For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎట్రాక్టివ్, హెల్తీ నెయిల్స్ పొందడానికి.. ఎఫెక్టివ్ హోం రెమిడీస్..!

మన జుట్టు, చర్మం విషయంలో తీసుకునే శ్రద్ధ గోళ్ల విషయంలో తీసుకోరు. గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. దుమ్ముతో కూడిన నెయిల్స్.. మీ ఆరోగ్యానికి కూడా హాని చేస్తాయి.

By Swathi
|

మన జుట్టు, చర్మం విషయంలో తీసుకునే శ్రద్ధ గోళ్ల విషయంలో తీసుకోరు. గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. దుమ్ముతో కూడిన నెయిల్స్.. మీ ఆరోగ్యానికి కూడా హాని చేస్తాయి.

healthy nails

అపరిశుభ్రమైన గోళ్లలో క్రిములు నిండి ఉంటాయి. ఇవి ఆహారం ద్వారా పొట్టలో వెళ్లడం ద్వారా.. అనారోగ్య సమస్యలు, వీక్ నెస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి.. నెయిల్స్ ఆరోగ్యంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

దీనికోసం నెయిల్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే.. అవి గోళ్లకు హాని చేస్తాయి. కాబట్టి.. సరైన షేప్, హెల్త్ కలిగి ఉండటం గోళ్లకు చాలా ముఖ్యం. అయితే గోళ్లు ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉండటానికి చాలా సింపుల్ హోం రెమిడీస్ ఉన్నాయి. వాటిని ఒక్కసారి ట్రై చేసి చూడండి..

కొబ్బరినూనె

కొబ్బరినూనె

గోరువెచ్చని కొబ్బరినూనెను గోళ్లపై మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గోళ్లకు బ్లడ్ సప్లై పెరిగి హెల్తీగా ఉంటాయి.

ఆల్మండ్ ఆయిల్

ఆల్మండ్ ఆయిల్

ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్, కొద్దిగా నిమ్మరసం కలిపి.. చేతులను 2నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ గోళ్లను స్ట్రాంగ్ గా చేసి.. విరిగిపోకుండా చేస్తాయి.

రాళ్ల ఉప్పు

రాళ్ల ఉప్పు

కొద్దిగా రాళ్ల ఉప్పును నీళ్లలో కలపాలి. గోళ్లను అందులో ముంచాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే. .మెరుగైన ఫలితాలు పొందవచ్చు. గోళ్లు న్యాచురల్ గా ఆరోగ్యంగా పెరుగుతాయి.

 గుడ్డు టెంక

గుడ్డు టెంక

ఆరోగ్యవంతమైన గోళ్లకు ఎగ్ షెల్స్ పర్ఫెక్ట్ రెమెడీ. ఎక్కువ మొత్తంలో ఉండే క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్, మినరల్స్, మెగ్నీషియం, పొటాషియం.. గోళ్లు డ్యామేజ్ అవకుండా కాపాడుతాయి. ఎగ్ షెల్స్ ని, ఆల్మండ్స్, ఫ్లాక్ సీడ్స్ ని కలిపి బ్లెండ్ చేసి పొడి చేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఈ పౌడర్ తీసుకుని గోరువెచ్చని పాలలో కలిపి ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే మంచిది.

వెల్లుల్లి

వెల్లుల్లి

గోళ్లు హెల్తీగా పెరగడానికి వెల్లుల్లి పర్ఫెక్ట్ రెమిడీ. ఒక వెల్లుల్లి రెబ్బను కట్ చేసి.. గోళ్లపై రుద్దాలి. లేదా వెల్లుల్లిని పేస్ట్ చేసి అప్లై చేయవచ్చు. ఇలా అప్లై చేశాక 5 నిమిషాలకు కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. గోళ్లు హెల్తీగా ఉంటాయి.

టమోటా జ్యూస్

టమోటా జ్యూస్

టమోటా జ్యూస్ గోళ్లను హెల్తీగా మారుస్తుంది. కొన్ని చుక్కల రోజ్ మేరీ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల టమోటా రసం కలిపి గోళ్లకు పట్టించాలి. ఇలా చేస్తే.. గోళ్లు విరిగిపోకుండా హెల్తీగా ఉంటాయి. లేదా ఈ మిశ్రమంలో గోళ్లను 10నిమిషాలు నానబెట్టుకోవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను 3కప్పులు గోరువెచ్చని నీటిలో కలపాలి. ఇందులో కాటన్ నానబెట్టి.. గోళ్లకు అప్లై చేయాలి. ఇది.. గోళ్లకు మాయిశ్చరైజర్ అందించి బలంగా మారుస్తాయి.

English summary

7 Homemade Remedies For Healthy Glossy Nails!

7 Homemade Remedies For Healthy Glossy Nails! Having healthy nails is an important step in beauty care, which most of us may neglect.
Story first published: Friday, October 28, 2016, 17:21 [IST]
Desktop Bottom Promotion