చంకల్లో డార్క్ ప్యాచెస్ ను మాయం చేసి స్కిన్ వైట్ గా మార్చే సింపుల్ టిప్స్..!

సహజంగా ఈ మోడ్రన్ ప్రపంచంలో ప్రతి అమ్మాయి అందంగా అలంకరించుకోవాలి...అందంగా డ్రెసెప్ అవ్వాలని..నలుగురిలో తను అట్రాక్టివ్ గా కనిపించాలని కోరుకుంటుంది. అందంగా విషయంలో వేసుకునే దుస్తులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అమ్మాయిలు ఉండే కలర్, హైట్...వెయిట్ ను బట్టి డ్రెస్సులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మోడ్రన్ ప్రపంచంలో చాలా మంది అమ్మాయిలు స్లీవ్ లెస్ దుస్తులు ధరించడానికి ఇష్టపడుతుంటారు. అయితే కొంత మంది అమ్మాయిల్లో ఆర్మ్ పిట్స్ డార్క్ ప్యాచెస్ తో అసహ్యంగా కనబడుట వల్ల వారు స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోవడానికి ఇష్టపడరు. ఆర్మ్ పిట్(చంకల్లో) డార్క్ ప్యాచెస్ ఉన్నప్పుడు స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకుని చేతులు ఫ్రీమూమెంట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు.

చేతులను ముందుకు చాచి ఏదైనా తీయ్యాలన్నా, చేలు పైకి లేపాలన్నా, ఒక చిన్న డ్యాన్స్ మూమెంట్ చేయాలన్నా.. చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలా డార్క్ అండర్ ఆర్మ్ ఉన్నవారు, నలుగురిలో వెళ్లడానికి ఇబ్బంది పడటం మాత్రమే కాదు, నమ్మకాన్ని కోల్పోతారు. మూడ్ సరిగా ఉండదు.

డార్క్ అండర్ ఆర్మ్ ఒకరిద్దరిలోనే కాదు చాలా మంది అమ్మాయిల్లో ఈ సమస్య ఉంది. అలాంటి వారిని రెండు క్యాటగిరీలుగా వర్గీకరిస్తే వారిలో ఒకరు జెనరిక్ సమస్య వల్ల, రెండవ వారు మెడికల్ కండీషన్ వల్ల ఏర్పడవచ్చు. జెనరిక్- షేవింగ్, ఎక్సెసివ్ స్వెట్టింగ్, యాంటీ పర్సిపెంట్స్ ఉపయోగించడం వల్ల డార్క్ ప్యాచెస్ ఏర్పడుతాయి. మెడికల్ రీజన్స్- అంటే ఇన్సులిన్, హార్మోనల్ డిజార్డర్స్ లేదా ఓబేసిటి.

అందుకు మొదట చేయాల్సింది. డార్క్ ప్యాచెస్ ఉన్నవారు, ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవాలి. ఒక వేల మెడికల్ రీజ్ అయితే తప్పనిసరిగా డాక్టర్ ను కలవాల్సి ఉంటుంది. జనరిక్ రీజన్ అయితే సింపుల్ హోం రెమెడీస్ ను ఉపయోగిస్తే సరిపోతుంది.

డార్క్ ప్యాచెస్ ను నివారించడంలో ఇవి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ హోం రెమెడీస్ డార్క్ ప్యాచెస్ ను కనబడనివ్వకుండా లైట్ గా మార్చడం మాత్రమే కాదు, డెడ్ స్కిన్ సెల్స్ ను కూడా తొలగిస్తాయి.!

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. మూసుకుపోయిన చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి, చెమటవాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.బేకింగ్ సోడాలో కొద్ది నీరు మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి.ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్ వద్ద అప్లై చేయాలి. 5 నిముసాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి .

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. స్కిన్ టోన్ వైట్ గా మార్చుతుంది. కొబ్బరి నూనె చంకల్లో అప్లై చేసి 10 -`15నిముషాలు తర్వాత సోపు ఉపయోగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మూడు నాలు వారాలు ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగాళదుంప అసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. బంగాళదుంప ఎక్సలెంట్ బ్లీజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బంగాళదుంపను తురిమి అందులోనుండి రసం తీసి, అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

కీరదోసకాయ కూడా నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బ్లాక్ ప్యాచెస్ ఉన్న ప్రదేశంలో కీరదోసకాయతో రబ్ చేయాలి. కీరదోస కాయ రసంలో కొద్దిగా పసుపు మరియు నిమ్మరసం మిక్స్ చేసి అలప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను రెగ్యులర్ గా ప్రతి రోజూ ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాక్టీరియా వల్ల వచ్చే ఎలాంటి వాసననైనా నివారిస్తుందిజ ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్లో బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి , చంకల్లో అప్లై చేయాలి. రెండు నిముషాలు మర్దన చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు:

పెరుగు:

పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది డార్క్ స్కిన్ ను వైట్ గా మార్చుతుంది. ప్లెయిన్ గా ఉండే పెరుగును ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని బాగా చిలికించి అందులో కాటన్ డిప్ చేసి తర్వాత ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను రెగ్యులర్ గా ఫాలో అయితే స్కిన్ టోన్ తెల్లగా మారుతుంది.

సన్ ఫ్లవర్ ఆయిల్ :

సన్ ఫ్లవర్ ఆయిల్ :

సన్ ఫ్లవర్ ఆయిల్ స్కిన్ టోన్ తెల్లగా మార్చడం మరియు స్కిన్ కు మాయిశ్చరైజ్ చేయడం పోషకాలు అందడానికి సహాయపడుతుంది. ఆర్గానిక్ సన్ ఫ్లవర్ ఆియల్ ను డైరెక్ట్ గా అప్లై చేసి 15నిముషల తర్వాత సోపుతో శుబ్రం చేసుకోవాలి.

ఎగ్ ఆయిల్ :

ఎగ్ ఆయిల్ :

ఎగ్ ఆయిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్లకంగా ఉన్నాయి. ఇవి కొత్తగా చర్మకణాలను ఏర్పడేందుకు సహాయపడుతుంది. ఎగ్ ఆయిల్ ను మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం స్నానం చేసి, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరంసలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది స్కిన్ టోన్ లైట్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. నిమ్మరసం మీద కొద్దిగా షుగర్ చల్లి రబ్ చేయాలి. కొన్ని నిముషాలు అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

యాపిల్స్ :

యాపిల్స్ :

ఆపిల్స్ లో బ్యాక్టీరియాను నాశనం చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆపిల్ ను మెత్తగా మ్యాష్ చేసి డార్క్ ప్యాచెస్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. బాగా మర్దన చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Desktop Bottom Promotion