For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్షణాల్లో బ్యూటిఫుల్ లుక్ పొందడానికి ఫాలో అవ్వాల్సిన సీక్రెట్స్

By Super
|

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఆరాటపడుతూ ఉంటారు. కానీ టైం లేదని.. చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే.. మీకోసం మీరు కొన్ని క్షణాలు కేటాయిస్తే చాలు.. బ్యూటిఫుల్ లుక్ మీ సొంతం. మిమ్మల్ని అద్భుతంగా చూపించే అందమైన చిట్కాలకు ఎక్కువ సమయం కూడా అవసరం లేదు.

మీకు మేకప్ వేసుకోవడానికి తగినంత సమయం లేకపోతే ఈ చిట్కాల ఫాలో అయితే బోలెడు సమయం ఆదా అవుతుంది. మరి వీటిని మిస్సవ్వద్దు లేడీస్. తెల్ల జుట్టు కప్పిపుచ్చుకోడానికి ఐలైనర్ ని వెంట్రుకలకి పూయడం, కను రెప్పలని కర్ల్ చేసుకోవడం లాంటి చిన్న చిన్న బ్యూటీ చిట్కాలు మనకి తెలుసు. ఇవి మన సమయాన్ని ఆదా చెయ్యడమే కాకుండా చివరి నిమిషంలో తలెత్తే హడావిడిలో కూడా ఉపయోగపడతాయి. ఈ చిట్కాలు గుర్తుంచుకుంటే ఏ సమయంలోనైనా మీరు అందంగా కనిపించవచ్చు. మరి ఇక మనకు టైం సేవ్ చేసే చిట్కాలేంటో చూసేద్దామా...

మీ రంగుకి నప్పే ఫౌండేషన్ లేదా??

మీ రంగుకి నప్పే ఫౌండేషన్ లేదా??

ఒకవేళ మీరు పొరపాటున కాస్త ముదురురంగు ఫౌండేషన్ కొన్నట్లయితే దానిలో ఒక చుక్క మాయిశ్చరైజర్ కలిపి అప్లై చేసుకోండి. ఇది అప్పటికప్పుడు లేత రంగు ఫౌండేషన్ లా మారుతుంది.

మీ కనులు, లేదా పెదాలకి మాత్రమే మేకప్:

మీ కనులు, లేదా పెదాలకి మాత్రమే మేకప్:

మీకు పూర్తి మేకప్ వేసుకోవడానికి తగినంత సమయం లేకపోతే మీ కన్నులని హైలైట్ చేసుకోండి లేదా పెదాలని మాత్రమే హైలైట్ చేసుకోండి. రెండూ వేస్తే చాలా అసహ్యంగా కనిపిస్తారని గుర్తు పెట్టుకోండి.

ఫేస్ వైప్స్:

ఫేస్ వైప్స్:

రోజంతా బాగా అలసిపోయాకా మొహం కడుక్కోవడానికి బద్ధకంగా ఉందా? అయితే ఫేస్ వైప్స్ రెడీగా పెట్టుకుంటే సమయం ఆదా అవ్వడమే కాదు, మొహం కడుక్కున్నట్లుగానే ఉంటుంది. బాగా అలసిపోయినప్పుడు లేదా మొహం కడుక్కోవడానికి తగినంత సమయం లేకపోతే కనుక ఇది మంచి చిట్కా.

మొహం ఉబ్బడాన్ని అరికట్టాలంటే:

మొహం ఉబ్బడాన్ని అరికట్టాలంటే:

ఉబ్బిన మీ మొహాన్ని కప్పిపుచ్చడానికి చిట్కాలు ఉపయోగించి అలసిపోయారా? దిగులు పడద్దు, దీనికి మీరు చెయ్యాల్సిందల్లా మీరు నిద్రపోయేటప్పుడు తలగడని కాస్త ఎత్తులో పెట్టుకోండి. దీనివల్ల మీ ముఖంలోని ద్రవాలు ఖచ్చితంగా హరిస్తాయి.

గ్లోసీ లిప్స్టిక్‌ని మ్యాట్‌గా మార్చడం:

గ్లోసీ లిప్స్టిక్‌ని మ్యాట్‌గా మార్చడం:

కొత్త మ్యాట్ లిప్స్టిక్ కొనడం ఎందుకు? మీ దగ్గర ఉన్న గ్లోసీ లిస్టిక్ ని పెదాల మీద అద్దే ముందు కొంచెం కన్‌సీలర్‌ని పెదాలకి రాసి ఇప్పుడు గ్లోసీ లిప్‌స్టిక్ వేస్తే మ్యాట్ ఫినిష్ రావడమే కాదు ఎక్కువ సేపు నిలుస్తుంది కూడా.

పగిలిన అరికాళ్లకు:

పగిలిన అరికాళ్లకు:

పగిలిన మీ పాదాలు కలుగచేసే అసౌకర్యం మీకు నచ్చదు కదూ? అయితే పగుళ్ల మీద కాస్త పెట్రోలియం జెల్లీ రాసి సాక్సులు వేసుకోండి. ఇలా చేయడం వల్ల కాలి పగుళ్లు తగ్గడమే కాకుండా అరికాలికి కావాల్సిన తేమ కూడా అందుతుంది.

జుట్టు ఆరబెట్టుకోవడం:

జుట్టు ఆరబెట్టుకోవడం:

మీ తడి తల ని డ్రయ్యర్ తో ఆరబెట్టుకునే సమయం లేదా? అయితే డ్రయ్యర్ షీట్ ఉపయోగించండి. ఇవి మీ డ్రయ్యర్‌లాగ వేడితో మీ జుట్టుకి హాని కలిగించకుండా నీటిని పీల్చేసుకుంటాయి. ఈ చిట్కా మీరు తప్పక పాటించాలి.

English summary

Beauty Hacks That You Must Try!

Beauty Hacks That You Must Try! We often search for easy ways to get to things. However, sometimes, it really does not work.
Desktop Bottom Promotion