Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వీకెండ్ స్పెషల్: పాదాల పగుళ్లకు గుడ్ బై చెప్పండిలా..!
సహజంగా అందం విషయంలో ముఖం గురించి తీసుకొన్న శ్రద్ద చేతులు కాళ్ల మీద చూపించరు. అందుకే కాళ్ల మీద పగుళ్లు, టానింగ్, వంటి సమస్యలను ఎదురవుతుంటాయి. కాళ్ల పగుళ్లను వెంటనే నివారించుకోకపోతే అది పెయిన్ కి కారణమవుతుంది. కాబట్టి పాదాల్లో పగుళ్లు మొదలైనప్పుడే ట్రీట్మెంట్ అందివ్వాలి.
అప్పుడప్పుడు పాదాలకు మసాజ్ చేయడం వల్ల పాదాల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తం గడ్డకట్టకుండా, పాదాల్లో వాపు లేకుండా.. పాదాల నొప్పి తగ్గిస్తాయి. పాదాల మీద పగుళ్లను నివారిస్తాయి. పాదాల పగుళ్లను నివారించుకోవడం కోసం కొన్ని హోం రెమెడీస్ ను ఉన్నాయి. వెంటనే వీటిని ప్రయత్నించండి.

1. వాజిలిన్:
ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు పాదాలకు వాజిలిన్ అప్లై చేయాలి. ఈ పెట్రోలియం జెల్లి పాదాల మీద ఉండే చర్మాన్ని సాప్ట్ గా మార్చుతుంది, కాంతివంతం చేస్తుంది.

2. ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ చర్మానికి మంచి ఫలితాన్నిస్తుంది. స్నానం చేసిన వెంటనే కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి పాదాలకు రాసి, మసాజ్ చేయాలి. పాదాల మీద అలాగే సాక్స్ లు ధరించాలి. తర్వాత రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి.

3. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె డ్రైగా మారిన పాదాలకు అప్లై చేయవచ్చు. వేడిగా ఉండే కొబ్బరి నూనెను పాదాలకు అప్లై చేసినప్పుడు పగుళ్లు మాయం అవ్వడంతోపాటు, చర్మ కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి నూనెను పైనుంచి వేళ్ల వరకూ రాసి మసాజ్ చేయాలి.

4. ఫిష్ పెడిక్యూర్:
గర్రా రఫ లేదా డాక్టర్ ఫిస్ పదాలకు, డ్రై ఫీట్ కు నేచర్స్ బెస్ట్ రెమెడీ. పాదాల పగుళ్లు ఉన్నప్పుడు ఈ పెడిక్యూర్ ను నెలలో రెండు సార్లు చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. పెడిక్యూర్:
పెడిక్యూర్ చేయించుకొన్న తర్వాత ఫూట్ బ్రెష్ తో పాదాలను రుద్దాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి. పాదాలకు బ్రష్ చేసినప్పుడు, డ్రై స్కిన్ తొలగిపోతుంది. మీ పాదాల మరీ డ్రైగా అనిపిస్తే వారంలో మూడు సార్లు కూడా బ్రెష్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

6. తేనెతో మసాజ్:
పాదాలు డ్రైగా మరియు దురదపెడుతుంటే? ఈ సింపుల్ రెమెడీని అనుసరించవచ్చు. ఒక బేసిన్ లో హాట్ వాటర్ తీసుకోవాలి. పాదాలను అందులో ముంచి 20 నిముషాలు ఉంచాలి. తర్వాత తీసి, డ్రై చేయాలి. తర్వాత తేనె అప్లై చేసి మరో 15 నిముషాలు అలాగే ఉంచాలి . తిరిగి పాదాలను నీటిలో నాన్చి , తర్వాత శుభ్రం చేసుకోవాలి.

7. వేప పేస్ట్:
వేప పేస్ట్ బెస్ట్ హోం రెమెడీ. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. ఇది మెడికల్ పేస్ట్ . మీ పాదాలు పగినలప్పుడు , లోతుగా పగుళ్లు ఉన్నప్పుడు ఈ పేస్ట్ ను అప్లై చేయడం చాలా అవసరం. ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందుతారు.



Click it and Unblock the Notifications