Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
వేసవిలో పాదాల మంటలను నివారించే వంటింటి చిట్కాలు
మీరు ఎప్పుడైనా ముఖ్యంగా వేసవి కాలంలో, మీ పాదాలకు బాధాకరమైన సెగలు వచ్చాయా? అవును అని మీ సమాధానం అయితే, అవి అరికాలి మంటలు అని అంటారు; దానిని వైద్యపరంగా న్యూరోపతి లేదా పారేస్తేసియా అంటారు.
అరుదుగా వేసవిలో సంభవించే ఈ పాదాల మంటలను కొన్ని నివారణలతో ప్రయత్నించడం ఉత్తమం. ఒకవేళ, ఈ పరిస్థితి తరచుగా ఎదుర్కుంటుంటే మరియు ఈ లక్షణం ముదిరితే, మంచి నిపుణులను సంప్రదించటం మంచిది.
అవయవాలకు రక్త ప్రసరణ తక్కువగా జరగటంవలన ప్రధానంగా ఈ పాదాల మంటలు ఏర్పడతాయి. ప్రధానంగా, కాళ్ళలో దెబ్బతిన్న నరాల కారణంగా, వయసు పైనబడుతున్నకొద్ది నరాలు బలహీనపడటం వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

కీమోథెరపీ, మద్యపానం, అథ్లెట్ల పాదాలు, ఎయిడ్స్, మూత్రపిండాల వైఫల్యం, రక్తహీనత మరియు కొన్ని ఇతర కారణాల వలన ఈ అరికాలి మంటలు ఏర్పడుతాయి. వీటివలన వేడిగా, సూదులు గుచ్చినట్లుగా నొప్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపవలసి వొస్తుంది. మీరు వేసవిలో కొంత వ్యక్తిగత సంరక్షణ మరియు కొన్ని గృహ వైద్య నివారణలతో ఈ అరికాళ్ళ మంటలను తగ్గించుకోవొచ్చు.
మధుమేహం కలిగిన వృద్ధులు, ఎక్కువ సమయం నిలబడి ఉండే ఉద్యోగస్థులు మరియు నరాల రుగ్మతలు ఉన్నవారు ఈ పరిస్థితి ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. సరైన స్వీయ రక్షణ మరియు క్రింద ఇచ్చిన కొన్ని గృహవైద్య నివారణలు మీకు వేసవిలో కలిగే ఈ పరిస్థితి నుండి విముక్తి పొందటానికి సహాయపడతాయి.

అల్లం
ప్రతి రోజు పది నిమిషాలు అల్లం రసం మరియు ఆలివ్ లేదా కొబ్బరి నూనె కలిపిన వెచ్చని మిశ్రమంతో మీ పాదాలను మరియు కాళ్లను మర్దన చేయటం వలన నొప్పి తగ్గుతుంది మరియు రక్త ప్రసరణ చురుగ్గా జరుగుతుంది. మీ శరీరంలో రక్త ప్రసరణ చురుగ్గా సాగటానికి రోజువారీ ఒక అల్లంముక్క తినాలి. READ MORE:అందమైన సున్నిత పాదాలకు 10 సులభ చిట్కాలు
హతోర్న్
ఒక కప్పు నీటిలో హాతోర్న్ఒక టేబుల్ స్పూన్ కలపండి మరియు రోజులో పదిహేను నిమిషాలు నాననివ్వండి . హాతోర్న్ రక్త నాళాలను వ్యాకోచింప చేయటం వలన రక్తప్రసరణ కాళ్ళకు మరియు ఇతర శరీర భాగాలకు మరింత చురుగ్గా జరుగుతుంది. ఇది వేసవిలో అరికాళ్ళ మంటలకు ఉత్తమ నివారణలలో ఒకటి ..

థైమ్
థైమ్ కలిపిన చల్లని లేదా వేడి నీటిలో అరికాళ్ళను నాననివ్వటం వలన అరికాళ్ళ మంటలకు సంబందించిన నొప్పి మరియు తిమ్మిరి ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజులో ఇరవై నిమిషాలు మీ పాదాలను థైమ్ లో నాననివ్వటం వలన తరుచుగా సంభవించే ఈ పరిస్థితిని నిరోధించవచ్చు.
విటమిన్ B3
విటమిన్ B3 సమృద్ధిగా ఉన్న గుడ్డు పచ్చసొన, పాలు, బటానీలు మరియు చిక్కుళ్ళు వంటి పోషక ఆహార వినియోగాన్ని పెంచడం వలన పాదాలమంటలకు ఒక సాధారణ సహజ పద్ధతిలో నివారణ కలుగుతుంది. విటమిన్ B3 నరాలకు బలాన్ని చేకూరుస్తుంది మరియు రక్తపీడనం వలన నరాలు తెగిపొవటాన్ని నిరోధిస్తుంది. READ MORE: మోచేయి నలుపును నివారించడానికి 9సులభ చిట్కాలు
ఆహారం మరియు ఆర్ద్రీకరణ
ప్రోటీన్లు మరియు కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాన్ని ముఖ్యంగా చేపలు, ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, నట్స్ మరియు అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవటం వలన క్రమంగా అరికాళ్ళ మంటలు నివారింపబడి పరిస్థితి మెరుగుపడుతుంది. పానీయాలు ఎక్కువగా తీసుకుని ఆర్ద్రీకరణతో ఉండండి.

వ్యాయామాలు మరియు ఫుట్ మసాజ్
వాకింగ్, జాగింగ్ మరియు పరుగెత్తటం వంటి రెగ్యులర్ వ్యాయామాలు ఖచ్చితంగా అమలు చేయటం వలన మంటలు మరియు మీ కాళ్ళ యొక్క బాధాకరమైన పరిస్థితి సడలింపబడుతుంది. వ్యాయామం చేయటం వలన మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ అరికాళ్ళ మంటల అసౌకర్యానికి మరియు నొప్పి తగ్గిడానికి మర్దన కూడా ఒక మంచి మార్గం.
బేర్ఫుట్ వాకింగ్
పాదరక్షలు లేకుండా గడ్డి లేదా ఇసుక మీద వాకింగ్ చేయటం వలన పాదాలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కానీ, కఠినంగా ఉన్న నేలపై వాకింగ్ నివారించండి ఎందుకంటే దీనివలన నొప్పి మరియు అసౌకర్యం ఎక్కువవుతుంది. ఎల్లప్పుడూ మీ పాదాలు పొడిగా ఉండేట్లుగా చూసుకోండి.
సరైన పాదరక్షలు ధరించండి
గట్టి-సరిఅయిన బూట్లు ధరించడం వలన మీ పాదాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. సరైన రక్త ప్రసరణ జరగడానికి మీ పాదాల సైజుకి తగ్గ సౌకర్యవంతమైన మరియు అమరిన బూట్లు ధరించండి.



Click it and Unblock the Notifications