Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
ఎల్లో నెయిల్స్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!
గోళ్లను నొక్కిచూసి రక్తహీనత ఉందేమో పరిశీలించడం సాధారణంగా అందరూ చేసేదే. అయితే గోళ్ల రంగు, రూపులలో మార్పులను గమనించడం ద్వారా కూడా మరికొన్ని అనారోగ్య సంకేతాలనూ గుర్తించవచ్చు. ఎటువంటి మచ్చలూ లేకుండా, నునుపుగా, గులాబీరంగులో క్రమపద్ధతిలో పెరిగే గోళ్లు చక్కటి శారీరక ఆరోగ్యానికి సూచికలు. అలా కాకుండా గోర్ల రంగు, ఉపరితలం, ఆకారాల్లో మార్పులు వస్తే అవి అనారోగ్యాన్ని సూచిస్తున్నట్లు లెక్క.
సాధారణంగా ఫంగస్ ఇన్‌ఫెక్షన్ వల్ల గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి థైరాయిడ్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, సోరియాసిస్ వంటి తీవ్రమైన వ్యాధులను సూచిస్తాయి. గోళ్లు పసుపు రంగులో ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అది యెల్లో నెయిల్ సిండ్రోమ్ అయ్యుండొచ్చు. దాని వల్ల రంగు మారడమే కాకుండా మందంగా, పెరుగుదల లేకుండా ఉంటాయి. అది మధుమేహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే.
పుసుపు రంగు గోళ్ళను నివారించడం చాలా తేలికైన పనే. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎల్లోయిష్ గా కనిపించడానికి కారణమయ్యే బ్యాక్టీరియా నివారించుకుంటే.. నెయిల్స్ అందంగా మారుతాయి. దానికోసం చక్కటి హోం రెమిడీస్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చెప్పబోతున్న రెమిడీస్ బాగా టెస్ట్ చేసినవి. మంచి ఫలితాలు ఇచ్చినవాటినే మీకు పరిచయం చేస్తున్నాం. అందులోనూ ఖర్చుకూడా లేని అద్భుతమైన చిట్కాలివి. ఈ చిట్కాలు గోళ్లను తెల్లగా మార్చడమే కాదు.. హెల్తీగా కూడా మార్చేస్తాయి.

నిమ్మరసం:
నిమ్మరసం కొద్దిగా తాజా నిమ్మరసంలో గోళ్లను ముంచి తీయడం వల్ల మురికి పట్టిన నెయిల్స్ మెరిసిపోతాయి. నిమ్మరసంలోని బ్లీచింగ్ ప్రాపర్టీస్.. న్యాచురల్ గా పనిచేస్తాయి. వారానికి రెండు మూడు సార్లు ఈ టిప్ ఫాలో అయితే ఎల్లో నెయిల్స్ కి గుడ్ బై చెప్పవచ్చు.

బేకింగ్ సోడా
చేతులు, గోళ్లకు అద్భుతమైన పరిష్కారం బేకింగ్ సోడా. 1 టీస్పూన్ బేకింగ్ సోడా, మూడు నాలుగు స్పూన్లు నీళ్లు కలిపి నెయిల్స్ కి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. ఒక నెలలోపే మీ గోళ్లు హెల్తీగా, తెల్లగా మారిపోతాయి.

హైడ్రోజన్ పెరాక్సైడ్
3 టేబుల్ స్పూన్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఒక బౌల్ నీటిలో కలపాలి. అందులో గోళ్లు ముంచి 15 నిమిషాలు పెట్టాలి. ఇలా చేయడం వల్ల డెడ్ సెల్స్ తొలగించి, న్యాచురల్ వైటెన్ నెయిల్స్ అందిస్తాయి.

టూత్ పేస్ట్
వైటెనింగ్ టూత్ పేస్ట్ గోళ్లపై అప్లై చేయండి. కాటన్ బాల్ తో స్క్రబ్ చేయండి. ఇలా 10 నిమిషాలు చేశాక.. శుభ్రం చేసుకోండి. అంతే ఎల్లో కలర్ పోయి.. గోళ్లు తెల్లగా మెరిసిపోతాయి.

టీ ట్రీ ఆయిల్
నెయిల్స్ లో పేరుకున్న హానికారక బ్యాక్టీరియాని తొలగించడంలో టీ ట్రీ ఆయిల్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొన్ని చుక్కల ఆయిల్ చాలు గోళ్లను తెల్లగా మార్చడానికి.

ఆరంజ్ పీల్
సిట్రస్ కలిగి ఉన్న ఆరంజ్ తొక్క పొడి న్యాచురల్ గా హానికారక బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కొద్దిగా నారింజ తొక్క పొడిని.. నీటిలో కలిపి గోళ్లపై అప్లై చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మీ గోళ్లు మెరిసిపోతాయి.

వెనిగర్
3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ను ఒక బౌల్ నీటిలో కలపాలి. మీ చేతులను 30 నిమిషాలు నానపెట్టాలి. ఇలా చేయడం వల్ల గోళ్లను శుభ్రం చేసి.. తెల్లగా కనపడేలా మార్చేస్తాయి.



Click it and Unblock the Notifications