Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గడ్డం పెంచుకోవడం వల్ల అబ్బాయిలకు కలిగే.. సర్ ప్రైజింగ్ బెన్ఫిట్స్..!!
గడ్డం పెంచుకోవడం ప్రస్తుతం అబ్బాయిల్లో నడుస్తున్న ట్రెండ్. బారుగా పెంచేసి.. స్టైల్ గా కనిపించాలని చాలామంది అబ్బాయిలు ఆరాటపడతాయి. అయితే ఇంట్లో వాళ్లు మాత్రం అదేంటి అసహ్యంగా అని తిడుతూ ఉంటారు. మరికొందరు తమకు ఇష్టమైన హీరోల స్టైల్స్ ని అనుకరిస్తూ.. ఈ ట్రెండ్ ఫాలో అవుతారు.
కొంతమంది ఆఫీస్ రూల్స్ ప్రకారం స్మార్ట్ గా షేవ్ చేసుకుంటారు. మరికొందరు.. గడ్డం పెంచేసి తమ లుక్ నే విభిన్నంగా మార్చేసుకుంటారు. అయితే ఇలా రేజర్ కి దూరంగా ఉండటం కూడా... హెల్తీయే, అందానికి మంచిదే అంటున్నారు నిపుణులు. ఇలా గడ్డం పెంచడం వల్ల లుక్ లోనే కాదు.. చర్మానికి, ఆరోగ్యానికి కూడా చాలామంచిదట.
నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇక్కడ నిరూపించబడిన కొన్ని సర్ ప్రైజింగ్ బెన్ఫిట్స్ ఉన్నాయి. అవి చూశారంటే.. మీరు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవడానికి ఆసక్తి చూపిస్తారు. గడ్డం పెంచుకోవడం వల్ల పొందే అమేజింగ్ బ్యూటీ అండ్ హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పడు చూద్దాం..

యంగ్ లుక్
గడ్డం పెంచుకోవడం వల్ల మాయిశ్చరైజర్ కలిగి ఉండటం, సన్ నుంచి ప్రొటెక్షన్ కలిగి ఉండటం వల్ల.. అది మిమ్మల్ని యంగ్ గా కనిపించేలా చేస్తుంది. గడ్డం మిమ్మల్ని మరింత స్మార్ట్ గా, అందంగా కనిపించేలా చేస్తుంది.

సూర్య కిరణాల నుంచి రక్షణ
ఎక్కువ సమయం సూర్య కిరణాలు మీ చర్మంపై పడకుండా.. గడ్డం ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే దీర్ఘకాలం సూర్య కిరణాలు పడితే.. చర్మంపై ముడతలు, చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి.. గడ్డం పెంచుకోవడం వల్ల స్కిన్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుందని, యూవీ కిరణాల నుంచి 95 శాతం రక్షణ కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మొటిమలు
చాలా తరచుగా షేవింగ్ చేసుకునే అబ్బాయిలు వాళ్ల చర్మాన్ని రిమూవ్ చేసే క్రమంలో బ్యాక్టీరియా ఏర్పడి.. ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. దీనివల్ల మొటిమలు మరింత పెరుగుతాయి. అదే గడ్డం పెంచుకుంటే.. అవి.. ఇలాంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

చర్మాన్ని మాయిశ్చరైజ్డ్ గా
చర్మం న్యాచురల్ ఆయిల్స్ ని కలిగి ఉండటం వల్ల మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. మీరు షేవింగ్ చేసుకున్నప్పుడు మాయిశ్చరైజర్ ని కోల్పోతుంది. ఒకవేళ గడ్డం ఉంటే.. న్యాచురల్ మాయిశ్చరైజ్ అలాగే ఉంటుంది. అలాగే షేవ్ చేసుకోవడం వల్ల చర్మం ఎండకు ఎక్స్ పోజ్ అయి.. చర్మం డ్రైగా మారడానికి కారణమవుతుంది. కాబట్టి చర్మాన్ని మాయిశ్చరైజ్డ్ గా ఉంచడానికి గడ్డం సహాయపడుతుంది.

ఫీల్ గుడ్
న్యూయార్క్ లో జరిగిన అధ్యయనాల ప్రకారం గడ్డం పెంచుకోవడం వల్ల వాళ్లు చాలా స్మార్ట్ గా ఉన్నట్లు కాంప్లిమెంట్స్ పొందుతున్నారట. అలాగే కాన్ఫిడెంట్ గా ఉండేలా చేస్తుందట. గడ్డం వల్ల మరింత ఎట్రాక్టివ్ గా కనిపిస్తారని అమ్మాయిలు కూడా ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఇస్తారట.

సెక్స్ లైఫ్
గడ్డం పెరుగుదల, సెక్యులవ్ యాక్టివిటీతో సంబంధం కలిగి ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీలో సెక్సువల్ యాక్టివిటీ పెరిగింది అంటే.. మీ టెస్టోస్టెరాన్ పై ప్రభావం చూపి.. గడ్డం పెరగడానికి సహాయపడుతుంది. అంటే.. ఎక్కువగా సెక్స్ లో పాల్గొంటే.. ఎక్కువగా గడ్డం పెరుగుతుంది.

ఆస్తమా
దుమ్ము, ధూళి వల్ల ఆస్తమా సమస్యతో బాధపడుతుంటే.. గడ్డం పెంచడం వల్ల దీన్ని తగ్గించవచ్చు. ముక్కు చుట్టూ పెరిగే.. మీసం ముక్కు రంధ్రాల్లో దుమ్ము వెళ్లకుండా అడ్డుకుని.. ఆస్తమాని నివారిస్తుంది. అలాగే టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది.

గొంతు వ్యాధులు నివారిస్తుంది
గడ్డం పెంచుకోవడం వల్ల బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. గొంతులోకి బ్యాక్టీరియా, దుమ్ము ప్రవేశించకుండా అరికడుతుంది. అలా.. గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.



Click it and Unblock the Notifications