For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెర్బల్ బాడీ మసాజ్ ఆయిల్స్ తో అద్భుతమైన ప్రయోజనాలు !

|

సమస్త మానవాళిలో అనేక ఆరోగ్య సమస్యలకు సత్వర ఉపసమనాన్ని ఇచ్చేదిగా... సమర్ధవంతమైన చికిత్సా ప్రక్రియగా మసాజ్‌ థెరపీని కేవలం ఆయుర్వేదంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య విధానా లూ అంగీకరిస్తున్న వాస్తవం. బాడీ మసాజ్‌ అంటూ నేటి యువతరంతో సహా అంతా ఇప్పుడు పరుగులు తీస్తున్న ఈ మసాజ్‌ థెరఫీ ఆయుర్వేద వైద్యంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ థెరఫీలో వాడే అనేక తైలాలతో చేసే మర్ధన కారణంగా అనేక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుండటంతో ఆధునిక వైద్య విధానంలోనూ దీనిపై మక్కువ చూపుతున్న వారు చాలా మంది ఉన్నారు.

బాడీ మసాజ్ వల్ల మీరు తక్షణ ఉపశమనం పొందడంతో పాటు మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. కానీ, ఈ బాడీ మసాజ్ కు కొంచెం గోరువెచ్చని నూనెను చేర్చడంతో ఒక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బాడీ ఆయిల్ మసాజ్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఉదా: ఇది మనస్సును మరియు శరీరాన్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మరియు చర్మంలో రక్తప్రసరణను పెంచి, చర్మం టైట్ గా మారేలా చేస్తుంది. ఆయిల్ మసాజ్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కాబట్టి మీకు పొడి చర్మం ఉన్నప్పుడు మరియు మీ వదులైన చర్మాన్ని నివారించాలన్నా మీరు కనీసం వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి

ఇప్పుడు మీకు ఆయిల్ మసాజ్ వల్ల కొన్ని బ్యూటీ బెనిఫిట్స్ తెసుకోవచ్చు, బాడీ ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు మీరు తీసుకోవల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు బాడీ మసాజ్ కు ఏది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి మరియు తాజాగా చేస్తాయి అన్న విషయం తెలుసుకోవాలి. బాడీ మసాజ్ ఆయిల్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మార్కెట్ లో మనకు వివిధ రకాల తైలాలు దొరుకుతాయి. చాలా వరకు పరిమళ తైలాలు, ఎసెన్షియల్ అయిల్స్ లాగే ఉన్నా..అవి వైద్య పరమైన లాభాలను పూర్తిగా అందజేయవు. ఎసెన్సియల్ ఆయిల్స్ కొనేముందు ఒకటికి రెండు సార్లు పరీక్షించుకోవడం మంచిది. సువాసనల కోసం జీవనశైలిలో ఆరోమా థెరపీని వాడాలని అనుకొన్నప్పుడు, మనం వాసనలు చూసే సువాసనలైన, పరిమళ భరితమైన నూనెలు చికిత్సాపరమైన లాభాలు సమకూర్చుతాయి. అంతే కానీ సువాసనులు వచ్చే సాధార నూనెలు వాడటం నిరుపయోగమే.. అందుకే వీటి స్థానంలో హెర్బల్ ఆయిల్ రిసిపిలను బాడీ మసాజ్ కు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం...

ఆముదం నూనె:

ఆముదం నూనె:

ఆముదం నూనెలో నేచురల్ లింపాటిక్స్ ఉండటం వల్ల ఇది శరీరంలో అవాంచిన ఫ్యాట్ ను కరిగిస్తుంది. స్కిన్ రీజనరేట్ చేస్తుంది. చర్మం లైట్ గా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది: రెండు టేబుల్ స్పూన్ల ఆముదం నూనెను వేడి చేసి, అందలలో రెండు చుక్కల రోజ్మెర్రీ ఆయిల్ ను ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నూనెను బాడీ మొత్తం అప్లై చేసి మసాజ్ చేయాలి. 2 గంటల తర్వాత స్నానం చేయాలి.

జర్మేనియం ఆయిల్ :

జర్మేనియం ఆయిల్ :

ఈ నూనెతో బాడీ మసాజ్ చేయడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది, ఇది చర్మంను టైట్ గా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది: ఒక టేబుల్ స్పూన్ జర్మేనియం ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేసి, గోరువెచ్చగా చేసి బాడీ మొత్తం అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత స్నానం చేయాలి.

జోజోబా ఆయిల్ :

జోజోబా ఆయిల్ :

జోజోబా ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మానికి కావల్సిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మకణాలను నివారిస్తుంది. దాంతో చర్మం తేమగా , సపెల్ గా మారుతుంది.

ఎలా పనిచేస్తుంది: ఈ స్కిన్ టైటనింగ్ హెర్బల్ ఆయిల్లో బాడీలోషన్ మిక్స్ చేసి, బాగా షేక్ చేయాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయం శరీరానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. లేదా స్నానం చేసిన తర్వాత శరీరానికి అప్లై చేసుకోవచ్చు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె లో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, . ఇవి చర్మంలో కొత్త కణాల ఏర్పాటుకు గ్రేట్ గా పనిచేస్తుంది. సాగిన చర్మాన్ని నివారిస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి, బాడీ మొత్తం అప్లై చేసి మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే వదిలేసి, ఉదయం స్నానం చేయడం వల్ల స్కిన్ సాప్ట్ గా తేమగా కనబడుతుంది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో శ్యాచురేటెడ్ మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి స్కిన్ లేయర్స్ లోకి డీప్ గా చొచ్చుకుని పోయి, స్కిన్ సెల్ ను డ్యామేజ్ ను నివారిస్తుంది. కొత్త కణాలను ఏర్పరుస్తుంది.

ఎలా పనిచేస్తుంది: ఒక కప్పు ఆలివ్ ఆయిల్లో కొన్ని చుక్కల బాదం ఆయిల్, ల్యావెండర్ ఆయిల్, రోజ్ హిప్ ఆయిల్ మిక్స్ చేసి, రెండు నిముషాలు వేడి చేయాలి.తర్వాత చర్మానికి అప్లై చేసి రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

గ్రేప్ సీడ్ ఆయిల్ :

గ్రేప్ సీడ్ ఆయిల్ :

గ్రేప్ సీడ్ ఆయిల్ ఫ్రిమ్మింగ్ ఆయిల్. ఇందులో విటమిన్ ఇ , యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆస్ట్రిజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి టైట్ చేస్తుంది, స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

గ్రేప్ సీడ్ ఆయిల్లో కొద్దిగా కోకబట్టర్ ను మిక్స్ చేయాలి. ఈ రెండు బాగా కలిసేలా మిక్స్ చేయాలి. బాడీ మాయిశ్చరైజ్ చేస్తుంది.

ఆప్రికాట్ కెర్నల్ ఆయిల్ :

ఆప్రికాట్ కెర్నల్ ఆయిల్ :

ఈ నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్, చర్మాన్ని టైట్ చేస్తుంది. ఇది చర్మంలోకి చాలా సులభంగా అబ్సార్బ్ అవుతుంది, చర్మానికి కావల్సినంత గ్లోను అందిస్తుంది.

ఎలా పనిచేస్తుంది: స్నానం చేసిన వెంటనే , ఈ నూనెను బాడీకి అప్లై చేసి,మసాజ్ చేయాలి. శరీరం మొత్తం అప్లై చేసిన తర్వాత అమేజింగ్ స్మెల్ వస్తుంది.

ఆర్గాన్ ఆయిల్ :

ఆర్గాన్ ఆయిల్ :

ఆర్గాన్ ఆయిల్లో 80శాతం పైగా శ్యాచురేటెడ్ మరియు అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది స్కిన్ రీజనరేట్ చేస్తుంది. చర్మం కాంతివంతంగా టైట్ గా మారుతుంది.

ఎలా పనిచేస్తుంది:రెండు టేబుల్స్ స్పూన్ల అవొకాడో ఆయిల్లో, 5 చుక్కలు ఫ్రాంకిసెన్స్ ఆయిల్, 5 చుక్కల బాదం ఆయిల్, 5 చుక్కల జరేనియం ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ కాంబినేసన్ నూనెను బాడీ మొత్తానికి అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

అవొకాడో ఆయిల్ :

అవొకాడో ఆయిల్ :

అవొకాడో ఆయిల్లో విటమిన్ బి1, బి5 మరియు లెసిథిన్ లు పుష్కలంగా ఉన్నాయి, వీటన్నింటిలో చర్మానికి ఉపయోగపడే ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

ఎలా పనిచేస్తుంది: ఒక టేబుల్ స్పూన్ అవొకాడో ఆయిల్లో 10 చుక్కల మైర్రె ఎసెన్సియల్ ఆయిల్ మిక్స్ చేసి, బాడీకి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక గంట అలాగే ఉంచి, తర్వాత స్క్రబ్ చేసి 5 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితోస్నానం చేయాలి.

లెమన్ ఆయిల్ :

లెమన్ ఆయిల్ :

లెమన్ ఆయిల్లో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సిలు అధికంగా ఉన్నాయి, ఇది చర్మంలో డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది, ఫ్యాక్ ను కలిగిస్తుంది. చర్మంను టైట్ గా మార్చుతుంది. కాబట్టి దీన్ని చర్మానికి బాడీ మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేయాలి.

ఎలా పనిచేస్తుంది:

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఆల్ఫాల్ఫా నూనెలో కొద్దిగా లెమన్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే బాడీ మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత స్టీమ్ బాత్ చేసుకోవాలి.

కైప్రెస్ ఆయిల్ :

కైప్రెస్ ఆయిల్ :

క్రిప్రెస్ ఆయిల్లో స్కిన్ టిష్యులను బలోపేతం చేస్తుంది. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది మరియు చర్మక్రింది భాగంలో క్యాపిల్లర్స్ కనబడకుండా తగ్గిస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

10 చుక్కల కైప్రెస్ ఆయిల్లో చిటికెడు దాల్చిన చెక్క పొడి, 5 చుక్కల రోజ్ హిప్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ షీబట్టర్ మిక్స్ చేయాలి. స్మూన్ తో మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని బాడీకి అప్లై చేసి మసాజ్ చేయాలి.

అలోవెర:

అలోవెర:

సాగిన చర్మంను టైట్ గా మార్చడంలో బెస్ట్ రెమెడీ అలోవెర జెల్, ఇందులో మాలిక్ యాసిడ్, అలోసిన్, అలోవెరలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. చర్మంను ఆరోగ్యంగా టైట్ గా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది:

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్లో కొబ్బరి నూనె, బాదం నూనెను మిక్స్ చేసి బాడీ మొత్తం మసాజ్ చేయాలి. అరగంట తర్వాత స్నానం చేయాలి.

English summary

12 Herbal Body Massage Oil Recipes For Skin Tightening

Do you feel your skin is much too soft and lacks muscle tone? Does your skin jiggle when you walk? Then, what you need are skin-tightening herbal oils.
Desktop Bottom Promotion