For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నల్లగా అసహ్యంగా కనిపించే చారలు వదిలించే న్యాచురల్ టిప్స్

|

అందమైన ముఖంలో ఎలాంటి మచ్చలైనా, లేదా చారలైన, గాయాలతాలుకూ మచ్చలు లేదా స్కార్స్ అయినా, చూడటానికి చాలా వికారంగా ఉంటాయి. ఉన్న అందాన్ని పాడు చేసి, కాన్ఫిడెన్స్ లెవల్స్ ను తగ్గించేస్తాయి. ఈ స్కార్స్ నిజంగానే బాధిస్తుంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఇలాంటి మచ్చలు వారి అందాన్ని పాడుచేస్తాయి. కొన్ని సందర్భాల్లో , ఈ మచ్చలను, చారలను మేకప్ తో ఎంత కవర్ చేయాలన్నా అది సాధ్యం కాదు.

ముఖంలోనే కాదు, బహిర్గతంగా మన చర్మం మీద ఎక్కడ కనిపించినా కష్టమే. ముఖ్యంగా ముఖం, మెడ ప్రాంతంలో కనిపించే స్కార్స్ చాలా ఇబ్బంది కలిగిస్తాయి. వీటిని దాచడానికి కూడా కష్టం అవుతుంది. మరియు మెడ మీద ఏర్పడ్డ స్కార్స్ ను కన్సీల్ చేయడానికి కూడా కుదరదు . అయితే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ తో వాటిని కనబడనివ్వకుండా చేయవచ్చు.

10 Ways To Remove Neck Scars Overnight

స్కార్స్ అంటే మచ్చలు మరియు చిన్న చిన్న గాయలు లేదా తెగిన గాయల వల్ల ఏర్పడ్డ మచ్చలు . వీటిని స్కిన్ లైటనింగ్ లోషన్స్ లేదా బ్లీచింగ్ క్రీమ్స్ తో లైట్ గా కనబడనివ్వకుండా చేయవచ్చు . లేజర్ రీసర్ఫేసింగ్ వంటి క్లినికల్ ట్రీట్మెంట్స్, కెమికల్ పీల్స్ మరియు మైక్రోడర్మబ్రాషిన్ ద్వారా వికారమైన నెక్ స్కార్స్ ను తొలగించుకోవచ్చు.

మరియు మిరియడ్ మెడికల్ ట్రీట్మెంట్ వల్ల నెక్ స్కార్స్ ను తొలగించుకోవచ్చు . కానీ వీటన్నింటికంటే నేచురల్ ట్రీట్మెంట్ మరింత ఎఫెక్టివ్ గా ఎలాంంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నివారిస్తాయి. ఈ నేచురల్ పదార్థాలు మన ఇంట్లోనే మన వంటగదిలో అందుబాటులో ఉంటాయి. నెక్ స్కార్స్ తొలగించుకోవడానికి వివిధ రకాల హోం రెమెడీస్ ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

ముఖం, మెడ మీద మచ్చలను మాయం చేసే హోం రెమెడీస్..

1.అలోవెర:

1.అలోవెర:

కలబందలో కొన్ని యాంటీఆక్సిడెంట్స్ మరియు స్కిన్ లైటనింగ్ లక్షణాలుండటం వల్ల ఇది నెక్ స్కార్స్ ను నేచురల్ గా మాయం చేస్తాయి . అలోవెర లీఫ్ లోని ఫ్రెష్ జెల్ ను ముఖం మరియు నెక్ స్కార్స్ మీద అప్లై చేసి 30 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని రాత్రుల్లో కూడా అప్లై చేసి ఉదయం కడిగేసుకోవచ్చు. ఇది చర్మాన్ని సాఫ్ట్ గా మార్చుతుంది మరియు మచ్చలను మాయం చేస్తుంది.

MOST READ:మిడ్ నైట్ కఫ్ తో జాగరణా..?ఐతే కారణాలేంటో తెలుసుకోండి...MOST READ:మిడ్ నైట్ కఫ్ తో జాగరణా..?ఐతే కారణాలేంటో తెలుసుకోండి...

2.నిమ్మరసం:

2.నిమ్మరసం:

నిమ్మరం 3చెంచాలు తీసుకొని దీన్ని మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి మరియు క్రమబద్దించడానికి సహాయపడుతుంది. అలాగే నెక్ మరియు ఫేస్ లోని స్కార్స్ ను నేచురల్ గా తగ్గిస్తుంది.

3.కీరదోస:

3.కీరదోస:

కీరదోసకాయ చర్మం మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది . కీరదోసకాయ జ్యూస్ లో, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖం మరియు మెడ మీద ఉన్న స్కార్స్ మీద అప్లై చేసి, 10 నిముషాలు తర్వాత శుభ్రపరుచుకోవాలి.

4.బేకింగ్ సోడ:

4.బేకింగ్ సోడ:

బేకింగ్ సోడా మైల్డ్ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది . సోడా స్కిన్ రిపేర్ చేస్తుంది. నెక్ స్కార్స్ తొలగించడానికి ఇది ఒక ఎఫెక్టివ్ టిప్ . బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను మెడ మీద ఉన్న స్కార్స్ మీద అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

5.తేనె:

5.తేనె:

స్కార్స్ కు వ్యతిరేఖంగా తేనె పనిచేస్తుంది . 1చెంచా తేనె లో 1చెంచా దదాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి పేస్ట్ లా చేసి స్కార్స్ మీద అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

6.ఆరెంజ్ పీల్:

6.ఆరెంజ్ పీల్:

ఆరెంజ్ పీల్ సెల్ రిపేర్ చేస్తుంది మరియు నేచురల్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్. కొద్దిగా ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకొని అందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖం మరియు మెడ మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

7.టమోటో:

7.టమోటో:

నెక్ స్కార్స్ ను రాత్రికి రాత్రే మాయం చేయాలంటే టమోటో గ్రేట్ గా సహాయపడుతుంది. రాత్రి నిద్రించే ముందు కొద్దిగా టమోటో జ్యూస్ ను స్కార్స్ మీద అప్లై చేయాలి. ఉదయం నిద్రలేచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంత ప్పకుండా చేస్తుంటే స్కార్స్ కనబడకుండా తేలికపడుతాయి.

8.ఆపిల్ సైడర్ వెనిగర్:

8.ఆపిల్ సైడర్ వెనిగర్:

నెక్ స్కార్స్ తొలగించే చిట్కాల్లో ఇది ఒక ఎఫెక్టివ్ చిట్కా. కాటన్ బాల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్ లో డిప్ చేసి స్కార్ మీద అప్లై చేయాలి. ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీ.

MOST READ:బరువు తగ్గించే ఈ ఆహారాలను తక్కువగా అంచనా వేయకండి...MOST READ:బరువు తగ్గించే ఈ ఆహారాలను తక్కువగా అంచనా వేయకండి...

9.కోకనట్ వాటర్:

9.కోకనట్ వాటర్:

కోకనట్ వాటర్ నెక్ స్కార్స్ ను చాలా గ్రేట్ గా నివారిస్తుంది. కాటన్ బాల్స్ ను కోకనట్ వాటర్లో డిప్ చేసి తర్వాత నెక్ స్కార్స్ మీద మర్ధన చేయాలి. డ్రై అయ్యిన తర్వాత మరో కోటింగ్ వేయాలి. ఇలా రెండు మూడు కోట్లు వేసి, పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

10.సాండిల్ ఉడ్ పౌడర్:

10.సాండిల్ ఉడ్ పౌడర్:

సాండిల్ ఉడ్ పౌడర్ చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది రాత్రికి రాత్రే నెక్ స్కార్స్ ను తేలికపరుస్తుంది . ఇది డ్యామేజ్ అయిన స్కిన్ టిష్యును రిపేర్ చేస్తుంది.

English summary

10 Ways To Remove Neck Scars Overnight

Scars are undoubtedly the most embarrassing thing that reduces your confidence level. These scars are really bothersome, especially for women who always want to look flawless. Sometimes, even makeup fails to hide these stubborn scars.
Desktop Bottom Promotion