Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
బహుమూలల్లో చెమట, వాసనను తగ్గించే హెర్బల్ రెమెడీస్..!
మీరు తరచూ బహుమూలల్లో చెమటలు, దుర్వాసన సమస్యను ఎదుర్కుంటున్నారా?చెమట వాసన మీ బాడీ నుండి స్ప్రెడ్ అవుతోందా?ఇటువంటి సమస్యను మీరు ఒక్కరు మాత్రమే కాదు, చాలా మంది ఈ సమస్యను ఎదుర్కుంటుంటారు. ఈ సమస్యతో నలుగురిలో కలవలేక ఇబ్బంది పడుతుంటారు. ఐతే ఈ సమస్య నుండి బయటపడటం ఎలా?
బహుమూలల్లో చెమటలు, చెమట వాసన నివారించడానికి హెర్బల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి 5 మందిలో ముగ్గరికి హైపరాక్టివ్ స్వేద గ్రంథులు ఉండటం వల్ల చెమట పట్టిన మరికలు, దుస్తుల మీద ఏర్పడటంతో పాటు, చెమట వాసనకు గురిచేస్తుంది. చెమట వాసన నివారించుకోవడానికి డియోడరెంట్ లేదా ఇతర ఫెర్ఫ్యూమ్స్ ఉపయోగించడం వల్ల వెంటనే చెమట వాసన నుండి రిలీఫ్ కలగవచ్చు, కానీ, ఇది శాస్వత పరిష్కారం కాదు.
కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అంతే కాదు, ఈ ప్రొడక్ట్స్ లో టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి, సింథటిక్ డిరవేటివ్స్ మరియు ఆర్టిఫిషియల్ ఫ్రాగ్నెన్స్ ను వల్ల చర్మానికి సురక్షితం కాదు. చెమట వాసన తగ్గించుకోవడానికి రోల్స్ ఉపయోగించిన తర్వాత కూడా వేసుకున్నదుస్తులు తీసి గమనిస్తే దుస్తుల మీద చెమట మరకలుంటాయి. కాబట్టి, చెమట వల్ల వచ్చే టాక్సిన్స్ ను బయటకు వెళ్లక దుస్తుల మీద అలాగే ఉండటం వల్ల బ్రేక్ అవుట్స్ ఎక్కువ అవుతాయి.
ఈ సమస్యను ను తగ్గించుకోవడానికి 12హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి, ఇవి బహుమూలల్లో చెమటను, దుర్వాసనను తగ్గిస్తాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ :
యాపిల్ సైడర్ వెనిగర్ చర్మంలో పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని ఉపయోగించడం ల్ల బ్యాక్టీరియా ఏర్పడదు. ఆపిల్ సైడర్ వెనిగర్ లో కాటన్ బాల్స్ వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం కాటన్ బాల్ తీసి ఆర్మ్ పిట్ లో మర్ధ చేసి ఉదయం శుభ్రం చేసుకోవాలి.

సేజ్ :
సేజ్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవిఆర్మ్ పిట్ ను డార్క్ గా చేస్తుంది. చెమటవాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. రాత్రికి రాత్రి చెమట సమస్య తగ్గిస్తుంది. సేజ్ లీవ్స్ ను నీటిలో వేసి బాగా ఉడికించాలి. అందులోనే టీట్రీ ఆయిల్ , నిమ్మరసం కొద్దిగా మిక్స్ చేయాలి. ఈ ద్రవాన్ని చల్లార్చి, తర్వాత స్ప్ర్రేబాటిల్లో నింపుకోవాలి. దీన్ని రెగ్యులర్ డియోడరెంట్ గా ఉపయోగించాలి.

సీసాల్ట్ :
సీసాల్ట్ లో ఉండే మినిరల్స్ బహు మూలల్లో చర్మంలో దాగున్న మలినాలను తొలగిస్తుంది. చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి, చెమట స్రవించకుండా నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ సీసాల్ట్ లో కొన్ని చుక్కల ఎసెన్సియల్ ఆయిల్ మిక్స్ చేసి, స్నానం చేసే నీటిలో వేయాలి. దీన్ని బహుమూల్లో ప్రతి రోజూ అప్లై చేయడం వల్ల మంచి మార్పుకనిపస్తుంది.

అలం:
అలం ఎఫెక్టివ్ గా యాంటీపర్సిపిరెంట్ గా పనిచేస్తుంది, ఇది బ్యాక్టీరియల్ గ్రోత్ ను తగ్గిస్తుంది, వాసన తగ్గిస్తుంది. ఆర్మ్ పిట్ లో అలంను మర్దన చేయాలి. 15నిముషాల తర్వాత తడి వస్త్రంతో తుడిచేసుకోవాలి.

టమోటో గుజ్జు:
టమోటోల్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి చర్మంలో మలినాలను తొలగిస్తుంది. చర్మ గ్రంథులను మూసుకునేలా చేసి, వాసన తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూట్ టమోటో గుజ్జు తీసుకుని, అప్లై చేసి మర్ధ చేయాలి. 5నిముషాల తర్వాత శుభ్రం చేసుకుని, పొడి వస్త్ర్రంతో తుడిచేసుకోవాలి.

బంగాళదుంప రసం :
బంగాళ దుంప జ్యూస్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.ఇవి చెమట వాసనను కంట్రోల్ చేస్తాయి. పొటాటోను రెండు స్లైస్ గా కట్ చేయాలి. ఒక పీస్ తీసుకుని, ఆర్మ్ పిట్ లో అప్లైచేసి మర్దన చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేయాలి.

విట్చ్ జెల్ :
విట్చ్ జెల్లో ఆస్ట్రిజెంట్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కొన్ని చుక్కల విట్చ్ జెల్ ఆయిల్లో కాటన్ బాల్ డిప్ చేసి, చంక బాగంలో అప్లూ చేసి మర్దన చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరో రూట్ పౌడర్:
ఆరో రూట్ చర్మంలోనికి బాగా అబ్ సార్బ్ అవుతుంది, చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది,మరియు ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చెమట వాసను తగ్గిస్తుంది. ఈ హేర్బల్ ద్రవాన్ని అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటే సమస్య తగ్గుతుంది.

కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ ఉంటుందిచ ఇది బ్యాక్టీరియాకు కారణమయ్యే వాసనను తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ కర్పూరం మిక్స్ చేసుకోవాలి. దీన్ని బహుమూలల్లో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల వాసన తగ్గుతుంది.

వీట్ గ్రాస్ :
వీట్ గ్రాస్ లో విటమిన్ బి6, బి12 మరియు ఫోలిక్ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి, ఇది యాసిడ్స్ ను న్యూట్రీలైజ్ చేస్తుంది చెమట తగ్గిస్తుంది, వాస తగ్గుతుంది. ఒక గ్లాస్ వీట్ గ్రాస్ జ్యూస్ ను రోజూ ఒక గ్లాసు తాగితే మంచిది. మరియు దీన్ని బహుమూలల్లో అప్పై చేయడం వల్ల కూడా తగ్గిపోతుంది.

బ్లాక్ టీ:
బ్లాక్ టీలో టానిన్స్ అధికంగా ఉటాయి, ఇవి శ్వేధ గ్రంథులను నుండి వచ్చే చెమటు మరియు వాసన తగ్గిస్తుంది.
రోజూ ఒక కప్పు బ్లాక్ టీని తాగడం మంచిది. అలాగే కొద్దిగా బ్లాక్ టీని బహు మూలల్లో అప్లై చేయడం ల్ల వల్ల కూడా వాసన తగ్గించుకోవచ్చు,

చమోమెలీ టి:
చమోమెలీ టీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. యాంటీ సెప్టిక్ లక్షణాలు చెమట వల్ల బ్యాక్టీరియా వాసనను తగ్గిస్తాయి.



Click it and Unblock the Notifications











