Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
డార్క్ నెక్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..
ఈ ఉరుకులు పరుగుల జీవితంగో చాలా మంది స్త్రీలు ముఖం మీద కనబరిచే శ్రద్ధ మెడమీద చూపించరు. మెడ నల్లగా ఉన్నా, అపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరు. ముఖం అందంగా ఉంటే చాలు అనుకుంటారు. కానీ మెడ అందంగా పరిశుభ్రంగా లేకపోతే దాని ప్రభావం ముఖంపై కూడా ఉంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు. అందుకే మెడపై కూడా శ్రద్ద పెట్టడం ముఖ్యమంటున్నారు.
ముఖ్యంగా వేసవిలో చాలా వరకూ వేడి, చెమట వల్ల చాలా మంది జుట్టును పైకి ముడివేసుకోవడం చూస్తుంటాము . ఇలా పైకి ముడిపెట్టుకొన్నప్పడు . మెడ అందంగా కనబడకుండా డార్క్ గా కనిపిస్తుంది. ముఖం మాత్రం కాంతివంతంగా ఉంటుంది. ముఖం మీద పెట్టే శ్రద్ద మెడమీద పెట్టకపోవడం వల్ల ఇంత తేడ కనబడుతుంటుంది .
కాబట్టి మెడకు మరియు ముఖానికి స్కిన్ టోన్ లో ఉన్న తేడా క్షణాల్లో రుజువులతో పాటు తెలిసిపోతుంది. మరి ఈ అసభ్యకరమైన పరిస్థితిని నుండి బయట పడాలంటే ఏం చేయాలి?
డార్క్ నెక్ క్లీన్ గా మరియు టోన్డ్ గా కనిపించాలంటే వివిధ రకాల నేచురల్ మార్గాలున్నాయి . కానీ చాలా ఎపెక్టివ్ నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్ నిమ్మ. నిమ్మలో బ్లీచింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి,
ఇంకా నిమ్మలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల స్కిన్ టోన్ మెరుగ్గా...తెల్లగా మార్చుతుంది . నిమ్మలో ఉండే విటమిన్ సి మరియు ఇతర న్యూట్రీషియన్స్ చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి సహాయపడుతుంది.
మెడ నలుపును ఎఫెక్టివ్ గా మరియు ఫాస్ట్ గా తగ్గించుకోవడానికి నిమ్మరసంను ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్ అలోవెర, తేనె, ఆలివ్ ఆయిల్ వంటి వాటితో జోడించి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది,.
డార్క్ నెక్ ను నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ..

1. నిమ్మరసం మరియు రోజ్ వాటర్:
ఫ్రెష్ గా ఉండే నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అందులో రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి కాటన్ బాల్ డిప్ చేసి మెడ చుటూ అప్లై చేసి మర్దన చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఇదిఅన్ని రకాల చర్మతత్వాతలకు నప్పుతుంది.

2. లెమన్ అండ్ హనీ:
ఇది వివిధ రకాల చర్మ తత్వాలున్న వారికి ఫర్ఫెక్ట్ కాంబినేషన్ . ఫ్రెష్ లెమన్ జ్యూస్ లో కొద్దిగా ఆర్గానిక్ తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడ చుట్టూ పట్టించాలి. అలరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈచిట్కాతో స్కిన్ టోన్ ఎఫెక్టివ్ గా మార్చుకోవచ్చు.

3. పసుపు మరియు నిమ్మరసం:
పసుపు, నిమ్మరసం సమపాళ్లల్లో తీసుకొని మెడకు పట్టించి పావు గంట పాటు ఆరనిచ్చి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేసినట్లయితే మెడ రంగులో తేడాను గమనించవచ్చు. ఈ చిట్కాను రెగ్యులర్ గా పాటిస్తుంటే ముందు ముందు తిరిగి డార్క్ గా మారకుండా ఉంటుంది.

4. నిమ్మరసం మరియు టమోటో:
టమోటో గుజ్జులో కొద్దిగా నిమ్మరసం పిండి మెడచుట్టూ అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చక్కటి మార్పు కనిపిస్తుంది . ఈ చిట్కాను కూడా రిపీట్ చేసి వేసుకోవచ్చు.

5. నిమ్మ, ఆలివ్ ఆయిల్ మరియు తేనె:
ఈ మూడింటి కాంబినేషన్ లో నెక్ ప్యాక్ వేసుకోవడం వల్ల మెడమీద డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి . అందుకోసం ఒక బౌల్లో ఒక చెంచా తేనె , 2చెంచాల ఆలివ్ ఆయిల్ , ఒక చెంచా నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి అరగంట మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications