Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మెడ చుట్టూ డార్క్ స్కిన్ ప్యాచెస్ నివారించే ఉత్తమ హోం రెమెడీస్
చాలా మంది మెడ మీద డార్క్ బ్లాక్ ప్యాచెస్ తో ఇబ్బంది పడుతుంటారు . దీన్నే కామన్ స్కిన్ పిగ్మెంటేషన్ అంటుంటారు. ఇది బాహ్య చర్మ యొక్క పొరలలో జీవకణములు దళసరియగుట వల్ల చర్మం నల్లగా మారుతుంది. ఇది ఒక సాధారణ సమస్య. ఇది అంటువ్యాధి కాదు. శరీరం అంతా తెల్లగా ఉండి, మెడ క్రింద చాలా నల్లగా ఉంటుంది. గీతలు, గీతలుగా ఉండి మందపాటి అట్టలాగా పేరుకు పోయిన నలుపుతో ఉన్న వారు నలుగురులోకి రావడానికి ఇబ్బంది పడుతుంటారు. తెల్లటి శరీర ఛాయ ఉన్నా, మెడ చుట్టూ నలుపు వల్ల అందరితో చొరవగా కలవలేకపోతుంటారు.
READ MORE: మిమ్మల్ని తెల్లగా మార్చే 20 నేచురల్ ఫేస్ ఫ్యాక్స్
మెడ మీద డిస్ కలర్ కు కారణం వయస్సు పైబడటం మరియు సూర్యరశ్మికి ఎక్కువగా బహిర్గతం అవ్వడం వల్ల మెడ వద్ద చర్మం నల్లగా మారుతుంది. ఇంకా డయాబెటిస్, పాలిసిస్టిక్ ఓబరీ సిండ్రోమ్, మరియు అకస్మికంగా బరువు తగ్గడం లేదా బరువు పెరగడం కూడా మెడ వద్ద చర్మం నల్లబడుటకు కారణం అవుతుంది.
READ MORE: డార్క్ నెక్ (మెడ నలుపు)నివారించే బెస్ట్ హోం రెమెడీస్
మెడ చుట్టూ చర్మ నల్లబడకుండా లేదా చర్మం యొక్క రంగు మారకుండుటకు కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

బాదం
బాదంలో విటమిన్స్ అధికంగా ఉంటాయి . ఇవి స్కిన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి . చర్మానికి అవసరం అయ్యే పోషణను అందిస్తాయి . డిస్ కలర్ ను తగ్గిస్తాయి . మెడ చుట్టూ ఉన్న నలుపును నివారించుకోవడానికి బాదంను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు . సింపుల్ హోం రెమెడీస్, అర చెంచా బాదం పౌడర్, ఒక చెంచా మిల్క్ పౌడర్ మరియు ఒక చెంచా తేనె మిక్స్ చేసి ఈ పేస్ట్ ను మెడ చుట్టూ పట్టించాలి . అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద:
కలబంద నేచురల్ స్కిన్ పదార్థం ఇది చర్మానికి తగినంత తేమను అందిస్తుంది . ఇది స్కిన్ కలర్ ను లైట్ చేస్తుంది. మరియు వివిధ రకాల స్కిన్ స్పాట్స్ ను తగ్గిస్తుంది. అలోవెరాలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్లకంగా ఉంటాయి . మరియు ఇతర కాంపోనెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేస్తాయి కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేస్తాయి. అవోవెరా నుండి జెల్ తీసి నేరుగా మెడకు అప్లై చేయాలి . అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి 20 నిముషాలు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే చాలా త్వరగా ఫలితం చూపుతుంది.

వాల్ నట్స్
వాల్ నట్స్ లో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి తగినంత పోషణను అందిస్తాయి. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది హెల్తీ స్కిన్ కు చాలా అవసరం . డార్క్ స్కిన్ నివారించుకోవడానికి వాల్ నట్ మరియు పెరుగు మిశ్రమంతో స్కబ్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . వాల్ నట్ పౌడర్ కు కొద్దిగా పెరుగు జోడించాలి. ఈపేస్ట్ ను మెడ చూట్టూ అప్లై చేయాలి. కొన్ని నిముషాలు స్క్రబ్ చేసి, డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో లేదా రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కీరదోసకాయ:
కీరదోసకాయ నేచురల్ వైట్ స్కిన్ అందివ్వడానికి అద్భుతంగా సహాయపడుతుంది. కీరదోసకాయ జ్యూస్ ను మెడ చుట్టూ అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో లేదా రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.
మరో పద్దతి కీరదోస రసం మరియు నిమ్మరసం సమంగా తీసుకొని మిక్స్ చేసి కాటన్ బాల్స్ డిప్ చేసి మెడ చుట్టూ అప్లై చేసి 10 నిముషాల పాటు మర్దన చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఈ రెమెడీని కొన్ని రోజుల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది

నిమ్మరసం
నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ . నిమ్మలో ఉండే విటమిన్ సి డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. స్కిన్ టోన్ ను మార్చుతుంది. అందువల్ల, నిమ్మరసం కూడా డార్క్ స్కిన్ తొలగించడానికి ఉపయోగించుకోవచ్చు. నిమ్మరసంలో కాటన్ బాల్స్ ను డిప్ చేసి మెడ చుట్టూ అప్లై చేయాలి. నిమ్మరసంను నీటిలో వేసి మిక్స్ చేసి మెడ చూట్టూ అప్లై చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం అప్లై చేసున్నాక నేరుగా ఎండలో తిరగకూడదు మరో పద్దతి: నిమ్మరసంను రోజ్ వాటర్ తో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడ చుట్టూ అప్లై చేయాలి. నిద్రించే ముందు ఇలా చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. త్వరగా మంచి ఫలితం అందిస్తుంది.

ఓట్స్
ఓట్స్ గ్రేట్ స్కిన్ స్క్రబ్బర్ గా పనిచేస్తుంది. ఇది చర్మానికి ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. ఇది డార్క్ స్కిన్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓట్స్ పౌడర్ తీసుకొని అందులో టమోటో గుజ్జు వేసి మిక్స్ చేసి మెడ చుట్టూ అప్లై చేసి 20 నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. చివరగా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి . ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ుంటుంది. రెండు చెంచాలా ఓట్స్ పొడిలో , సరిపడినంత పాలు పోసి మిక్స్ చేయాలి. దీన్ని మెడకు పట్టించి 20 నిముషాల తర్వాత స్క్రబ్ చేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడ
బేకింగ్ సోడా నేచురల్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ గా మరియు క్లెన్సర్ గా పనిచేస్తుంది . నిదానంగా డార్క్ స్కిన్ తొలగిస్తుంది. . బేకింగ్ సోడా మరియు నీళ్ళ యొక్క కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది హైపర్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. మూడు బాగాల బేకింగ్ సోడాలో ఒక బాగం నీళ్ళు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మెడకు పట్టించి, ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆరెంజ్ పీల్
ఆరెంజ్ లో లాగే ఆరెంజ్ తొక్కలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది.ఇది చర్మయొక్క రంగను మార్చడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్కిన్ బ్లీచింగ్ కోసం ఆరెంజ్ తొక్క గ్రేట్ గా పనిచేస్తుంది. ఆరెంజ్ తొక్కను ఎండలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఈ పొడికి కొద్దిగా పాలు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి . ఈ పేస్ట్ ను మెడచుట్టూ పట్టించి 20 నిముషాలు డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

శెనగపిండి
శెనగపిండి అద్భుతంగా ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది . ఇది డార్క్ స్కిన్ ప్యాచెస్ ను తొలగిస్తుంది. శెనగపిండికి కొద్దిగా పసుపు మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. రెండు టీ స్పూన్ల శెనగపిండి కి ఒక చిటికెడు పసుపు మిక్స్ చేయాలి.దానికి కొద్దిగా నీళ్ళు మిస్ చేసి పేస్ట్ లా చేసి డార్క్ ప్యాచులున్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

బంగాళదుంపలు
బంగాళదుంలో బ్లీచింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది డార్క్ స్కిన్ కంప్లెక్షన్ ను మార్చుతుంది . పొటాటోను స్లైస్ గా కట్ చేసి, ఆ స్లైస్ ను మెడ చుట్టూ మర్ధన చేయాలి. 15 నిముషాల తర్వాతచల్లటి నీటితో కడిగేసుకోవాలి.



Click it and Unblock the Notifications











