నల్లగా ఉన్న చేతులను తెల్లగా..కాంతివంతంగా, సాప్ట్ గా మార్చే హ్యాడ్ మాస్క్స్

వేసవి కాలమైనా..కాకపోయినా...ఏ సమయంలో అయినా సరే స్కిన్ టాన్ కు గురి అవుతుంది. ఉష్ణమండల ప్రదేశాల్లో హుముడిటి వల్ల చర్మఆరోగ్యం మీద ప్రభావం చుపుతుంది. ఉష్ణ ప్రదేశాల్లో ఎక్కువగా వేడి , సూర్యుని నుండి వెలువడే యూవి కిరణాల వల్ల చర్మం త్వరగా టానింగ్ కు గురౌతుంది.

మన శరీరంలో సన్ టాన్ కు త్వరగా గురైదే చేతులే. యువి కిరణాలు చర్మం మీద పడినప్పుడు స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణమవుతుంది. చర్మం మీద నల్ల ప్యాచ్ లు లేదా చర్మం రంగు పూర్తిగా నల్లగా మారుతుంది. చర్మం సహజ రంగు కంటే ఇలా నల్లగా మారడాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. ముఖం, చేతులు మీద స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశాల్లో చర్మం త్వరగా స్కిన్ టాన్ కు గురౌతుంది. దాంతో ఈ బాగాల్లో చర్మం నల్లగా మారుతుంది.

ఇంకా, శరీరానికి రక్షణకవచంగా దుస్తులను ధరిస్తారు, దుస్తులు చర్మఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది,. అయితే చేతులకు ఎలాంటి రక్షక కవచాలు లేకపోవడం వల్ల సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాలు నేరుగా చేతులను తాకడం వల్ల , మెలనిన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల... స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణమవుతుంది.సన్ టాన్ కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించకపోవడం, విటమిన్ సి లోపం, డీహైడ్రేషన్ కారణంగా కూడా చర్మం నల్లగా మారుతుంది. సన్ టాన్ నివారించుకోవడానికి ఏం చేయాలి?

చేతుల మీద సన్ టాన్ నివారిచండంలో హోం రెమెడీస్ ఎలా పనిచేస్తాయి? చేతుల మీద ఉండే డెడ్ స్కిన్ లేయర్స్ , చర్మ రంద్రాలను శుభ్రం చేసి, మెలనిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేయడం వల్ల చర్మం తెల్లగా పూర్వస్థితికి చేరుకుంటుంది. సన్ టాన్ నివారించడంలో నాన్ టాక్సిక్ పదార్థాలుగా ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉపయోగపడుతాయి. ఇవి చర్మానికి సురక్షితమైనవి. మరి అవేంటో ఒకసారి చూద్దాం..

బంగాళదుంప, నిమ్మరసం:

బంగాళదుంప, నిమ్మరసం:

బంగాళదుంప మరియు నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు సన్ టాన్ తొలగించి, చర్మంను తెల్లగా మార్చుతాయి

బంగాళదుంపను మెత్గా పేస్ట్ చేసి అందులో నుండి ఒక టీస్పూన్ రసం తీసి, అందులో నిమ్మరసం మిక్స్ చేసి, ఈ మిశ్రమంలో కాటన్ డిప్ చేసి, రెండు చేతులకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కలబంద:

కలబంద:

కలబందలో ఉండే అలిసిన్, యాంటీఆక్సిడెంట్స్ లో చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది. చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. స్కిన్ టాన్ ను నివారిస్తుంది. అలోవెరను కట్ చేసి, అందులో నుండి జెల్ తీసుకుని రెండు చేతులకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగి, పొడి వస్త్రతంతో తేమ లేకుండా తుడుచుకోవాలి.

కీర జ్యూన్, తేనె:

కీర జ్యూన్, తేనె:

కీరజ్యూస్ మరియు తేనె నేచురల్ పదార్థాలు, ఈ రెండింటి కాంబినేషన్ లో వేసుకును హ్యాండ్ మాస్క్ వల్ల స్కిన్ టాన్ తొలగిపోయి, చర్మానికి తగినంత పోషణను, తేమను అందిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కీరదోసకాయ రసం తీసుకుని అందులో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. దీన్ని చేతుల మీద అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత స్క్రబ్ చేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బియ్యం పిండి, పసుపు, పాలు :

బియ్యం పిండి, పసుపు, పాలు :

బియ్యం పిండి, పాలు, పసుపు మూడింటి కాంబినేషన్ హ్యాండ్ మాస్క్ వేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం క్లియర్ గా మారుతుంది, చర్మంలోపలి నుండి శుభ్రమవుతుంది. ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకుని అందులో చిటికెడు పసుపు , కొద్దిగా పాలు మిక్స్ చేయాలి. సాప్ట్ గా పేస్ట్ అయ్యే వరకూ మిక్స్ చేసి తర్వాత ట్యాన్ ఉన్న చేతులకు ప్యాక్ వేసుకోవాలి,. అరగంట తర్వాత స్ర్కబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ రెమెడీని వారంలో 3సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు , శెనగపిండి:

పెరుగు , శెనగపిండి:

ఈ రెండింటి హ్యాండ్ మాస్క్ లో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, యాంటిఆక్సిడెంట్స్ చేతులకు అప్లై చేయడం వల్ల నేచురల్ బ్లీచర్ గా పనిచేస్తుంది. ట్యాన్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. శెనగపిండి, పెరుగు సమయంగా తీసుకుని అందులో వాటర్ మిక్స్ చేసి, సాస్ట్ గా పేస్ట్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ను రెండు చేతులకు అప్లై చేయాలి. డ్రైగా మారే వరకూ అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి, టమోటో

బొప్పాయి, టమోటో

బొప్పాయి, టమోటో కాంబినేసన్ హ్యాడ్ మాస్క్ లో పెపైన్, బీటా కెరోటిన్ లు ఎక్కువగా ఉన్నాయి, ఇవి నేచురల్ స్కిన్ బ్లీచర్ గా పనిచేస్తాయి. బొప్పాయిని మెత్తగా మ్యాష్ చేసి అందులో టమోటో గుజ్జుకూడా వేసి చేతులకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

గందం, కోకనట్ వాటర్

గందం, కోకనట్ వాటర్

ఈ రెండింటి కాంబినేషన్ మాస్క్ లో స్కిన్ క్లెన్సింగ్ లక్షనాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ గందంలో పొడిలో కొద్దిగా కోకనట్ వాటర్ మిక్స్ చేసి, స్మూత్ గా పేస్ట్ చేయాలి. ట్యాన్ అయిన చేతులకు ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. తర్వాత రాత్రంతా అలాగే ఉండనిచ్చి, ఉదయం స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి మాయశ్చరైజర్ ను అందిస్తుంది.

కుకుమ పువ్వు, పాలు, తేనె:

కుకుమ పువ్వు, పాలు, తేనె:

ట్యాన్ నివారించడానికి అమేజింగ్ హోం రెమెడీ, చర్మ నలుపు పోగొట్టి, తెల్లగా, బ్రైట్ గా మార్చుతుంది.

ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ మిల్క్ తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా కుంకుమ పువ్వు మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేసి, రాత్రంతా అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా డ్రై అయిన తర్వాత స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

బాదం, శాండిల్ ఉడ్ ఆయిల్, పెరుగు :

బాదం, శాండిల్ ఉడ్ ఆయిల్, పెరుగు :

ఈ కాంబినేషన్ హ్యాండ్ మాస్క్ లో రెబోఫెవిన్, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఈ మాస్క్ ను చేతులకు అప్లై చేస్తే స్కిన్ స్పాట్స్, ముడతలను నివారిస్తుంది.

5 బాదంలను నీటిలో వేసి రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం వీటిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో 5 చుక్కల శాండిల్ ఉడ్ ఆయిల్ మిక్స్ చేయాలి, తర్వాత పెరుగు మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ చేయాలి. దీన్ని చేతులకు అప్లై చేసి, డ్రై అయిన తర్వాత స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

బాదం ఆయిల్ , పెట్రోలియం జెల్లీ

బాదం ఆయిల్ , పెట్రోలియం జెల్లీ

మరో సింపుల్ హోం రెమెడీ చేతుల మీద స్కిన్ టాన్ ను నేచురల్ గా తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాదంలో ఉండే విటమిన్ ఇ , ఎమోలియంట్ లక్షణాలు, మాస్క్ వల్ల సన్ టాన్ నివారిస్తుంది. స్కిన్ రిపేర్ చేస్తుంది,. చర్మం తేమగా, సాప్ట్ గా మారుతుంది

పెట్రోలియం జెల్లీ తీసుకుని అందులో కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి చేతులకు మాసజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం వార్మ్ గా అనిపిస్తుంది, తర్వాత చేతులకు గ్లౌజులు ధరించి, మరుసటి రోజు ఉదయం చేతులను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్ జ్యూస్ లో బ్లీచింగ్ లక్షనాలు అధికంగా ఉన్నాయి, ఇవి చర్మాన్ని రిపేర్ చేస్తుంది , కొత్త కణాలను ఏర్పాటకు సహాయపడుతుంది.

పైనాపిల్ జ్యూస్ లో కొద్దిగా కాటన్ డిప్ చేసి రెండు చేతులకు అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడ, రోజ్ వాటర్, గ్లిజరిన్

బేకింగ్ సోడ, రోజ్ వాటర్, గ్లిజరిన్

బేకింగ్ సోడ, లో కొద్దిగా రోజ్ వాటర్, గ్లిజరిన్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ అందిస్తుంది, చర్మానికి కొత్తకణాలను ప్రోత్సహిస్తుంది,.

బేకింగ్ సోడాలో గ్లిజరిన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి స్మూత్ గా అయిన తర్వాత చేతులకు అప్లై చేయాలి.

Desktop Bottom Promotion