Latest Updates
-
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - మంగళవారం, 28 ఏప్రిల్ 2026 -
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి!
హెయిర్ డ్యామేజ్, హెయిర్ ఫాల్, బట్టతలను నివారించే సన్ ఫ్లవర్ ఆయిల్
ప్రకృతిలో జనిస్త్తున్న పుష్పాలు మానవాళిని కనువిందు చేస్తుంటాయి. అందులోనూ సూర్యుడితో పాటు తిరిగే పొద్దు తిరుగుడు పచ్చదనంతో పాటు భారీ తనం కూడా కంటికింపుగా ఉంటుంది. అంతే కాదు సన్ ఫ్లర్ నుండి వికసించే విత్తనాలు కూడా ఆరోగ్య, సౌందర్య సాధాణాలు అధికంగా వినియోగిస్తున్నారు . అత్యధికంగా ప్రపంచం మొత్తంలో ప్రధమంగా వినియోగించెది వంటనూనెగా.. సౌందర్య ద్రవాలు, లేపనాలలో, చర్మరక్షణ నూనెలలో వినియోగిస్తారు. అంతే కాదు ఆరోగ్య పరంగా కూడా చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలో లెసిథిన్, కెరోటినాయిడ్స్, టోకోఫెరల్స్ మరియు విటమిన్ ఎ, డి, మరియు ఇలు పుష్కలంగా ఉంటాయి .
ఇంకా మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం మరియు జింక్ వంటి న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల . వీటి నుండి వివిధ రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కానీ, ఆ ఆయిల్ యొక్క ప్రయోజనాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ ఆయిల్ చర్మానికి మరియు కేశాలకు చాలా అద్భుతాలను చేస్తాయి . సన్ ఫ్లవర్ ఆయిల్ చాలా ఉత్తమమైనది మరియు హెల్తీ స్కిన్ మరియు హెల్తీ హెయిర్ మెయింటైన్ చేయడానికి చాలా సౌకర్యవంతమైనది.
సన్ ఫ్లవర్ సీడ్స్ లోని పోషకాలు: ఆరోగ్యప్రయోజనాలు
అధిక న్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల వీటి చాలా విరివిగా కాస్మోటిక్ ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తున్నారు . ఈ సన్ ఫ్లర్ ఆయిల్ మొటిమలు, ఎగ్జిమా మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ నూనె ఏజింగ్ లక్షణాలను మరియు హానికరమైన యూవి రేస్ నివారిస్తుంది.
సన్ ఫ్లవర్ ఆయిల్ యొక్క అమేజింగ్ బెనిఫిట్స్ మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

మొటిమలను నివారిస్తుంది:
సన్ ఫ్లవర్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇది చర్మానికి చాలా గ్రేట్ గా పనిచేసి, మొటిమలను నివారిస్తుంది . ఇది స్కిన్ మాయిశ్చరైజర్ గా పనిచేసి మొటిమలు మరియు ఇతర స్కిన్ ఇన్ఫ్లమేషన్ డిసీజ్ ల నుండి రక్షణ కల్పిస్తుంది. అంతే కాదు ఇది చర్మంలోకి చాలా గ్రేట్ గా షోషింపబడుతుంది.

ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది :
సన్ ఫ్లవర్ ఆయిల్ చర్మాన్ని యంగ్ గా మరియు రేడియంట్ గా ఉంచుతుంది. ఇది మొటిమలను మరియు స్కిన్ వదులవ్వడాన్ని నివారిస్తుంది . ఏజ్ అయిపోయిన వారిలా కనించడానికి కారణం అయ్యే లక్షణాలను మరియు ముడుతలను మరియు ఫైన్ లైన్స్ ను నివారించడంలో సన్ ఫ్లవర్ ఆయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

చర్మం హెల్తీగా మార్చుతుంది:
సన్ ఫ్లవర్ ఆయిల్లో ఉండే రక్షణ అంశాలు చర్మానికి బ్యాక్టీరియా మరియు హానికరమైన కెమికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ ఆయిల్ తేలికగా మరియు తేలికగా(జిడ్డులేకుండా)ఉండుట వల్ల చర్మంలోని చాలా బెటర్ గా అబ్సార్బ్ అవుతుంది. మరియు ఇది సెల్ రీ జనరేషన్ కు కారణం అవుతుంది.

యూవీ రేస్ నుండి రక్షణ కల్పిస్తుంది:
హానికరమైన యూవీ రేస్ చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది. మరియు ఇది స్కిన్ క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి చర్మం మీద సన్ ఫ్లవర్ ఆయిల్ పైకవచంలా పనిచేసి యూవీ కిరణాల నుండి రక్షన కల్పిస్తుంది . మరియు ఇందులో విటమిన్ ఇ కంటెంట్ అధికంగా ఉంటం వల్ల సూర్యకిరణాలు చాలా తక్కవుగాచర్మానికి తగిలేలా చేస్తుంది.

షైనీ హెయిర్:
సన్ ఫ్లవర్ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి మరియు వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ హెయిర్ ను సాఫ్ట్ గా మరియు అందంగా ఉంచడానికి సహాయపడుతుంది . ఈ నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు మ్యానేజ్ చేయడానికి చిక్కు విడిపించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది.

హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది:
సన్ ఫ్లవర్ ఆయిల్లో హెయిర్ బ్రేకేజ్ ను నివారించే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి . డ్రై హెయిర్ బ్రేక్ చేయకుండా స్ట్రాంగ్ గా ఉండేలా చేయడంలో సన్ ఫ్లవర్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు కేశాల్లోకి డీప్ గా వేల్లి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. దాంతో హెయిర్ బ్రేకేజ్ మరియు హెయిర్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

జుట్టు పల్చబడటం నివారిస్తుంది:
సన్ ఫ్లవర్ ఆయిల్లో లినోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ ఫాల్ , హెయిర్ పల్చబడటం మరియు బట్టతలను నివారిస్తుంది . సన్ ఫ్లవర్ ఆయిల్లో ఉండే విటమిన్స్ హెయిర్ హెల్త్ అండ్ హెయిర్ గ్రోత్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications