Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పాలలో దాగున్న అమేజింగ్ బ్యూటీ సీక్రెట్స్
పాలల్లో పోషకవిలువలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. పాలను రోజు తాగడం చాలా అవసరమని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే.. పాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాం. అలాగే వీటి ద్వారా చర్మ, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి. పాలతో బ్యూటీ బెన్ఫిట్స్ పొందే విధానాలు చాలానే ఉన్నాయి.
పాలు మరియు తేనెలో 10 మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్
చర్మానికి పాలు ఉపయోగించడం వల్ల స్కిన్ స్మూత్ అండ్ గ్లోయింగ్ గా కనిపిస్తుంది. అలాగే ఇది స్కిన్ హైడ్రేట్ చేస్తుంది. అలాగే చర్మం హెల్తీగా ఉండటానికి పాలు సహాయపడతాయి. ఇక జుట్టు సంరక్షణకు కూడా పాలు ఉపయోగించవచ్చని స్టడీస్ చెబుతున్నాయి. స్కాల్ఫ్ కి పోషణ అందించి.. సిల్కీగా కనిపించడానికి తోడ్పడతాయి.
పాలు ఎందుకు తాగాలి ? పాలతో పొందే ప్రయోజనాలేంటి ?
పాలు క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్, కండిషనర్ లా ఉపయోగపడతాయి. మీరు రెగ్యులర్ గా సౌందర్యం కోసం తీసుకునే కేర్ లో పాలను చేర్చుకుంటే.. మంచి ఫలితాలు పొందుతారు. పాలను చర్మానికి, జుట్టు సంరక్షణకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

క్లెన్సర్
పాలు చర్మానికి మంచి క్లెన్సర్ లా పనిచేస్తాయి. చర్మంపై దుమ్ము తొలగించి,, ముఖంపై గుంతలను మాయం చేస్తాయి. పాలలో దూది ముంది ముఖంపై రుద్దుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బ్లీచ్
పాలను నిమ్మరసంలో కలిపితే.. న్యాచురల్ బ్లీచ్ లా పనిచేస్తుంది. పాలు, తేనె, శనగపిండి, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది కాంప్లెక్షన్ ని పెంచుతుంది.

స్క్రబ్
పాలను స్క్రబర్ లా కూడా ఉపయోగించవచ్చు. పాలు చాలా ఎఫెక్టివ్ గా, న్యాచురల్ స్క్రబ్ లా ఉపయోగించవచ్చు. కొన్ని బాదాం గింజలను పేస్ట్ లా చేసి, పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని న్యాచురల్ స్ర్కబ్ లా ఉపయయోగిస్తే.. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

టోనర్
పాలను స్కిన్ టోనర్ లా ఉపయోగింవచ్చు. జిడ్డుతనాన్ని తగ్గిస్తుంది. ఆయిలీ స్కిన్ తో బాధపడేవాళ్లు.. పాలను ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. పాలలో దూది ముంచి, ముఖమంతా బాగా రబ్ చేయాలి. కాసేపటి తర్వాత క్లీన్ చేసుకోవాలి.

యాక్నే
పాలు యాంటీ యాక్నె ఏజెంట్ లా పనిచేస్తాయి. ఆయిలీనెస్ తగ్గించి యాక్నెను తొలగిస్తాయి. అలాగే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. కాబట్టి యాక్నే ఉన్న ప్రాంతంలో పాలతో మసాజ్ చేయాలి. కాస్త ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

జుట్టుకి కండిషనర్
జుట్టుకి పాలను అప్లై చేస్తే మంచి కండిషనర్ లా పనిచేస్తుంది. ఇది జుట్టుకి మంచి పోషణను ఇస్తుంది. ఇది జుట్టుని హెల్తీగా మార్చి.. మంచి షైనింగ్ నిస్తుంది.

హెయిర్ మాస్క్
పాలను హెయిర్ మాస్క్ లా ఉపయోగించవచ్చు. కొన్ని ముక్కల అరటిపండు గుజ్జికి, పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ఫ్, జుట్టుకి అప్లై చేయాలి. కాసేపటి తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటే.. జుట్టు హెల్తీగా పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
