Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పసుపు రంగులోకి మారిన గోళ్లను తెల్లగా మార్చే హోం రెమిడీస్..
గోళ్లు పసుపు రంగులోకి మారాయంటే.. చాలా అసహ్యంగా కనిపిస్తాయి. మొత్తం చేతులకే అందవిహీనంగా మార్చేస్తాయి. నెయిల్ పాలిష్ లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. కానీ మనందరికీ చాలా ఇష్టమైన నెయిల్ పెయింట్ వేసుకోవడం మానేయాలంటే చాలా కష్టమైన పని.
అయితే ఈ ఎల్లో నెయిల్స్ నివారించడం చాలా తేలికైన పనే. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎల్లోయిష్ గా కనిపించడానికి కారణమయ్యే బ్యాక్టీరియా నివారించుకుంటే.. నెయిల్స్ అందంగా మారుతాయి. దానికోసం చక్కటి హోం రెమిడీస్ అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడ చెప్పబోతున్న రెమిడీస్ బాగా టెస్ట్ చేసినవి. మంచి ఫలితాలు ఇఛ్చినవాటినే మీకు పరిచయం చేస్తున్నాం. అందులోనూ ఖర్చుకూడా లేని అద్భుతమైన చిట్కాలివి. ఈ చిట్కాలు గోళ్లను తెల్లగా మార్చడమే కాదు.. హెల్తీగా కూడా మార్చేస్తాయి.

నిమ్మరసం
కొద్దిగా తాజా నిమ్మరసంలో గోళ్లను ముంచి తీయడం వల్ల మురికి పట్టిన నెయిల్స్ మెరిసిపోతాయి. నిమ్మరసంలోని బ్లీచింగ్ ప్రాపర్టీస్.. న్యాచురల్ గా పనిచేస్తాయి. వారానికి రెండు మూడు సార్లు ఈ టిప్ ఫాలో అయితే ఎల్లో నెయిల్స్ కి గుడ్ బై చెప్పవచ్చు.

బేకింగ్ సోడా
చేతులు, గోళ్లకు అద్భుతమైన పరిష్కారం బేకింగ్ సోడా. 1 టీస్పూన్ బేకింగ్ సోడా, మూడు నాలుగు స్పూన్లు నీళ్లు కలిపి నెయిల్స్ కి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. ఒక నెలలోపే మీ గోళ్లు హెల్తీగా, తెల్లగా మారిపోతాయి.

హైడ్రోజన్ పెరాక్సైడ్
3 టేబుల్ స్పూన్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఒక బౌల్ నీటిలో కలపాలి. అందులో గోళ్లు ముంచి 15 నిమిషాలు పెట్టాలి. ఇలా చేయడం వల్ల డెడ్ సెల్స్ తొలగించి, న్యాచురల్ వైటెన్ నెయిల్స్ అందిస్తాయి.

టూత్ పేస్ట్
వైటెనింగ్ టూత్ పేస్ట్ గోళ్లపై అప్లై చేయండి. కాటన్ బాల్ తో స్క్రబ్ చేయండి. ఇలా 10 నిమిషాలు చేశాక.. శుభ్రం చేసుకోండి. అంతే ఎల్లో కలర్ పోయి.. గోళ్లు తెల్లగా మెరిసిపోతాయి.

టీ ట్రీ ఆయిల్
నెయిల్స్ లో పేరుకున్న హానికారక బ్యాక్టీరియాని తొలగించడంలో టీ ట్రీ ఆయిల్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొన్ని చుక్కల ఆయిల్ చాలు గోళ్లను తెల్లగా మార్చడానికి.

ఆరంజ్ పీల్
సిట్రస్ కలిగి ఉన్న ఆరంజ్ తొక్క పొడి న్యాచురల్ గా హానికారక బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కొద్దిగా నారింజ తొక్క పొడిని.. నీటిలో కలిపి గోళ్లపై అప్లై చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మీ గోళ్లు మెరిసిపోతాయి.

వెనిగర్
3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ను ఒక బౌల్ నీటిలో కలపాలి. మీ చేతులను 30 నిమిషాలు నానపెట్టాలి. ఇలా చేయడం వల్ల గోళ్లను శుభ్రం చేసి.. తెల్లగా కనపడేలా మార్చేస్తాయి.



Click it and Unblock the Notifications