Latest Updates
-
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్ -
పెళ్లై ఏళ్లు గడిచాక చాలా జంటలు భార్యాభర్తలుగా కాదు, రూమ్మేట్లలా జీవిస్తున్నారు మీరూ ఇలాంటివారేనా? -
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.?
అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి శనగపిండి, పెరుగు మాస్క్
ఎలాంటి పార్టీ అయినా, ఫంక్షన్ అయినా కలర్ ఫుల్ గా, అందంగా, స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించాలి అనుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకంగా ఆకట్టుకోవాలని భావిస్తారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే శరీరంపై అవాంఛిత రోమాలు ఉన్నవాళ్లు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
కొంతమందికి శరీరంపై చాలా ఎక్కువ అవాంఛిత రోమాలు ఉంటాయి. వీళ్లు ఎంత ప్రయత్నించినా.. సమస్య నుంచి బయటపడలేకపోతారు. అయితే కొంతమందికి చాలా తక్కువ హెయిర్ ఉంటుంది. అయితే.. ఇబ్బందికి గురిచేసే అన్ వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేయడానికి ఇంట్లోనే సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
రేజర్, మార్కెట్ లో దొరికే క్రీములు వాడటం వల్ల వారం రోజులకే మళ్లీ హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది. కాబట్టి.. ఇలాంటి రిస్క్ లేకుండా.. హెయిర్ రిమూవ్ చేయడంతో పాటు, చర్మాన్ని స్మూత్ గా మార్చే శనగపిండి, పెరుగు మాస్క్ ఇప్పుడే ట్రై చేయండి. అవేంటో చూసేద్దామా..

స్క్రబ్
అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. ఈ స్ర్కబ్ ని పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. పిల్లలకు కూడా ఈ స్క్రబ్ ని వాడుతూ ఉంటారు.

స్క్రబ్ కి కావాల్సిన పదార్థాలు
అరకప్పు శనగపిండి, అరకప్పు పెరుగు, 1 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ క్రీమ్ తీసుకోవాలి. ఒకవేళ మీది జిడ్డు చర్మం అయితే.. క్రీం అవసరం లేదు. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి.

పదార్థాలు
ఒకవేళ మీది చాలా జిడ్డు చర్మం అయితే పసుపుతోపాటు గంధం కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల చర్మం నిగారిస్తుంది.

ఉపయోగించే విధానం
ముఖంపై సమానంగా ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. చాలా మందంగా రాసుకోవాలి. ఈ స్క్రబ్ ని అవాంఛిత రోమాలు తొలగించడానికి ముఖంతోపాటు, శరీరానికి కూడా అప్లై చేయవచ్చు.

స్టెప్
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేశాక.. ఒక గంట ఆరనివ్వాలి. తర్వాత వ్యతిరేక దిశలో బాగా స్క్రబ్ చేయాలి. ఒకవేళ చాలా డ్రై అయి ఉంటే.. కాస్త వేళ్లకు తేమ చేసుకుని.. బాగా రుద్దాలి. తర్వాత మొత్తం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఎన్ని సార్లు ఉపయోగించాలి
మీ శరీరంపై హెయిర్ గ్రోత్ ని బట్టి ఉపయోగించాలి. మీకు చాలా ఎక్కువగా హెయిర్ గ్రోత్ ఉంటే.. రోజు మార్చి రోజు ఒక వారం పాటు వాడాలి. ఇలా చేయడం వల్ల నెలలో మీకు ఫలితం కనిపిస్తుంది.

మాయిశ్చరైజర్
హెయిర్ రిమూవల్ ప్యాక్ శుభ్రం చేసుకున్న తర్వాత చర్మం డ్రై అవుతుంది. కాబట్టి.. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల.. చర్మం సాఫ్ట్ గా మారుతుంది.



Click it and Unblock the Notifications