For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్లపై అసహ్యంగా ఉండే డార్క్ స్పాట్స్ నివారించే పవర్ ఫుల్ రెమిడీస్..!!

By Swathi
|

టీవీ యాడ్స్ లో కనిపించే పొడవాటి అందమైన కాళ్లను చూసి.. బాధపడకండి. లైటింగ్ లో వాళ్ల కళ్లు కాస్త అందంగానే కనిపిస్తాయి. కానీ.. మన కాళ్లు.. అంత స్మూత్ గా, అందంగా లేకపోగా.. డార్క్ స్పాట్స్, మచ్చలు, మార్క్స్ పడి.. అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి.

ఈ డార్క్ స్పాట్స్ .. ప్రతి ఐదు మంది మహిళల్లో ఇద్దరికి కామన్ గా ఉంటాయట. దీన్ని హైపర్ పిగ్మెంటేషన్ అని పిలుస్తారు. చర్మం చాలా ఎక్కువ సమయం ఎండకు ఎక్స్ పోజ్ అవడం వల్ల.. ఇలా నల్లగా మారిపోతాయి. అలాగే.. మెలనిన్ ఉత్పత్తి.. పెరగడం, చర్మ సంరక్షణ సరిగా లేకపోవడం కూడా కారణం.

రేజర్స్, చిన్నప్పటి గాయాలు, స్కిన్ అలర్జీల కారణంగా.. మచ్చలు ఏర్పడాయి. అవి.. డార్క్ స్పాట్స్ గా మిగిలిపోతాయి. వీటిని పర్మనెంట్ గా, తేలికగా తొలగించడానికి సరైన పద్ధతులు లేకపోయినా.. ఈ డార్క్ స్పాట్స్ చర్మం రంగులోకి కలిసిపోయేలా చేసే.. కొన్ని హోం రెమిడీస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నిమ్మ

నిమ్మ

విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉండే నిమ్మకాయ డెడ్ స్కిల్ సెల్స్ ఉత్పత్తిని నెమ్మదిగా మారుస్తాయి. అలాగే చర్మాన్ని క్లియర్ గా మారుస్తాయి. కొన్ని చుక్కల నిమ్మరసంను.. డార్క్ స్పాట్స్ పై డైరెక్ట్ గా వేయాలి. ఇలా ఉదయం, రాత్రి రెండుసార్లు మూడు వారాలు కంటిన్యూగా చేస్తే.. తగ్గిపోతాయి.

అలోవెరా

అలోవెరా

యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న అలోవెరా జెల్ లో.. పగిలిన స్కిన్ టిష్యూలను తెల్లగా మారుస్తాయి. తాజా అలోవెరా జెల్ ని ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో కాటన్ బాల్ ముంచి తీసి.. డార్క్ స్పాట్స్ పై రాయాలి. 10 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి.

పసుపు

పసుపు

పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది. ఇది.. యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. పిగ్మెంటేషన్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ పెరుగు, అర టీస్పూన్ పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి.. డార్క్ స్పాట్స్ పై రాయాలి. ఆరిన తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి.

మజ్జిగ

మజ్జిగ

మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది.. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. కాటన్ బాల్ ని మజ్జిగలో ముంచి.. డార్క్ స్పాట్స్ పై అప్లై చేయాలి. కొన్ని నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని క్లెన్స్ చేసి, డార్క్ స్పాట్స్ ని లైట్ గా మారుస్తుంది. ఉల్లిపాయ రసం తీసి.. టేబుల్ స్పూన్ తేనెలో కలుపుకోవాలి. డార్క్ స్పాట్స్ పై అప్లై చేసి.. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి

బొప్పాయి

బొప్పాయిలో యాక్టివ్ ఎంజైమ్ ఉంటుంది. దీన్ని చర్మంపై అప్లై చేసినప్పుడు.. ఎలాంటి నొప్పి, మంట లేకుండా.. గాయాలను నయం చేస్తుంది. కొద్దిగా బొప్పాయి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి.. రాసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

తేనె

తేనె

తేనెలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. అలాగే గ్లూకోజ్ ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసి.. డార్క్ స్పాట్స్ పై రాసుకోవాలి. సున్నితంగా మసాజ్ చేసి.. హాట్ టవల్ చుట్టుకోవాలి. ఆరిన తర్వాత.. కొన్ని నీళ్లు చిలకరించి.. మసాజ్ చేయాలి.

టమోటా జ్యూస్

టమోటా జ్యూస్

టమోటా జ్యూస్ లో ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి.. మచ్చలను లైట్ గా మారుస్తాయి. 1 టీస్పూన్ టమోటా జ్యూస్, అరటీస్పూన్ తేనె కలపాలి. దీన్ని చర్మానికి మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

కొబ్బరినూనెలో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి.. యాక్నె నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని రాత్రి పడుకోవడానికి ముందు మసాజ్ చేయాలి. మచ్చలను లైట్ గా మార్చడమే కాదు.. చర్మాన్ని సూత్మ్ గా మారుస్తుంది.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

రోజ్ వాటర్ లో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి డ్రై స్కిన్ ని నివారిస్తాయి. 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, అరటీస్పూన్ గ్లిజరిన్ మిక్స్ చేయాలి. కాటన్ ప్యాడ్ ఉపయోగించి.. డార్క్ స్పాట్స్ పై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

English summary

10 Home Remedies To Get Rid Of Dark Spots On Legs

10 Home Remedies To Get Rid Of Dark Spots On Legs. Scars are caused by razors, childhood wounds and skin allergies.
Story first published:Thursday, August 18, 2016, 12:46 [IST]
Desktop Bottom Promotion