For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్లో కూడా అందం ఏ మాత్రం చెదరకుండా...బ్యూటీ టిప్స్

|

ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాకిడి నుండి తప్పించుకోవడం ఎలా, శరీరాన్ని కాపాడుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్న. ఎండలో తిరక్కుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా, సెగలు కక్కుతున్న సూర్యుని తాపం మనమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పడుతూనే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల రీత్యా కొందరికి బయట తిరగక తప్పదు. వీరి సంగతి చెప్పనవసరం లేదు. మరీ దుర్భరంగా ఉంటుంది.

ఒక్కో సీజన్లో ఒక్కో సమస్య ఉండనే ఉంటుంది. చలికాలంలో చర్మం పొడివారుతుంది. వాజిలిన్లు, కోల్డ్ క్రీములూ, మాయిశ్చరైజర్లు రాస్తున్నా చర్మం పగులుతూనే ఉంటుంది. ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు వేసవిలో నీటి శాతం తగ్గిపోయి, శరీరంలో కాంతి నశిస్తుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. నీటి శాతం తగ్గడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. ముఖంలో రింకిల్స్ అందవిహీనంగా ఉంటాయి. ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు కనిపిస్తుంది.

ఈ ఎండల నుండి బయట పడే మార్గం లేదా, మనల్ని మనం రక్షించుకునే అవకాశం లేదా అంటే, తప్పకుండా ఉంది. ఈ వేసవి కాలంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. సమ్మర్ బ్యూటీ కేర్ టిప్స్ తో ముఖ సౌందర్యం ఏమాత్రం పాడవకుండా చూసుకుందాం.

నీరు ఎక్కువగా త్రాగాలి:

నీరు ఎక్కువగా త్రాగాలి:

శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంటే అవసరం. నీళ్ళు ఎక్కువ పరిమాణంలో తాగేవారికి సర్వసాధారణంగా ఏ జబ్బులూ రావు. ఇది అతిశయోక్తి కాదు. వాటర్ థెరపీని మించినది మరొకటి లేదు. రోజుకు 16 గ్లాసుల నీళ్ళు తాగమని డాక్టర్లు పదేపదే చెప్తున్నారు. పుష్కలంగా నీరు తాగితే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. ఇక వేసవిలో అయితే, శరీరంలో ఉన్న నీరు ఇంకిపోతుంది కనుక, మరింత పరిమాణంలో నీరు సేవించాలి. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడంవల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. డీ-హైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తవు.

కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి:

కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి:

చాలామంది వేసవి తాపాన్ని భరించలేక ఐస్ క్రీములు, కూల్ డ్రింకులతో సేదతీరుతుంటారు. శీతల పానీయాలు, ఐస్ క్రీములు దాహార్తిని తీర్చేమాట నిజం. కొంతసేపు సేద తీరినట్లూ ఉంటుంది. కానీ అది చాలా తాత్కాలికం. పైగా ఈ కూల్ డ్రింకులు ఒబేసిటీ లాంటి అనేక అదనపు సమస్యలకు కారణమౌతాయి. కనుక కూల్ డ్రింకులు, ఐస్ క్రీములకు దూరంగా ఉండాలి.

 కోకనట్ వాటర్:

కోకనట్ వాటర్:

కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్లు ఉంటాయి. వేసవిలో వీలైనంత ఎక్కువగా కొబ్బరినీళ్ళు తాగుతూ ఉండాలి. బొబ్బరి నీళ్ళు తాగడంవల్ల ముఖంలో చక్కటి ప్రకాశం వస్తుంది.

 ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి:

ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి:

ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో సేవిస్తూ ఉండాలి. ముఖ్యంగా వేసవిలో తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిలవ ఉంచిన ఫ్రూట్స్ కాకుండా ఎప్పటికప్పుడు తాజా పండ్లను తీసుకోవాలి. పండ్లను రసం తీసుకుని తాగడం కంటే ముక్కలు కోసుకుని తినడం మంచిది. పండ్ల నుండి జ్యూస్ తీయడం వల్ల అందులో ఉండే ఫైబర్ చాలావరకూ ఫిల్టరయి పోతుంది. ఫైబర్ జీర్ణ ప్రక్రియలో ఎంతగానో ఉపయోపడుతుంది. తాజా పండ్లను సేవించడం వల్ల ముఖంలో కాంతి వస్తుంది.

 కీరదోసకాయ ప్రియ నేస్తం:

కీరదోసకాయ ప్రియ నేస్తం:

కీరా దోసకాయలు వేసవిలో విరివిగా దొరుకుతాయి. చెక్కు తీసిన కీరా దోసకాయలు తినడం వల్ల వేసవి తాపం తగ్గుతుంది. ముఖానికి వన్నె వస్తుంది. కీరా దోసకాయలను సన్నగా చెక్కల్లా తరిగి, ముఖంమీద ఉంచి పడుకోవాలి. ఆ ముక్కల నీటిని ముఖం పీల్చుకున్న తర్వాత వాటిని తీసి పడేసి, చల్లటి నీతితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి మరింత శోభ వస్తుంది.

టమోటో-బొప్పాయి:

టమోటో-బొప్పాయి:

టొమేటో గుజ్జు, బొప్పాయి గుజ్జు మొదలైన వాటితో ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఒక అరగంట పాటు అలా ఉంచుకుని, ఎండిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ లు ముఖంలో ముడతలు రాకుండా చేస్తాయి. తాజాదనాన్ని, అందాన్ని ఇస్తాయి.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరలు ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది. వేసవిలో ఆకుకూరలు మరీ మంచిది. వీలైనంత ఎక్కువగా ఆకుకూరలు తినడం వల్ల ముఖంలో ముడతలు రావు. ముఖం తేటగా అనిపిస్తుంది.

అదీ సంగతి. వేసవివల్ల వచ్చే సమస్యలను ఇలాంటి ఆరోగ్య జాగ్రత్తలను పాటించడం ద్వారా తరిమికొట్టవచ్చు.

English summary

7 Indian Skin Care Tips for Summer..!

Along with the heat waves and sweat, your skin gets spoiled too! Dry, itchy, dull skin are some of the main problems we all face in this season. To look after our skin and to protect it from the harsh rays of the sun, here are some of the best skin care tips for the Indian summer.
Story first published: Monday, April 4, 2016, 18:04 [IST]
Desktop Bottom Promotion