Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
గోళ్ళపై పసుపుపచ్చ మరకలు నివారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్
గోళ్లను నొక్కిచూసి రక్తహీనత ఉందేమో పరిశీలించడం సాధారణంగా అందరూ చేసేదే. అయితే గోళ్ల రంగు, రూపులలో మార్పులను గమనించడం ద్వారా కూడా మరికొన్ని అనారోగ్య సంకేతాలనూ గుర్తించవచ్చు. ఎటువంటి మచ్చలూ లేకుండా, నునుపుగా, గులాబీరంగులో క్రమపద్ధతిలో పెరిగే గోళ్లు చక్కటి శారీరక ఆరోగ్యానికి సూచికలు. అలా కాకుండా గోర్ల రంగు, ఉపరితలం, ఆకారాల్లో మార్పులు వస్తే అవి అనారోగ్యాన్ని సూచిస్తున్నట్లు లెక్క.
సాధారణంగా ఫంగస్ ఇన్‌ఫెక్షన్ వల్ల గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి
థైరాయిడ్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, సోరియాసిస్ వంటి తీవ్రమైన వ్యాధులను సూచిస్తాయి. గోళ్లు పసుపు రంగులో ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడంమంచిది. అది యెల్లో నెయిల్ సిండ్రోమ్ అయ్యుండొచ్చు. దాని వల్ల రంగు మారడమే కాకుండా మందంగా, పెరుగుదల లేకుండా ఉంటాయి. అది మధుమేహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే.
పుసుపు రంగు గోళ్ళను నివారించడం చాలా తేలికైన పనే. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎల్లోయిష్ గా కనిపించడానికి కారణమయ్యే బ్యాక్టీరియా నివారించుకుంటే.. నెయిల్స్ అందంగా మారుతాయి. దానికోసం చక్కటి హోం రెమిడీస్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చెప్పబోతున్న రెమిడీస్ బాగా టెస్ట్ చేసినవి. మంచి ఫలితాలు ఇచ్చినవాటినే మీకు పరిచయం చేస్తున్నాం. అందులోనూ ఖర్చుకూడా లేని అద్భుతమైన చిట్కాలివి. ఈ చిట్కాలు గోళ్లను తెల్లగామార్చడమే కాదు.. హెల్తీగా కూడా మార్చేస్తాయి.

బేకంగ్ సోడ:
చేతులు, గోళ్లకు అద్భుతమైన పరిష్కారం బేకింగ్ సోడా. 1 టీస్పూన్ బేకింగ్ సోడా, మూడు నాలుగు స్పూన్లు నీళ్లు కలిపి నెయిల్స్ కి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. ఒక నెలలోపే మీ గోళ్లు హెల్తీగా, తెల్లగా మారిపోతాయి.

నిమ్మరసం:
నిమ్మరసం కొద్దిగా తాజా నిమ్మరసంలో గోళ్లను ముంచి తీయడం వల్ల మురికి పట్టిన నెయిల్స్ మెరిసిపోతాయి. నిమ్మరసంలోని బ్లీచింగ్ ప్రాపర్టీస్.. న్యాచురల్ గా పనిచేస్తాయి. వారానికి రెండు మూడు సార్లు ఈ టిప్ ఫాలో అయితే ఎల్లో నెయిల్స్ కి గుడ్ బై చెప్పవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్:
3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ను ఒక బౌల్ నీటిలో కలపాలి. మీ చేతులను 30 నిమిషాలు నానపెట్టాలి. ఇలా చేయడం వల్ల గోళ్లను శుభ్రం చేసి.. తెల్లగా కనపడేలా మార్చేస్తాయి.

మౌత్ వాష్:
మౌత్ వాష్ లిక్విడ్ మార్కెట్లో అందుబాటులో ఉణ్నాయి, వీటిని తీసుకొచ్చి, రెగ్యులర్ గా నెయిల్ ను ఈ సొల్యూషన్ లో కొద్దిసేపే నానబెట్టాలి. మౌత్ వాష్ లో ఉండే ఆల్కహాల్ గోళ్ల మీద ఉండే మరకలను తొలగిస్తుంది.ఫంగస్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను కిల్ చేస్తుంది.

టీట్రీ ఆయిల్:
నెయిల్స్ లో పేరుకున్న హానికారక బ్యాక్టీరియాని తొలగించడంలో టీ ట్రీ ఆయిల్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొన్ని చుక్కల ఆయిల్ చాలు గోళ్లను తెల్లగా మార్చడానికి.

లెమన్ పీల్
సిట్రస్ కలిగి ఉన్న ఆరంజ్ తొక్క పొడి న్యాచురల్ గా హానికారక బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కొద్దిగా నారింజ తొక్క పొడిని.. నీటిలో కలిపి గోళ్లపై అప్లై చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మీ గోళ్లు మెరిసిపోతాయి.

వైట్ టూత్ పేస్ట్ :
వైటెనింగ్ టూత్ పేస్ట్ గోళ్లపై అప్లై చేయండి. కాటన్ బాల్ తో స్క్రబ్ చేయండి. ఇలా 10 నిమిషాలు చేశాక.. శుభ్రం చేసుకోండి. అంతే ఎల్లో కలర్ పోయి.. గోళ్లు తెల్లగా మెరిసిపోతాయి.

బేస్ కోట్ :
నెయిల్స్ కు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ను బేస్ కోట్ గా వేసుకోవాలి. వేరే ఏదైనా నెయిల్ పాలిష్ వేసుకోవడానికి ముందు ఈ బేస్ కోట్ వేసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications