Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ముఖానికి ఏ రకమైన కనుబొమ్మలు నప్పుతాయి?
కళ్లు ఏ ఆకారంలో ఉన్నాసరే వాటిని అద్భుతంగా చూపించగలిగేవి కనుబొమ్మలే అనటంలో సందేహంలేదు ఎవ్వరికీ. అంతలా ప్రభావితం చేస్తాయి. అందుకనేమో... సాధారణ మహిళలల్లో కూడా ఐబ్రో పెన్సిల్స్‌ని వాడకం రాను రాను పెరుగుతోంది. ముఖానికి అందం కన్నులైతే, వాటికి కనుబొమలు. కనుబొమలకు చక్కటి ఆకృతినిస్తే చాలు ముఖం ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంది. అంత ముఖ్యమైన కనుబొమలు కొందరికి పలుచగా ఉంటాయి.
READ MORE:నల్లని మరియు ఒత్తైన కనుబొమ్మలు పొందడానికి ఉత్తమ చిట్కాలు
మరికొందరికి మందగా ఉంటాయి. ఇంకొందరి అసలు కనుబొమ్మలు ఉండవు అలాంటి వారు ఐబ్రో పెన్సిల్ ను ఉపయోగించి అందంగా కనబడేందుకు ప్రయత్నిస్తుంటారు. అంతే కాకుండా ఐబ్రో చేయించుకొన్నప్పుడు కొన్ని పొరపాట్లు వల్ల ఐబ్రో హెయిర్ ఎక్కువగా తియ్యడం వల్ల చాలా పలుచగా అనిపిస్తుంటుంది. అది మళ్ళీ పెరగాలంటే కొన్ని నెలలు పడుతుంది. అలా కాకుండా సహజ అందాలను దక్కించుకోవాలంటే...
READ MORE: దట్టమైన కనుబొమ్మలను పొందడానికి హోం రెమిడీస్
మీ కను బొమలు సరైన షేప్ లో లేకపోతే మేకప్ సగమే పూర్తి అయినట్టు. మీరు ఏ రకమైన కనుబోమలను మైంటైన్ చేయాలో తెలుసుకోండి:

మీరు కోల ముఖం కలవారైతే:
మృదువైన కోణం గల ఐబ్రో ను చేయించుకోండి. మీ నుదుటి మధ్యభాగం నుండి ఐబ్రో స్ట్రైట్ చేసి, తరువాత వంపు తిప్పడం మొదలు పెట్టండి. చాలామంది సెలబ్రిటీలు ఈ స్టైల్ నే అనుసరిస్తారు.

మీరు గుండ్రని ముఖం కలవారైతే:
ఎక్కువ వంపుగా చేయండి. ఐబ్రోస్ కి సాధ్యమైనన్ని వేర్తికిల్ లైన్స్ ఒక ఆర్చ్ లాగ గీయండి. వాటిని మరీ గుండ్రంగా గీస్తే, మీ ముఖం ఒక బంతి లాగా కనిపిస్తుంది.

మీది పొడుగు ముఖం అయితే:
సమతలంగా ఉండే ఐబ్రోస్ చేయించుకోండి. ఇది మైంటైన్ చేయడం చాలా తేలిక, అలాగే మీ ముఖం ఎక్కువ పొడుగుగా కూడా కనిపించకుండా ఉంటుంది.

మీ ముఖం చతురస్త్రంగా ఉంటే:
వొట్టుగా ఉండే ఐబ్రోస్ మీకు మంచి అందాన్నిస్తాయి. మీ ఐబ్రోస్ ని మందంగా, కొద్దిగా గుండ్రంగా ఉంచుకోండి. పూర్తిగా వంపు తిప్పినట్టు ఉంచకండి.

హార్ట్ షేప్ ముఖం అయితే:
ఐబ్రోస్ ని రౌండ్ గా చేయించుకోండి. మీరు కొద్ది మార్పు కోసం ఎక్కువ ఆర్చ్ లాగ ఉంచుకోండి లేదా ఇంకా ఎక్కువ అందంగా కనిపించడానికి తక్కువ వంపును ఇవ్వండి.



Click it and Unblock the Notifications