For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డార్క్ ఫీట్ నివారించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!

By Super Admin
|

మన శరీరానికి ఆధారం కాళ్ళు. ఇవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. అటువంటి కాళ్ళను మన నిత్యజీవితంలో నిర్లక్ష్యం చేస్తుంటాము. కాళ్ళ పగుళ్లు ఏర్పడినా, కాళ్ళ మురికిగా, నల్లగా ఉన్నాఅంతాగా పట్టించుకోరు. ఇటువంటి పరిస్థితిలో, డార్క్ ఫీట్ ను నివారించడానికి హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.

పాదల గురించి సరైన జాగ్రత్తలను తీసుకోకపోవడం వల్ల డార్క్ గా తయారవుతాయి. మన శరీరంలో ఎక్కువగా పనిచేసేది పాదాలు , అటువంటి పాదానలను నిర్లక్ష్యం చేయకుండా, వాటికోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం స్నానం చేసేప్పుడు స్క్రబ్ చేయడం మర్చిపోతుంటాము. అయితే, పాదాల ఆరోగ్యం, అందం కోసం కొద్దిగా సమయాన్ని, ఓపికను పెడితే, పాదాలు ఎప్పుడూ అందంగా కనబడుతాయి.

ఇంకా పాదాలకు సన్ ప్రొటక్షన్ కూడా నిర్లక్ష్యం చేస్తుంటాము. దీని వల్ల పాదాలు టానింగ్ కు గురి అవుతాయి. సన్ డ్యామేజ్ వల్ల పాదాలు పగుళ్ళు ఎక్కువ అవుతాయి. ఇక స్లిప్పర్ వేసుకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. పాదాలు పగుళ్ళ వల్ల పాదాల్లో మురికి చేరుతుంది, ఇదంతా పాదాల పట్లజాగ్రత్తలు తీసుకోకుండా నెగ్లెకట్ చేయడం వల్లే ఇలా జరుగుతుంది.

కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే, కొన్ని మోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. వీటని కనుక ప్రయత్నిస్తే, పాదాల పగుళ్ళతో పాటు డార్క్ నెస్ తొలగిపోయి, పాదాలు చూడటానికి అందంగా కనబడుతాయి. నేచురల్ పద్దతులతోనే పాదానలు అందంగా మార్చుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...

1. నిమ్మరసం, తేనె:

1. నిమ్మరసం, తేనె:

నిమ్మరసం ఉత్తమ బ్లీచింగ్ ఏజెంట్, తేనె గొప్ప ఎక్పఫ్లోయేటర్. ఈ హోం రెమెడీని ఉపయోగించి డార్క్ ఫీట్ ను నివారించుకోవాలి.

2. బేకింగ్ సోడా పేస్ట్ :

2. బేకింగ్ సోడా పేస్ట్ :

బేకింగ్ సోడాలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, పాదాలకు అప్లై చేసి, స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాల మీద డార్క్ నెస్ తగ్గుతుంది.

3. నిమ్మరసం , పంచదార:

3. నిమ్మరసం , పంచదార:

పంచదార నేచురల్ స్ర్కబ్బర్, ఇందులో నిమ్మరసం మిక్స్ చేసి పాదాలకు అప్లై చేసి, స్క్రబ్ చేయడం వల్ల పాదాల మీద డార్క్ నెస్ తగ్గి, ఫ్రెష్ గా కనబడుతాయి.ఇది గ్రేట్ హోం బ్యూటీ టిప్.

4. పసుపు, పాలు:

4. పసుపు, పాలు:

పసుపులో ఉండే అద్భుతమైన స్కిన్ లైటనింగ్ లక్షణాలను గురించి ప్రతి ఒక్కరికీ తెలసిందే, ఈ రెండింటి కాంబినేషన్ లో పేస్ట్ ను పాదాలకు అప్లై చేయడం వల్ల మాస్క్ వేసుకోవడం వల్ల 15నిముషాల్లో పాదాల మీద చర్మం బ్రైట్ గా కనబడుతుంది.

5. ముల్తాని మట్టి, పంచదార:

5. ముల్తాని మట్టి, పంచదార:

పాదాల మీద డార్క్ నెస్ ను నివారించడంలో ముల్తాని మట్టి గొప్పగా సహాయపడుతుంది. ముల్తాని మట్టిలో పంచదార మిక్స్ చేయడం వల్ల పాదాల్ల నలుపు క్రమంగా తగ్గుతుంది.

6. బేకింగ్ సోడ:

6. బేకింగ్ సోడ:

పాదాల్లో పగుళ్ళతో పాటు, మురికి చేరినప్పుడు, బేకింగ్ సోడా గొప్పగా పనిచేస్తుంది, బేకింగ్ సోడ పేస్ట్ ను పాదాలకు అప్లై చేసి, కొద్దిసేపటి తర్వాత స్ర్కబ్ చేసి, బ్రష్ తో రుద్ది శుభ్రం చేసుకోవాలి.

7. షాంపు:

7. షాంపు:

ప్రతి ఒక్కరూ షాంపు ఉపయోగిస్తుంటరు, పాదాల్లో డార్కెనెస్ తగ్గించడంలో షాంపు గ్రేట్ గా పనిచేస్తుంది. షాంపు వాటర్ లో పాదాలు డిప్ చేసి, స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

8. పెరుగు:

8. పెరుగు:

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది డార్క్ స్కిన్ ను లైట్ గా మార్చుతుంది.

9. బొప్పాయి:

9. బొప్పాయి:

బొప్పాయి గుజ్జును పాదాలకు అప్లై చేసి, మసాజ్ చేసి శుభ్రం చేసుకోవాలి. దీన్ని అప్లై చేయడం వల్ల డార్క్ ఫీట్ తెల్లగా మారుతుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ అందుకు గ్రేట్ గా సహాయపడుతాయి. టానింగ్ ను తొలగిస్తుంది.

10. టమోటో:

10. టమోటో:

టమోటోలో ఉండే విటమిన్ సి, స్కిన్ బ్లీచింగ్ కోసం గ్రేట్ గా సహాయపడుతుంది. టమోటో స్లైస్ ను స్కిన్ కు స్రబ్ చేయాలి. 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

11. బంగాళదుంప:

11. బంగాళదుంప:

బంగాళదుంపలో మినిరల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇది చర్మానికి బ్లీచింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. డార్క్ నెస్ తొలగిస్తుంది. బంగాళదుంపను కట్ చేసి, పాదాల మీద మర్ధన చేయాలి,కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకుని, మాయిశ్చరైజ్ చేసుకోవాలి.

12. శెనగపిండి:

12. శెనగపిండి:

శెనగపిండిలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి, స్ర్కబ్ చేయాలి. డార్క్ ఫీట్ నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుది. దీంతో ఇన్ స్టాంట్ రిజల్ట్ పొందుతారు.

English summary

Home Remedies For Dark Feet That We Bet Can Work Wonders!!

Our feet are always working. Well, almost all the time. So, it's natural for them to end up looking bad. In this case, home remedies for dark feet would surely help you. We often forget to take care of our feet. Even though the feet may be the most hard-working part of us, they often get ignored in terms of care
Story first published: Friday, September 30, 2016, 17:37 [IST]
Desktop Bottom Promotion