పడతాయి. వీటిని పోగొట్టడానికి కాస్మోటిక్స్, సౌందర్య సాధానాలు వాడటం కంటే కొబ్బరి నూనె ఉపయోగించడం ద్వారా పూర్తిగా పోగొట్టవచ్చు. కొబ్బరి నూనెలో అంతటి సహజగుణాలు కలిగి ఉన్నాయి. మరి కొబ్బరి నూనె సౌందర్యానికి ఏవిధంగా సహాయపడుతుందో చూద్దాం...

డ్రై స్కిన్ నివారించడానికి

డ్రై స్కిన్ నివారించడానికి

వేసవికాలంలో కొబ్బరి నూనె ఉపయోగించడానికి ఒక ముఖ్య కారణం డ్రై స్కిన్ నివారిస్తుంది. దీన్ని మీరు నిద్రించడానికి ముందు ముఖానికి, శరీరానికి అప్లై చేస్తుం మంచి ఫలితం ఉంటుంది.

పాదాల పగుళ్ళను నివారిస్తుంది

పాదాల పగుళ్ళను నివారిస్తుంది

పాదాల పగుళ్ళను నివారించుకోవడానికి కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది .ఈ నూనెను ప్రతి రోజూ రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే పాదాల పగుళ్ళు నివారించి చర్మం స్మూత్ గా మరియు సాఫ్ట్ గా మారుతుంది.

నెయిల్ కేర్:

నెయిల్ కేర్:

కొబ్బరినూనెను నెయిల్ కేర్ లో కూడా ఉపయోగించవచ్చు. పెడిక్యూర్ చేసుకోవడంలో కొబ్బరి నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చేతి వేళ్ళ నుండిక్యూటికల్స్ ను తొలగిస్తుంది. మరియు నెయిల్ గ్రోత్ ను సహాయపడుతుంది .

మేకప్ తొలగించుకోవడానికి :

మేకప్ తొలగించుకోవడానికి :

కొబ్బరినూనె చాలాప ఎఫెక్టివ్ గా పనిచేసే ఒక నేచురల్ బ్యూటీ వస్తువు. ఇది మేకప్ ను తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో మీ చర్మానికి హాని కలిగించే ఎటువంటి హానీకరమైన కెమికల్స్ ఉండవు. కొబ్బరి నూనె చాలా అద్భుతంగా మేకప్ ను తొలగిస్తుంది. మరియు ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల చర్మానికి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది.

 శరీరంమీద పగుళ్ళను నిరోధిస్తుంది:

శరీరంమీద పగుళ్ళను నిరోధిస్తుంది:

శరీరం మీద ఏర్పడ్డ పగుళ్ళను వదిలించుకోవడానికి కొబ్బరి నూనె బాడీ బామ్ లేదా బాడీ స్ర్కబ్ గా ఉపయోగించవచ్చు. దాంతో ఇది మీ చర్మానికి తగినంత తేమను అంధించి స్మూత్ గా మరియు సిల్కీగా ఉంచుతుంది

నైట్ క్రీమ్:

నైట్ క్రీమ్:

కొబ్బరి నూనెతో చర్మానికి మసాజ్ చేయడం వల్ల చర్మంజిడ్డుగా మారుతుంది. కాబట్టి, పగలు కొబ్బరి నూనె ఉపయోగించకూడదనే సలహా. కానీ కొబ్బరినూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల అనేకబ్యూటీ బెనిఫిట్స్ ను పొందవచ్చు. కాబట్టి ఒది నైట్ క్రీమ్ గా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్ ఇది చర్మానికి పునరుత్తేజాన్ని కలిగిస్తుంది.

స్నానానికి ముందు కొబ్బరి నూనెను

స్నానానికి ముందు కొబ్బరి నూనెను

స్నానానికి ముందు కొబ్బరి నూనెను శరీరమంతా పూతలా పూసి చేత్తో సున్నితంగా మర్దన చేసి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని నెలల పాటు చేస్తే మచ్చలు పోయి చర్మం మరింత మెరుస్తుంటుంది.

చర్మ సంరక్షణ కొబ్బరి నూనెను

చర్మ సంరక్షణ కొబ్బరి నూనెను

చర్మ సంరక్షణ కొబ్బరి నూనెను నేరుగా చర్మానికి అప్లై చేయడం వల్ల మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. డ్రై స్కిన్ నివారిస్తుంది. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. స్కిన్ కు తగినంత తేమను అందిస్తుంది. ప్రీమెచ్యుర్ ఏజింగ్ ను నివారిస్తుంది. కొబ్బరి నూనె అంతటితో ఆగదు ఇది డార్క్ స్పాట్స్ ను లైట్ చేస్తుంది మరియు మొటిమలను నివారిస్తుంది

 సన్ బర్న్ నివారిస్తుంది

సన్ బర్న్ నివారిస్తుంది

వేసవి సీజన్ లో ఎండ వేడికి చర్మం కమలడం జరుగుతుంటుంది. అలా జరగకుండా స్కిన్ టోన్ కలర్ ఫుల్ గా కాంతివంతంగా ఉండాలంటే కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. సన్ బర్న్ అయిన ప్రదేశంలో కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసి చూడండి అద్భుతమైన ఫలితాలను మీరు గమనించవచ్చు.

కోల్డ్ సోర్ ట్రీట్మెంట్

కోల్డ్ సోర్ ట్రీట్మెంట్

చలికాలంలో చలి లేదా మంచుకు పెదాలు పగలడం, కాళ్ళు చేతులు కూడా ఎక్కువగా పగుళుతుంటాయి. మరి అందుకు కోకనట్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. మరి కోకనట్ ఆయిల్ ను సెన్సిటివ్ పెదాల మీద అప్లై చేయాలి.

లిప్ ప్రొటెక్టర్

లిప్ ప్రొటెక్టర్

కొబ్బరి నూనె పెదాలను తేమగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పెదాలు సాఫ్ట్ గా తేమగా, పింక్ గా మార్చుతుంది.

హ్యాండ్ అండ్ ఫీట్ కేర్:

హ్యాండ్ అండ్ ఫీట్ కేర్:

కొద్దిగా కొబ్బరి నూనెను చేతుల్లో వేసుకొని కూటికల్స్ మీద అప్లై చేసి మర్ధన చేయడం వల్ల మీ చేతి వేళ్ళ మరియు గోళ్ళు ఆరోగ్యంగా మరియు స్ట్రాంగ్ గా కనబడుతాయి. అదేవిధంగా డ్రై మరియు క్రాక్డ్ హీల్స్ కూడా నయం చేయబడుతాయి . కొద్దిగా కొబ్బరి నూనె కాళ్ళకు అప్లై చేసి మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎక్స్ ఫ్లోయేంట్ :

ఎక్స్ ఫ్లోయేంట్ :

మీకు తెలుసా కోకనట్ ఆయిల్ ను ఒక అద్భుతమైన ఎక్సఫ్లోయేట్ గా ఉపయోగించుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా రెండు చెంచాల కొబ్బరి నూనెలో మూడు చెంచా పంచదార మిక్స్ చేయాలి. దీన్ని జార్ లేదా డబ్బాలో స్టోర్ చేసి అవసరం అయినప్పుడు దీన్ని ఉపయోగించాలి. ఇది ఒక చౌకనై ప్రభావవంతమైన ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది .

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

కోకనట్ ఆయిల్ ను ఫుల్ బాడీ మాయిశ్చరైజర్ గా ఉపయోగించాలి. దీన్ని విరివిగా ఉపయోగించడం వల్ల ఒక గొప్ప మాయిశ్చరైజర్ గా ఉపయోగిస్తూ వరీరానికి కాళ్ళకు మరియు చేతులకు అప్లై చేసి 15నిముషాల తర్వాత స్నానం చేస్తే చర్మం నునుపుగా తేమగా ఉన్నట్లు కనిపిస్తుంది.

జుట్టుకు హైడ్రేషన్

జుట్టుకు హైడ్రేషన్

కఠినమైన గాలులు, వేడి వాతావరణం, చల్లని వాతావరణంలో జుట్టును మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు జుట్టుకు కొబ్బరినూనె చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా డ్యామేజ్ మరియు డాండ్రప్ మరియు హెయిర్ లాస్ ను నివారించడంలో కొబ్బరి నూనె ఉత్తమమైనది. జుట్టును సాప్ట్ గా షైనీగా మార్చడంతో పాటు జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

Story first published: Wednesday, October 7, 2015, 11:25 [IST]
Desktop Bottom Promotion