For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలేంటి ?

By Swathi
|

కాలేజీకి వెళ్లే యువకుల నుంచి ఉద్యోగాలు చేసే అతివలు, అబ్బాయిల వరకు అందిరినీ ఇబ్బంది పెట్టే సమస్య కళ్లకింద నల్లటి వలయాలు. అయితే ఇవి వచ్చాక వీటిని తగ్గించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే క్రీములు, లోషన్స్ నుంచి.. వంటింటి చిట్కాల వరకు అన్నింటినీ పాటిస్తుంటారు. ఎప్పుడైనా కారణాల కోసం వెతికారా ?

కళ్లజోడు వల్ల కళ్లకింద ఏర్పడిన డార్క్ సర్కిల్స్ తొలగించే టిప్స్

అవును కళ్లకింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయో కారణాలు తెలుసుకుంటే.. అవి రాకుండా జాగ్రత్త పడటం తేలికైన పని కదా. చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలకు నిద్ర సరిగా లేకపోవడం అని చాలా మంది భావిస్తుంటారు. కానీ.. ఇది పూర్తీగా నిజం కాదు. కళ్ల కింద నల్లటి వలయాలకు అసలు కారణాలు తెలిస్తే మీరు షాక్ అవుతారు. అలాగే.. ఈ కారణాలు తెలుసుకోవడం వల్ల నల్లటి వలయాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం..

హెరిడిటీ

హెరిడిటీ

కళ్ల కింద నల్లటి వలయాలు మీ పేరెంట్స్ వల్ల కూడా వస్తాయి. ఇవి హెరిటిడీ కారణంగా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నాయేమో చెక్ చేయండి.

ఎగ్జిమా

ఎగ్జిమా

ఎగ్జిమా కూడా కళ్ల కింద నల్లటి వలయాలకు కారణం కావచ్చు. ఎగ్జిమా మాత్రమే డార్క్ సర్కిల్స్ కి కారణం కాకపోయినా.. దురద, రుద్దడం కారణంగా.. డార్క్ సర్కిల్స్ ఏర్పడే అవకాశం ఉంది.

అలర్జీ

అలర్జీ

అలర్జీలు దురదకు కారణమవుతాయి. కళ్ల కింద చర్మం చాలా సున్నితంగా, పలుచగా ఉంటుంది. దురద వల్ల బ్లడ్ వెజెల్స్ లో వాపు వస్తుంది. అది కళ్ల కింద చర్మం పలుచగా ఉండటం వల్ల ముఖం అంతటిలోకి అక్కడి స్కిన్ మరింత డార్క్ గా మారుతుంది. కాబట్టి.. అలర్జీలను ఫస్ట్ నివారిస్తే సరిపోతుంది.

మేకప్

మేకప్

డార్క్ సర్కిల్స్ కి మేకప్ కూడా కారణం కావచ్చు. మస్కారా, ఐ షాడో, కన్సీలర్ వంటివి ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మీ చర్మ తత్వానికి సరిపడకపోతే.. డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి కారణమవుతాయి.

బోన్ స్ట్రక్చర్

బోన్ స్ట్రక్చర్

మీ ఎముకల రూపు కూడా కొన్ని సందర్భాల్లో కళ్ల కింద నల్లటి వలయాలకు కారణమవుతుంది. కొన్నిసార్లు కళ్లు లోపలికి వెళ్లిపోయినట్టు అనిపిస్తాయి. దీనివల్ల కళ్ల నీడ పడటం వల్ల కళ్లకింద నల్లటి వలయాలకు అవకాశం ఉంటుంది.

నరాలు

నరాలు

నరాలు కూడా కళ్ల కింద నల్లటి వలయాలకు కారణమవుతాయి. ఒక వేళ మీ కళ్లు నీలిరంగులో కనిపిస్తున్నాయంటే.. బ్లడ్ వెజెల్సే దీనికి కారణం. నీలి రంగులో కనిపించే నరాలు కళ్ల కింద చర్మాన్ని డార్క్ గా కనిపించేలా చేస్తాయి.

సూర్యరశ్మి

సూర్యరశ్మి

మీరు సూర్యకిరణాల నుంచి ప్రొటెక్షన్ తీసుకోకపోయినా.. ఈ నల్లటి వలయాలు ఏర్పడటానికి ఛాన్స్ ఉంది. సూర్య రశ్మి మీ కళ్ల కింద చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయని గుర్తుంచుకోండి. కాబట్టి.. సన్ గ్లాసెస్ లేదా సన్ స్క్రీన్ లోషన్ లేకుండా బయటకు వెళ్లకండి.

English summary

7 Reasons You Didn't Know were Causing Under-Eye Circles

7 Reasons You Didn't Know were Causing Under-Eye Circles. You get enough beauty sleep but you still end up with these annoying dark circles.
Story first published:Wednesday, May 4, 2016, 17:32 [IST]
Desktop Bottom Promotion