Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాదాలపై నల్లగా పేరుకున్న ట్యాన్ తొలగించే హోం రెమిడీస్
భగ భగ మండే సూర్యుడి కారణంగా టెంపరేచర్ రోజురోజుకీ పెరిగిపోతోంది. దీనివల్ల నుదురు నుంచి పాదాల వరకు అన్నీ సమస్యలే. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, చర్మం కమిలిపోవడం, డీహైడ్రేషన్ వంటి రకరకాల సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి.
ముఖం, చేతుల, శరీరంపై చాలామంది శ్రద్ధ తీసుకుంటారు. కానీ పాదాలను నిర్లక్ష్యం చేయడం వల్ల పాదాలపై ట్యాన్ పెరిగిపోతుంది. ఇవి నల్లగా మారిపోయి.. అంద విహీనంగా కనిపిస్తాయి. కాబట్టి పాదాల ట్యాన్ తొలగించడానికి సింపుల్ హోం రెమిడీస్ ఫాలో అవడం వల్ల.. మీ పాదాలను అందంగా మార్చేసుకోవచ్చు.
అయితే ముందుగా పాదాలను ఫూట్ బ్రష్ తో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల డ్రై స్కిన్, డెడ్ సెల్స్ తొలగిపోతాయి. తర్వాత గోరువెచ్చని నీటిలో 15 నిమిషాలు నానబెట్టాలి. అదే సమయంలో.. మీ పాదాలను షాంపూ, నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత పాదాలను టవల్ తో తుడిచిన తర్వాత హోం రెమిడీస్ ట్రై చేస్తే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. పాదాల ట్యాన్ తొలగించే సింపుల్ హోం రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

టమోటా
సన్ ట్యాన్ తొలగించడానికి టమోటాలు చక్కటి పరిష్కారం. పాదాలను నీటిలో నానబెట్టి శుభ్రం చేసుకున్న తర్వాత టమోటాని రెండు ముక్కలుగా కట్ చేసి విత్తనాలు తీసేసి.. పాదాలపై టమోటా రసం రాసుకోవాలి. ఆరిన తర్వాత మళ్లీ అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత రోజ్ వాటర్ తో పాదాలు శుభ్రం చేసుకోవాలి. రెండ్రోజులకు ఒకసారి ఇలా చేస్తే పాదాల ట్యాన్ కి చెక్ పెట్టవచ్చు.

బంగాళదుంప
న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ కలిగిన బంగాళదుంపల తొక్క తీసేసి.. మిక్సీకి వేసి రసం తీయాలి. ఈ రసంలో పాదాలను 15 నిమిషాలపాటు నాననివ్వాలి. తర్వాత పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని ఆరనివ్వాలి. ఇలా మూడ్రోజులకు ఒకసారి చేయాలి.

పసుపు
చర్మాన్ని తెల్లగా మార్చడంలో పసుపు మిరాకిల్ చేస్తుంది. పసుపులో నీళ్లు కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుని 20 నిమిషాల తర్వాత కొన్ని పాలల్లో నానబెట్టాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

నిమ్మరసం
నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల .. సన్ ట్యాన్ తేలికగా తొలగిస్తుంది. నిమ్మరసంను పాదాలపై 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లు, ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పాదాలు గ్లోయింగ్ గా మారతాయి.

తేనె
పాదాలకు తేనె రాసుకుని 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. 15 నిమిషాల్లో మీ చర్మాన్ని స్మూత్ గా మార్చేస్తాయి.

పెరుగు
పెరుగుని పాదాలకు అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల పాదాలపై ట్యాన్ తొలగిపోతుంది.

బొప్పాయి
బొప్పాయి గుజ్జుని పాదాలకు రాయడం వల్ల సన్ ట్యాన్ తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేస్తుంది.



Click it and Unblock the Notifications