For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోళీ కలర్స్ తొలగి పోయేదెలా...

|

వసంత ఋతువు ఆగమనం మనుషులలో ఉత్సాహమే కాదు ప్రకృతిలో సరికొత్త సొగసు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి, పూలు పూస్తాయి. కోయిలలు తమ కమ్మని కంఠంతో వీనుల విందు చేస్తాయి. మల్లెలు సువాసనలు వెదజల్లుతూ గుబాళిస్తాయి. ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంతఋతువు ప్రవేశించిన తర్వాత జరుపుకునే తొలి వేడుక హోళి.

ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట కుప్ప పోశారా అన్నంత అందంగా, ఆహ్లాదంగా జరిగే హోళీ అంటే చిన్నా పెద్దా అందరికీ ప్రియమే! వయోభేదం, ఆడా, మగా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఓ పండుగలా జరుపుకునేదే హోళీ.

Tips To Remove Holi Colours

హోళీ... అందరికీ ఎంతో ఇష్టమైన, సరదా అయిన పండుగ. రంగులు వెదజల్లుకునే ఆ పండుగ నాడు... జీవితానికే ఓ కొత్త రంగును వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రపంచమంతా కలర్‌ఫుల్‌గా మారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే పండుగ వరకూ ఓకే గానీ... ఆ తర్వాతే వస్తుంది అసలు తంటా.

ఒంటి రంగులకి: శెనగపిండిలో పాలు, పెరుగు, బాదం నూనె, రోజ్‌వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి, ఒళ్లంతా పట్టించి, కాసేపుంచి కడిగేసుకుంటే రంగు వదిలిపోతుంది.

Tips To Remove Holi Colours

కొబ్బరినూనెని కొద్దిగా వెచ్చబెట్టి, దానితో ఒళ్లంతా మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఫలితముంటుంది.

కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి ఒళ్లంతా రుద్దుకుని, ఆపైన స్నానం చేస్తే రంగులు పోతాయి. కొన్నిసార్లు ఒళ్లంతా వదిలిపోయినా, ముఖానికి అంటిన రంగు మాత్రం త్వరగా వదలదు. అలాంటప్పుడు ముల్తానీ మట్టితో ప్యాక్ వేసుకుంటే మంచిది.

Tips To Remove Holi Colours

రంగులు చర్మానికి అంటుకుపోయి దురదగా అనిపిస్తే... గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి రాసుకుని, గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే దురద పోతుంది.

తలకు అంటిన రంగుల్ని వదిలించడానికి... పెరుగులో గుడ్డు తెల్లసొనను కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత షాంపూతో తలంటుకుంటే సరిపోతుంది.

Tips To Remove Holi Colours

బట్టల రంగులకి బట్టలపై రంగుల మరకలు ఉండిపోతే... నిమ్మరసంతో రుద్ది, వేడి నీళ్లతో ఉతికితే పోతాయి.అరకప్పు వైట్ వెనిగర్‌లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్‌ను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లని నీటిలో వేసి కలిపి, అందులో బట్టల్ని నానబెట్టాలి. కాసేపటి తర్వాత తీసి ఉతికితే రంగులు తేలికగా పోతాయి.

Tips To Remove Holi Colours

వేడి నీటిలో బ్లీచింగ్ పౌడర్ వేసి నానబెట్టి ఉతికితే ఫలితముంటుంది. అయితే క్లోరిన్ లేని బ్లీచ్‌నే వాడాలి.మార్కెట్లో కలర్ రిమూవర్స్ కూడా దొరుకుతాయి. వాటిని ఉపయోగిస్తే అసలు సమస్యే ఉండదు. వాషింగ్ మెషీన్‌లో ఉతకాలనుకుంటే... విప్పిన బట్టల్ని ముందు నీటిలో జాడించి అప్పుడు మెషీన్లో వేయండి. అలాగే డిటర్జెంట్ పౌడర్‌తో పాటు కాస్త వైట్ వెనిగర్‌ను వేస్తే, రంగులు మెషీన్‌కు అంటుకోకుండా ఉంటాయి!

English summary

Tips To Remove Holi Colours

Holi, the Indian festival of colours is around the corner, and people are getting ready to celebrate this festival of colours. Smearing colours to the guests and acquaintance is the norm of this Indian festival.
Story first published: Thursday, March 5, 2015, 15:13 [IST]
Desktop Bottom Promotion