For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చెమట మరియు శరీర దుర్వాసన కంట్రోల్ చేసే చిట్కాలు..

|

సాధారణంగా వేసవి తాజాగా చల్లగా ఉందని ఊహించుకొంటాము, అయినప్పటికీవేసవిలో వాతావరణం చాలా వేడిగా మరియు వాతావరణం కూడా తేమగా ఉంటుంది. ఈవాతవరణంలో కాటన్ డ్రెస్సులో మరియు షార్ట్స్ వంటివి ధరించడం వల్ల ఎటువంటిసమస్య ఉండదు. అలాగే ఐస్ డ్రింక్ కూడా మనకు తాజా దనాన్ని అందిస్తాయి. ఇలాకాకుండా డ్రెస్ కోడ్ లో కాస్త మార్పు వచ్చు మంచి సూట్ మరియు టై వంటివిసమ్మర్ లో స్టైలిష్ గా ధరించాలనుకుంటే, ఇక చెమటలు కారిపోవడమే.

వేసవిలో చెమట నివారించడానికి ఫేస్ మాస్కులు

సాధారణంగా ఇతర సీజన్లలో కంటే వేసవి సీజన్ లో చెమటలు పట్టడం ఎక్కువ. చెమటతోపాటు, శరీరం నుండి దుర్వాసన, చెమట వాసన భరించలేకుండా చేస్తుంది. చెమట వల్లశరీరం మీద పడ్డ దుమ్మ, ధూళీ చేరి బ్యాక్టీరియా ఏర్పడి చాలా చెడు వాసనకుగురిచేస్తుంది. అందుకని మనం నిరంతరం స్నానం చేస్తుండటం, మరియు డియోడరెంట్స్రాసుకోవడం ఒక్కటే సరిపోదు. ఇవి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా తర్వాత తిరిగి వస్తుంది.

వేసవి సీజన్ లో ఖచ్చితంగా తినాల్సిన బెస్ట్ ఇండియన్ ఫుడ్స్

బాడీ ఆడోర్ (శరీరం నుండి చెమట వాసనను)నిర్మూలించడానికి వివిధ రకాలు నేచురల్హోం రెమడీస్ ఉన్నాయి. ఇవి రోజంతా తాజాగా ఉండేందుకు బాగా సహాయపడుతాయి .మరియు ఈ నేచురల్ రెమెడీస్ ను తయారుచేయడం కూడా చాలా సులభం. ఎండ శరీరం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. చెమట బాగా పడుతుంది. అందులోనూ వేసవిలో ఈ సమస్య బాగా ఉంటుంది. చెమట వల్ల శరీరం బాగా దుర్వాసన వస్తుంది. అందుకే వేసవిలో శరీరం ఫ్రెష్‌గా ఉండాలంటే కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవి....

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి పట్టుకుని ఉన్న సూక్ష్మజీవులు పోతాయి.

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

వేసవిలో చమట ఎక్కువగా పడుతుంది కాబట్టి చంకల కింది భాగాన్ని యాంటి బాక్టీరియల్‌ సోప్‌, వేడినీళ్లతో రోజుకు రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

నేచురల్‌ ఫైబర్స్‌తో రూపొందించిన సిల్కు, కాటన్‌ వసా్త్రలను ధరించాలి. ఇవి తేమను బాగా పీలుస్తాయి. చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి.

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

తినే ఆహారం వల్ల కూడా శరీరం దుర్వాసన వచ్చే అవకాశం ఉంది కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో నియమాలు పాటించాలి. కెఫైన్‌, మసాలా వంటలు, ఆల్కహాల్‌, శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌, సుగర్‌, సిగరెట్స్‌, కూల్‌డ్రింక్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటివల్ల చంకల కింద భాగంలో దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

స్కిన్‌ పిహెచ్‌ వాల్యూ తక్కువగా ఉంటే దుర్వాసనకు కారణమైన బాక్టీరియా చర్మంపై ఉండదు. యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, టీ ట్రీ ఆయిల్‌ రెండూ చర్మం యొక్క పిహెచ్‌ వాల్యూని బాగా తగ్గిస్తాయి. కొద్దిగా యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ తీసుకుని అందులో కాటన్‌ బాల్‌గాని లేదా మెత్తటి గుడ్డగాని ముంచి దానితో చంకల కింద భాగం తుడిచేసుకుంటే అక్కడ ఎంతో శుభ్రంగా ఉంటుంది. దుర్వాసన రాదు. ఎలాంటి డియోడరెంట్లను వాడాల్సిన పని కూడా లేదు.

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

నిమ్మకాయ కూడా బాక్టీరియాను చంపేస్తుంది. అందుకే నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు చెక్కలుగా కోసం ఒక చెక్కతో చంకల కింది భాగంలో రుద్దాలి. ఇలా చేయడం వల్ల నిమ్మరసం చర్మానికి అతుక్కుంటుంది. పొడారిపోయే వరకూ దాన్ని అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీళ్లతో ఆ ప్రాంతంలో కడిగేసుకోవాలి. దుర్వాసన పోయే వరకూ రోజుకు ఒకసారి ఇలా చేస్తుండాలి.

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

శరీర దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

తులసి, వేపలలో యాంటిబాక్టీరియల్‌ గుణాలు బాగా ఉంటాయి. కొన్ని తులసి, వేప ఆకులు తీసుకుని వాటిని పేస్టులా చేయాలి. ఆ పేస్టును స్నానానికి వెళ్లే ముందర చంకల కింద భాగంలో రాసుకుని కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితాన్ని చూస్తారు.

English summary

7 Natural Remedies to Control Sweat and Body Odor During Summer

Body odour is a common skin problem during summer. Even after wearing light cotton clothes or applying strong 24 hours deodorants, you can't prevent perspiration. There are many home remedies to get rid of body odour. Few people sweat more so, try these tips to prevent body odour naturally.
Story first published: Tuesday, March 29, 2016, 16:47 [IST]
Desktop Bottom Promotion